Jio Vs Airtel : రిలయన్స్ జియో, భారతీయ ఎయిర్టెల్ భారత దేశంలోనే ఉన్న ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలు. ఈ రెండు సంస్థలు ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం చౌకైన ప్లాన్స్ ను అందిస్తున్నాయి. ఒకదానికొకటి పోటీ పడుతూ బెస్ట్ ప్లాన్స్ ను అది తక్కువ ధరలకే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. నిజానికి రెండు కంపెనీలు తన ప్లాన్స్ ధరలను పెంచేసాయి. అయితే కస్టమర్ల సదుపాయం కోసం ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అందిస్తున్నాయి. ఇందులో ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాలింగ్, SMSతో పాటు పలు సౌకర్యాలను సైతం అందిస్తుంది. అయితే నిజానికి అసలు ఈ రెండు టెలికాం సంస్థల్లో ఏది బెస్ట్ ప్లాన్స్ అందిస్తుంది. ఏ ప్లాన్ కొంటే బెటర్ అనే విషయంపై ఓసారి చూద్దాం.
జియో, ఎయిర్టెల్ ధరలు పెంచినప్పటికీ డేటా ప్యాక్, అపరిమిత కాలింగ్, SMSతో వేరువేరు ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ ను తీసుకొస్తున్నప్పటికీ అసలు ఈ ప్లాన్స్ లో ఏం సెలెక్ట్ చేసుకోవాలో వినియోగదారులకి తెలియడం లేదు. అయితే అసలు ఏ ప్లాన్స్ ఏ ధరకు ఉన్నాయో ఒకసారి చూద్దాం
రిలయన్స్ జియో – ప్రస్తుతం Jio రూ. 349, రూ. 449తో 2 ప్లాన్‌లను కలిగి ఉంది. ఈ రెండు ప్లాన్‌ల మధ్య రూ. 100 వ్యత్యాసం ఉంది. అయితే రూ. 449 ప్లాన్ లో బిల్లు 18% GSTతో వస్తుంది. రూ. 349 ప్లాన్ రూ. 411.82కు, రూ. 449 ప్లాన్ నెలకు రూ. 529.82తో అందుబాటులో ఉంది. అపరిమిత 5G డేటా ఆఫర్‌ను Jio అందిస్తుంది.
జియో రూ. 349 పోస్ట్‌పెయిడ్ ప్లాన్.. 30GB డేటాను ఇస్తుంది. ఈ డేటా అయిపోయాక ప్రతి GBకి 10 రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది. ఈ ప్లాన్‌తో కంపెనీ ఎలాంటి అదనపు సిమ్ కార్డ్ సౌకర్యాన్ని అందించదు. అపరిమిత కాలింగ్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో అందిస్తుంది. Jio రూ.449 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 75 GB డేటా, అపరిమిత కాలింగ్, 100 SMSలు ప్రతిరోజూ అందిస్తుంది. ఇందులో కూడా ఒక్కో జీబీకి రూ.10 వసూలు చేస్తుంది. అందులో 3 ఫ్యామిలీ సిమ్ కార్డులు ఉన్నాయి.
ఎయిర్‌టెల్ – Airtel నెలవారీ రూ. 449తో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 100 SMS, ఏదైనా స్థానిక STD, రోమింగ్ నంబర్‌లలో అపరిమిత వాయిస్ కాల్స్, 200GB వరకు డేటా రోల్‌ఓవర్‌తో 50GB నెలవారీ డేటాను అందిస్తుంది. అదనంగా కస్టమర్స్ ఈ రీఛార్జ్‌తో 5G ఉన్న ప్రాంతాల్లో 5G హ్యాండ్‌సెట్‌లో కాంప్లిమెంటరీ అపరిమిత 5G డేటాను సైతం అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రివార్డ్స్ ప్రయోజనాలలో 3 నెలల పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం కూడా ఉంటుంది. అదనంగా, కస్టమర్‌లు రూ. 349తో తమ ప్లాన్‌కు మరిన్ని ఫ్యామిలీ కనెక్షన్‌లను జోడించవచ్చు. మీ సర్కిల్‌ను బట్టి రూ. 250 లేదా రూ. 300 యాక్టివేషన్ ఛార్జ్ ఉంటుంది.
ఇక Jio నెట్‌వర్క్‌ని ఉపయోగించాలనుకునే కస్టమర్స్, ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదనుకునే వినియోగదారులు జియో ప్లాన్స్ ను ఎంచుకోవచ్చు. ఇక రోమింగ్ తో పాటు స్థానిక STD కాల్స్ సదుపాయం సైతం కావాలనుకుంటే ఎయిర్టెల్ ను ఎంచుకోవచ్చు.
ALSO READ : గిరిజనుల కోసం ఆర్బిఐ మరో ముందడుగు.. సంతాలీ భాషల్ బుక్ లెెట్స్ రిలీజ్