BigTV English

Pancreatic Cancer:- ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను మూడేళ్లకు ముందే కనిపెట్టే ఏఐ…

Pancreatic Cancer:- ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను మూడేళ్లకు ముందే కనిపెట్టే ఏఐ…


Pancreatic Cancer:- ఏఐ సాధించలేనిది ఏముంది? మనిషి సాధించలేని, చేయలేని విషయాలు కూడా ఏఐ చేసి చూపిస్తుంది అంటున్నారు పలువురు టెక్ నిపుణులు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేది టెక్ ప్రపంచంలో అడుగుపెట్టి కొంతకాలమే అయినా దీనిని నమ్మి ప్రతీ రంగంలో దీనికి చోటిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా మెడికల్ రంగంలో ఏఐ రోజురోజుకీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ముందుకెళ్తోంది. ఎన్నో ప్రాణాంతక వ్యాధులను గుర్తించడానికి ఉపయోగపడుతోంది.

క్యాన్సర్ అనేది ప్రస్తుతం ఎన్నో విధాలుగా మనుషులను బాధపెడుతూ ఉంది. అంతే కాకుండా మనుషుల మరణాలకు కూడా కారణమవుతోంది. అందుకే క్యాన్సర్‌ను ముందుగా కనిపెట్టడానికి, దానికి మెరుగైన చికిత్స అందించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఆ విషయంలో ఏఐ తమకు సాయంగా ఉంటుందని వారు నమ్ముతున్నారు. వారు నమ్మినట్టుగానే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను చాలా ముందుగా కనిపెట్టడానికి ఏఐ ఉపయోగపడింది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బయటపడే మూడేళ్ల ముందే ఏఐ అది సోకే రిస్క్‌ను బయటపెడుతుందని తేలింది.


కేవలం పేషెంట్ మెడికల్ రికార్డుల ద్వారా మూడేళ్ల ముందే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ రిస్క్‌ను కనిపెడుతంది ఏఐ. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది అడ్వాన్స్ స్టేజ్‌కు వచ్చేవరకు బయటపడదు. అలా బయటపడిన తర్వాత కూడా ఇప్పుడు ఉన్న చికిత్స విధానాల వల్ల పేషెంట్లు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి క్యాన్సర్‌ను ముందస్తుగానే కనిపెట్టడానికి ఏఐ సాయం చేయడం చాలా సంతోషకరమైన విషయమని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రకాలలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది చాలా భయంకరమైనది. ఇది సోకినవారు బతికే అవకాశాలు చాలా తక్కువ. ప్రతీ ఏడాది దీని వల్ల మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను కనిపెట్టడానికి మెరుగైన ప్రక్రియలు ఏవీ అందుబాటులో లేవు. తమ కుటుంబంలో ఎవరైనా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వల్ల మరణించారా, లేదా కుటుంబంలో లేదా వారిలో జెనటిక్ లోపాలు ఉన్నాయా.. ఇలాంటి విషయాల ద్వారానే ఈ క్యాన్సర్‌ను కనిపెడుతూ ఉన్నారు. అయితే ఈ క్యాటగిరీలలో రాని పేషెంట్ల క్యాన్సర్‌ను తొందరగా కనిపెట్టడం వీలుపడడం లేదు. ఇప్పుడు ఏఐ ఈ విషయంలో చాలామంది పేషెంట్లకు సాయంగా నిలబడనుంది.

Tags

Related News

Moon Dust Bricks: చంద్రుడిపై ఇల్లు కట్టేందుకు ఇటుకలు సిద్ధం.. ‘మూన్ డస్ట్ బ్రిక్స్’ మెషిన్ సిద్ధం చేసిన చైనా సైంటిస్ట్

iQOO Z10 4G: 6,000mAh బ్యాటరీతో వచ్చిన కొత్త iQOO Z10 4G.. ఫీచర్లు ఏంటో చూడండి!

Realme P4 5G: గేమింగ్ ప్రేమికుల కలల ఫోన్ వచ్చేస్తోంది.. దీని ఫీచర్స్ ఒక్కొక్కటి అదుర్స్..!

Smartphone market: సూపర్ షాట్ కొట్టిన స్మార్ట్ ఫోన్ ఏది? ఈ జాబితాలో మీ ఫోన్ ర్యాంక్ ఎంత?

Zoom Meeting: జూమ్ మీటింగ్‌లో టీచర్లు మాట్లాడుతుండగా… అశ్లీల వీడియోలు ప్లే చేశారు, చివరకు?

Vivo V60: మార్కెట్ లోకి కొత్త ఫోన్.. హై రేంజ్ ఫీచర్స్ తో.. ఈ మొబైల్ వెరీ స్పెషల్!

Big Stories

×