Air Fryer : స్మార్ట్ ఫోన్ మీ దగ్గర ఉంటే మీరు ప్రమాదంలో ఉన్నట్టేనని మీకు తెలుసా? మీకు తెలియకుండానే మీ స్మార్ట్ ఫోన్ మీపై గూఢచర్యం చేస్తుంది. స్మార్ట్ ఫోన్ ఆడియోను రికార్డ్ చేయడంతో పాటు ఎన్నో విషయాల్ని పసిగడుతుంది. ఇక ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు కిచెన్ లో ప్రతీ ఒక్కరూ ఉపయోగించే హోమ్ అప్లికేషన్స్ సైతం మీపై నిఘా ఉంచిందని తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. చైనాకు చెందిన కొన్ని గృహఉపకరణాలు మీకు తెలియకుండానే మీపై నిఘా ఉంచుతున్నాయి. అసలు తాజాగా జరిగిన అధ్యయనాలు ఏం చెప్తున్నాయి? దీని వెనక ఏం జరుగుతుందో తెలుసుకుందాం?
ఈ హడావిడి జీవితాల్లో ప్రతీ ఒక్కరూ స్మార్ట్ హోమ్ అప్లికేషన్స్ ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎయిర్ ఫ్రైయర్స్ కిచెన్ లో భాగమైపోయాయి. ఇది తేలికగా వంటను పూర్తి చేయటంతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించడానికి సైతం ఎంతో సహాయపడుతున్నాయి. అయితే ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ లో దీని ఉపయోగం మరింత ఎక్కువగా ఉంది. మూడింట రెండు వంతుల మంది ఈ ఎయిర్ ఫ్రయర్ ను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే తాజాగా Market.us నివేదిక తెలిపిన దాని ప్రకారం ఈ ఎయిర్ ఫ్రైయర్స తో ప్రమాదం పొంచి ఉంది. అయితే ఇవి ప్రమాదకరంగా మారటానికి కారణమేంటంటే.. వీటిని ఉపయోగించడానికి ఖచ్చితంగా వాటికి సంబంధించిన యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. దీంతో యూజర్స్ ఎక్కడ నుంచి ఈ పరికరాన్ని ఉపయోగిస్తున్నారు అనే దానికి లొకేషన్ యాక్సిస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా అసలు ఎటువంటి కారణం లేకుండా ఈ ఫ్రైయర్ ను ఉపయోగించడానికి ఆడియో రికార్డ్ యాక్సిస్ సైతం అడుగుతుంది. ఇది నిజంగా ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని ఆ నివేదిక తెలిపింది.
ఈ ఎయిర్ ఫ్రైయర్స్ ఉపయోగించడానికి జెండర్ తో పాటు పుట్టిన తేదీని సైతం ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది. దీంతో మీ జెండర్ తో పాటు ఏజ్ సైతం తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ అసలు ఆ అప్లికెన్స్ ఉపయోగించటానికి ఎందుకు అవసరమో ఎప్పుడైనా ఆలోచించారా? అంటూ ఆ నివేదిక తెలుపుతుంది.
అయితే ఆ నివేదిక తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేసే ఫ్రైయర్స్ రెండు ఉన్నాయి. అవి Aigostar, Xiaomi ఫ్రైయర్‌లు. ఇక ఇవి యాక్సిస్ చేసిన డేటాను చైనా సర్వర్లకు పంపినట్టు తెలుస్తుంది. ఇక ఏదైనా ఒక అప్లికెన్స్ ను ఉపయోగించడానికి అది ఎలా పని చేస్తుంది లేదా దాంతో కలిగే ప్రమాదాలు ఏంటి అనే సమాచారం తెలుసుకోవడానికి యాప్ డౌన్లోడ్ చేసుకున్నా అర్ధం ఉంటుంది కానీ కారణం లేకుండా వ్యక్తిగత సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటో ఆలోచించమని యూజర్స్ ను ఈ నివేదిక హెచ్చరిస్తుంది.
అయితే హెయిర్ ఫ్రైయర్స్ తో పాటు మరికొన్ని పరికరాలు సైతం మీపై నిఘా ఉంచే ఛాన్స్ ఉంది. స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచెస్ పోర్టబుల్ స్పీకర్స్ సైతం నీపై నిఘా ఉంచే ఛాన్స్ ఉంటుందని.. వీటిని ఉపయోగించినప్పుడు అప్రమత్తంగా ఉండాలని టెక్ వర్గాలు సైతం చెప్పుకొస్తున్నాయి.
ALSO READ : సిమ్ కార్డు మిస్ యూజ్, ఆ తప్పు చేశారో జైల్లో చిప్పకూడు తినాల్సిందే!