Air India Wi-Fi: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తన ప్రయాణీకులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. ప్రయాణ సమయంలో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త సంవత్సరం (జనవరి 1) రోజునే దేశీయ విమనాల్లో వైఫై సేవలను ప్రారంభించింది. ఎయిర్ బస్ ఏ350, బోయింగ్ 787-9తో పాటు ఎంపిక చేసిన ఏ321 నియో విమానాల్లో ఈ సదుపాయాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. విమానాల్లో వైఫై సౌకర్యాన్ని ప్రవేశపెట్టిన తొలి భారతీయ విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమ ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా ఉచితంగా వైఫై సేవలను అందిస్తున్నది.
10 వేల ఫీట్ల ఎత్తులోనూ వైఫై సేవలు
అటు ఇంటర్నేషనల్ రూట్స్ లో వైఫై సేవలను ఎయిర్ ఇండియా పైలెట్ ప్రోగ్రామ్ గా షురూ చేసింది. వీటిలో న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ సహా పలు విమానాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు దేశీయ రూట్లలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వైఫై సేవలను నెమ్మదిగా తమ కంపెనీకి చెందిన అన్ని విమానాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఎయిర్ ఇండియా తీసుకొచ్చిన ఈ సర్వీస్ ద్వారా ప్రయాణీకులు ఇంటర్నెట్ ను ఉపయోగించుకోనున్నారు. విమాన ప్రయాణంలో వర్క్ చేసుకోవడంతో పాటు బంధు, మిత్రులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ల్యాప్ టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్ల ద్వారా ఈ సేవలను వాడుకోవచ్చు. 10 వేల ఫీట్ల ఎత్తులోనూ వైఫై సేవలు పొందే అవకాశం ఉంటుంది.
ఇక తమ విమానాల్లో వైఫై సేవల గురించి ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్ పీరియెన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా కీలక విషయాలు వెల్లడించారు. “ప్రస్తుతం ప్రజలు ప్రతిక్షణం ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే మా విమానయాన సంస్థ ప్రయాణీకులకు మెరుగైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించాం. ఈ నిర్ణయంతో ప్రయాణీకులు వర్క్ చేసుకోవడంతో పాటు మరికొంత మంది సోషల్ మీడియా ద్వారా తమ ఫ్రెండ్స్ తో కనెక్ట్ కావచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీని మా ప్రయాణీకులు ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాం” అన్నారు.
Read Also: జంటగా హోటల్‌కు వెళ్తున్నారా? ‘ఓయో’ మాత్రమే కాదు.. ఈ హోటల్స్ కూడా చాలా సేఫ్!
Air India Wi-Fiని ఎలా యాక్సెస్ చేయాలంటే?
⦿ Wi-Fiని ఆన్ చేసి, మీ డివైజ్ లో Wi-Fi సెట్టింగ్స్ లోకి వెళ్లాలి.
⦿ ‘ఎయిర్ ఇండియా వైఫై’ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
⦿ మీ డివైజ్ డిఫాల్ట్ బ్రౌజర్ ద్వారా ఎయిర్ ఇండియా పోర్టల్ కి వెళ్తుంది.
⦿ మీ PNR, లాస్ట్ నేమ్ ను ఎంటర్ చేయాలి.
⦿ వెంటనే మీ డివైజ్ వైఫైకి కనెక్ట్ అవుతుంది.
ఇక ప్రస్తుతం ఈ వైఫై సేవలను ఎయిర్ ఇండియా ఉచితంగానే అందిస్తున్నది. భవిష్యత్ లో ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మరికొద్ది రోజుల్లోనే తమ విమానయాన సంస్థకు చెందిన అన్ని విమానాల్లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నది.
Read Also: వందే భారత్‌లో కశ్మీర్‌కు వెళ్లాలా? ఇవిగో ట్రైన్ టైమింగ్స్.. వెంటనే బుక్ చేసేసుకోండి!