E-Paper
Advertisement

సీసీ కెమెరా కాకుండా ఇంటి సేఫ్టీ కోసం..ఈ స్మార్ట్ గాడ్జెట్లు బెస్ట్

సీసీ కెమెరా కాకుండా ఇంటి సేఫ్టీ కోసం..ఈ స్మార్ట్ గాడ్జెట్లు బెస్ట్
Advertisement

Smart home security: ప్రస్తుత కాలంలో.. ఇళ్ల సేఫ్టీ అనేది కేవలం ఒక సాధారణ తాళం చెవికి లేదా మూలన పెట్టే కెమెరాకు పరిమితం కాలేదు. నేడు సీసీటీవీలపై మాత్రమే ఆధార పడటం కంటే మల్టీ-లేయర్డ్ సెక్యూరిటీ సిస్టమ్ వాడటం చాలా ముఖ్యం. ఎందుకంటే.. సీసీటీవీ రికార్డింగ్ అనేది నేరం జరిగిన తర్వాత సాక్ష్యంగా పనికొస్తుంది. కానీ ప్రమాదం జరగకుండా ముందే అడ్డుకోవడానికి స్మార్ట్ పరికరాలు అవసరం. మార్కెట్లో అందుబాటులో.. ఉన్న అద్భుతమైన స్మార్ట్ సేఫ్టీ ఆప్షన్లు, వాటి ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. స్మార్ట్ డోర్ లాక్స్ :

పాత కాలం నాటి తాళాలు ,తాళం చెవులకు కాలం చెల్లింది. బయోమెట్రిక్ లేదా డిజిటల్ స్మార్ట్ డోర్ లాక్స్ ద్వారా ఇంటి మెయిన్ డోర్‌కు సేఫ్టీ లభిస్తుంది. వీటిని ఫింగర్ ప్రింట్, పాస్‌వర్డ్ , ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డ్ లేదా స్మార్ట్‌ ఫోన్ యాప్ ద్వారా మాత్రమే ఓపెన్ చేయగలం. ఒక వేళ ఎవరైనా తప్పు పాస్‌వర్డ్‌తో లాక్ తెరవడానికి ప్రయత్నిస్తే వెంటనే మన ఫోన్‌కు అలర్ట్ వస్తుంది.

Advertisement

ధర: సుమారు రూ. 8,000 నుంచి రూ. 25,000 వరకు లభిస్తున్నాయి (బ్రాండ్ ,ఫీచర్లను బట్టి మారుతుంది).

2. వీడియో డోర్ బెల్స్ :

ఇంటి బయట ఎవరైనా డోర్ బెల్ కొట్టగానే..మనం ఇంట్లో లేకపోయినా మన స్మార్ట్‌ ఫోన్ ద్వారా వాళ్లతో మాట్లాడొచ్చు. ఇందులో.. ఉండే మోషన్ డిటెక్షన్ ఫీచర్ వల్ల డోర్ ముందు ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే.. ఇట్టే తెలిసిపోతుంది. నైట్ విజన్ కెపాసిటీ ఉండటం వల్ల చీకట్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

Advertisement

ధర: బ్రాండ్‌ను బట్టి రూ. 3,000 నుంచి రూ. 9,000 వరకు ఉంటుంది.

3. మోషన్, డోర్ సెన్సార్లు:

ఇంటి సేఫ్టీలో ఇవి అత్యంత కీలకం. తలుపులు లేదా కిటికిలు ఎవరైనా బలవంతంగా తెరిస్తే చాలు, ఈ డోర్ సెన్సార్లు వెంటనే.. గుర్తించి పెద్ద సౌండ్‌తో సైరన్ మోగిస్తాయి. అదే విధంగా మోషన్ సెన్సార్లు ఇంట్లోకి.. అనధికారికంగా ఎవరైనా ప్రవేశిస్తే క్షణాల్లో పసిగడతాయి. ఇవి ఇంటర్నెట్ లేదా జిగ్‌బీ టెక్నాలజీతో పని చేస్తాయి.

ధర:ఒక్కో సెన్సార్ రూ.1,500 నుంచి రూ.3,000వరకు ఉంటుంది.

4. స్మార్ట్ సైరన్లు, అలారాలు:

ఇంటికి ఎలాంటి ముప్పు వాటిల్లినా ఈ స్మార్ట్ సైరన్లు 100 డెసిబెల్స్‌కు పైగా తీవ్రమైన సౌండ్ చేస్తాయి. ఇది దొంగలను భయ పెట్టడమే కాకుండా చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేస్తుంది. దీన్ని మన మొబైల్ యాప్‌తో కంట్రోల్ చేయెచ్చు.

ధర: రూ. 2,000 నుంచి రూ. 4,000 వరకు ఉంటుంది.

Also Read: క్రేజీ ఫీచర్లతో మార్కెట్‌ను షేక్ చేస్తున్న Huawei MatePad 11.5..ధర ఎంతంటే?

కేవలం ఒక సీసీ కెమెరాతో పోలిస్తే ఈ స్మార్ట్ డివైజెస్‌తో కూడిన వ్యవస్థ చాలా ప్రభావ వంతంగా పని చేస్తుంది. వీటి ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇవి సమస్యను రికార్డ్ చేయడం మాత్రమే కాకుండా, ప్రమాదం ప్రారంభమయ్యే ముందే మనల్ని అప్రమత్తం చేస్తాయి. వైఫై ,మొబైల్ నోటిఫికేషన్ల ద్వారా మనం ఎక్కడ ఉన్నా ఇంటి సేఫ్టీని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చు. కాబట్టి.. మీ ఇంటిని పూర్తిగా సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ స్మార్ట్ గాడ్జెట్లను కొనడం చాలా అవసరం.

Related News

షారుఖ్ వాచ్ ధర రూ.1.8కోట్లు..ప్రపంచంలో 22 మంది దగ్గరే ఉన్నఈ రేర్ పీస్ ప్రత్యేకతలివే!

యాపిల్ బిగ్ ట్విస్ట్.. సెప్టెంబర్‌లో iPhone 18 రావట్లేదట, మరెప్పుడు లాంచ్ అవుతుందో తెలుసా?

చిప్స్ ప్యాకెట్లు కొంటారు కానీ రీఛార్జ్‌కు ఎందుకు ఆలోచిస్తున్నారు? ధరల పెంపుపై ఎయిర్‌టెల్ అధినేత షాకింగ్ కామెంట్స్!

స్మార్ట్‌ఫోన్ స్లో అవ్వడానికి అసలు కారణాలివే.. ఇలా చేస్తే మళ్లీ రాకెట్‌లా పనిచేస్తుంది!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండానే కొత్త ఫోన్‌లోకి eSIM ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా!

రూ.699కే బ్లూటూత్ హెడ్‌ఫోన్..స్టూడెంట్స్ కోసం పర్ఫెక్ట్

రూ.29 వేలకే లక్ష రూపాయల Samsung Galaxy S25 5G.. ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్!

Big Stories

Advertisement
×