E-Paper
Advertisement

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండానే కొత్త ఫోన్‌లోకి eSIM ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండానే కొత్త ఫోన్‌లోకి eSIM ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా!
Advertisement

eSIM Transfer: కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు పాత ఫోన్‌లోని సిమ్ కార్డు తీసి కొత్త దాంట్లో వేసుకోవడం మనందరికీ అలవాటే. కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ఫోన్లలో అసలు సిమ్ ట్రేనే కనిపించడం లేదు. ఫిజికల్ సిమ్ స్థానంలో ఇ-సిమ్ (eSIM) టెక్నాలజీ వచ్చేసింది. మరి ఇలాంటి టైమ్‌లో పాత ఫోన్‌లోని ఇ-సిమ్‌ను కొత్త ఫోన్‌లోకి మార్చుకోవాలంటే.. టెలికాం స్టోర్ల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. ఇంట్లోనే కూర్చుని మీ ఫోన్ సెట్టింగ్స్ లేదా యాప్స్ ద్వారా కేవలం నిమిషాల్లో ఈ పని పూర్తి చేయొచ్చు. ముఖ్యంగా రెండు నంబర్లు వాడేవారికి ఇది చాలా బాగా ఉపయోగపడే విషయమనే చెప్పాలి.

ముందుగా ఇవి చెక్ చేయండి:

ఇ-సిమ్ మార్చుకునే ముందు మీ కొత్త ఫోన్‌కు ఇ-సిమ్ సపోర్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ప్రాసెస్ మధ్యలో ఆగిపోకుండా రెండు ఫోన్లను మంచి స్పీడ్ ఉన్న వై-ఫైకి కనెక్ట్ చేయండి. కొత్త ఫోన్‌లో సిగ్నల్ పూర్తిగా వచ్చేంత వరకు పాత ఫోన్‌ను మీ దగ్గరే ఉంచుకోవడం మర్చిపోవద్దు.

జియో, ఎయిర్‌టెల్ ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్:

Advertisement

ముందుగా మీ కొత్త ఫోన్ డయల్ ప్యాడ్‌లో *#06# కొట్టి స్క్రీన్‌పై వచ్చే 32 అంకెల EID నంబర్‌ను రాసి పెట్టుకోండి. మీరు జియో యూజర్ అయితే పాత ఫోన్‌లోని MyJio యాప్ ఓపెన్ చేసి Switch to eSIM ఆప్షన్‌లోకి వెళ్లండి. అక్కడ కొత్త ఫోన్ EID నంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో వెరిఫై చేయాలి. రెండు గంటల తర్వాత జియో నుంచి ఒక ఆటోమేటెడ్ కాల్ వస్తుంది, దాన్ని కన్ఫర్మ్ చేస్తే మీ మెయిల్‌కు క్యూఆర్ కోడ్ వస్తుంది.

కొత్త ఫోన్‌తో దాన్ని స్కాన్ చేస్తే సిమ్ యాక్టివేట్ అయిపోతుంది. ఇక ఎయిర్‌టెల్ యూజర్లు Airtel Thanks యాప్‌లో Get eSIM for another device ఆప్షన్ ఎంచుకుని EID నంబర్ ఇవ్వాలి. ఓటీపీ, కాల్ వెరిఫికేషన్ పూర్తయ్యాక కొత్త ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఇ-సిమ్ ప్రొఫైల్ డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది.

Advertisement

Also Read: రూ.29 వేలకే లక్ష రూపాయల Samsung Galaxy S25 5G.. ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్!

ఫోన్ టు ఫోన్ డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్:

మీరు ఐఫోన్ వాడుతుంటే ఈ పని మరింత సులువు. పాత ఐఫోన్ నుంచి కొత్త ఐఫోన్‌కు నేరుగా ఇ-సిమ్ మార్చుకోవచ్చు. రెండు ఫోన్లలో బ్లూటూత్, వై-ఫై ఆన్ చేసి పక్కపక్కనే పెట్టండి. కొత్త ఫోన్ సెట్టింగ్స్‌లో Add eSIM నొక్కితే పాత ఫోన్ నుంచి డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ 14 లేదా ఆపై వెర్షన్ ఉన్న కొన్ని లేటెస్ట్ ఫోన్లలో కూడా జియో ఈ డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ సదుపాయాన్ని ఇస్తోంది.

ఈ తప్పులు చేయొద్దు:

కొత్త ఫోన్‌లో పూర్తిగా సిగ్నల్ వచ్చేవరకు పొరపాటున కూడా పాత ఫోన్‌లోని ఇ-సిమ్‌ను డిలీట్ చేయకూడదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. భద్రతా కారణాల వల్ల ఇ-సిమ్ మారిన తర్వాత 24 గంటల వరకు మీ నంబర్‌కు ఎస్ఎంఎస్‌లు రావు, వెళ్లవు. కాబట్టి ఆ ఒక్కరోజు బ్యాంకింగ్ పనులు లేదా కొత్తగా యూపీఐ యాప్స్ లాగిన్ చేయడం లాంటివి పెట్టుకోకుండా ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది.

Also Read: వాట్సప్ గ్రూప్ చాట్‌లో ఇన్నాళ్లూ ఎదురుచూసిన ఫీచర్ వచ్చేసింది.. ఈ 4 మార్పులను గమనించారా?

Tags

Related News

రూ.699కే బ్లూటూత్ హెడ్‌ఫోన్..స్టూడెంట్స్ కోసం పర్ఫెక్ట్

రూ.29 వేలకే లక్ష రూపాయల Samsung Galaxy S25 5G.. ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్!

గేమింగ్ ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్నారా?వీటిని మించినవి లేవు!

వాట్సప్ గ్రూప్ చాట్‌లో ఇన్నాళ్లూ ఎదురుచూసిన ఫీచర్ వచ్చేసింది.. ఈ 4 మార్పులను గమనించారా?

రహస్యంగా వీడియోలు తీయడానికి నో ఛాన్స్.. ప్రైవసీకి పెద్దపీట వేస్తూ గూగుల్ కొత్త స్మార్ట్ గ్లాసెస్!

ఫ్రై,బేక్,గ్రిల్ అన్నీ ఒక్క చోటే!రూ.2,599కే ఎయిర్ ఫ్రైయర్

చిరు వ్యాపారులకు NPCI బంపర్ ఆఫర్.. యూపీఐ వాడితే ఇకపై క్యాష్‌బ్యాక్, సౌండ్ బాక్స్ ఫ్రీ!

Big Stories

Advertisement
×