Bigg boss 10:అగ్ని పరీక్ష సీజన్ 2 లో నవరసాలు పండించి, జడ్జెస్ ను మెప్పించినప్పటికీ హౌస్ లోకి రావడం లో కాస్త ఆలస్యమైంది రామకృష్ణకి. అయితే ఆలస్యం అయినా సరే రావడం పక్కా అన్నట్టు ..మూడవ వారంలోనే మిథిలేష్, అపూర్వలతో కలిసి హౌస్ లోకి రావాల్సి ఉండగా.. మిథిలేష్ – రామకృష్ణ మధ్య జరిగిన టాస్క్ లో మిథిలేష్ గెలిచి .. హౌస్ లోకి వచ్చిన రెండు రోజుల్లోనే రూ.15 లక్షల సూట్ కేస్ ఆఫర్ తీసుకొని సంచలనం సృష్టించాడు . ఇకపోతే వైల్డ్ కార్డు ద్వారా కామనర్ రామకృష్ణ హౌస్ లోకి వచ్చారు. నవరసాలు అంటూ హౌస్ లోకి వచ్చి.. ఇక్కడేదో నవరసాలు పండిస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎక్కడో ఒక మూలన ఉంటూ తన పని ఏదో తాను చేసుకుంటూ పోతున్నట్లు బిహేవ్ చేశారు.
ఇక ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కెమెరా ముందు కనిపించే ప్రయత్నం చేస్తున్నారు రామకృష్ణ. అలాంటి రామకృష్ణ నిన్న జరిగిన ఎపిసోడ్ లో దేబ్జానీ తో గొడవ పడడం, అసలు మీకు ఎవరికీ నాతో ఆడే దమ్ము లేదు అంటూ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అంతేకాదు అటు త్రిగుణ్ కూడా రామకృష్ణ అమాయకుడు కాదు అంటూ చేసిన కామెంట్లు కూడా వైరల్ గా మారుతున్నాయి. అతడు ఒక పెద్ద కంత్రి గాడు అంటూ త్రిగుణ్ రామకృష్ణపై కామెంట్లు చేశారు. ఇకపోతే రామకృష్ణ గురించి త్రిగుణ్ రాంప్రసాద్ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సడన్గా రాంప్రసాద్ – రామకృష్ణ మధ్య గొడవ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇకపోతే ఈ గొడవకు సంబంధించిన విజువల్స్ ను ప్రోమోలలో రిలీజ్ చేయలేదు.. కానీ 24 * 7 హాట్ స్టార్ స్ట్రీమింగ్ లో ఈ గొడవ కాస్త బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.ఇంతకీ వీరిద్దరి మధ్య గొడవ ఏంటి అనే విషయం పూర్తిగా తెలియదు కానీ వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం వీళ్ళిద్దరూ ఏదో డబ్బుల కోసం గొడవ పడుతున్నట్లు తెలుస్తోంది
also read:చెల్లి కోసం సెట్ చేస్తే.. అక్క లవ్ లో దింపిందా.. నిజాలు బయటపెట్టిన సమీరా!
గొడవ విషయానికొస్తే.. రామకృష్ణ మాట్లాడుతూ.. డబ్బులు ఇచ్చాను మీకు అని రాంప్రసాద్ తో అన్నాడు.. నేను నీకు మాట ఇచ్చాను.. కాపాడతానని అని రామ్ ప్రసాద్ అనడం, ఆ తర్వాత రామకృష్ణ మాట్లాడుతూ ..”ఎందుకు ఇచ్చారు మాట? అని అన్నారు. ఆ తర్వాత రాంప్రసాద్ మాట్లాడుతూ “నువ్వు అడిగావు కాబట్టే నేను నీకు మాట ఇచ్చాను. అందుకే నిన్ను బయటకు పంపలేదు “అంటూ రాంప్రసాద్ చెప్పాడు. దానికి రామకృష్ణ..” నువ్వెందుకు అలా అన్నావు అంటే నేను నీకు డబ్బులు ఇచ్చాను కాబట్టి.. నువ్వు నాకు మాట ఇచ్చావు” అని అన్నాడు. ఇక రాంప్రసాద్ మాట్లాడుతూ..” నీ డబ్బులు కదా రేపు ఉదయమే గూగుల్ పే చేస్తాను బయటకెళ్ళిపో ఇప్పుడు” అంటూ రాంప్రసాద్ ఫైర్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే వీరిద్దరి మధ్య అసలు దేని గురించి ఈ సంభాషణ వచ్చిందో తెలియదు కానీ డబ్బులు ఇవ్వడం ఏంటో..ఫోన్ పే చేయడం ఏంటో అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Orey RP 🤣🤣🤣🤣🤣google pay entra😭#BiggBossTelugu10 pic.twitter.com/khlB0YA5rD
— Drugdoctor2 (@ManBeingAlpha2) November 27, 2026