Kashmiri Dum Aloo: కాశ్మీర్ వంటకాల గురించి చెప్పగానే ముందుగా గుర్తొచ్చే ప్రత్యేకమైన వంటకాల్లో ‘దమ్ ఆలూ’ కూడా ఒకటి. చిన్న చిన్న బంగాళాదుంపలను సుగంధభరితమైన మసాలాలు, పెరుగు గ్రేవీలో నెమ్మదిగా ఉడికించి తయారుచేసే ఈ కూర రుచి ఎంతో ప్రత్యేకం. మసాలాల ఘాటు, పెరుగు అందించే చిక్కదనం కలిపి ప్రతి ముద్దను మరింత రుచిగా మారుస్తాయి. చపాతీ, పుల్కా, జీరా రైస్‌తో వడ్డిస్తే అద్భుతమైన కాంబినేషన్‌గా ఉంటుంది. మరి ఈ కాశ్మీరీ స్పెషల్ దమ్ ఆలూను ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో చూద్దామా..
చిన్న బంగాళాదుంపలు – అర కిలో
పెరుగు – ఒక కప్పు
కారం – ఒక టీస్పూన్
సోంపు పొడి – ఒక టీస్పూన్
అల్లం పొడి – అర టీస్పూన్
Also Read: చీజ్ లవర్స్‌కు తప్పకుండా నచ్చే ‘ఎగ్‌ప్లాంట్ పార్మిజియానా’.. లొట్టలేసుకుంటూ తినడం ఖాయం!
ఇంగువ – పావు టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్
నూనె – సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా
చిన్న చిన్న బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి. పొట్టు తీసి ఫోర్క్‌తో అక్కడక్కడా చిన్న రంధ్రాలు చేయాలి. బాణలిలో నూనె వేడి చేసి బంగాళాదుంపలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకుని అందులో కారం, సోంపు పొడి, అల్లం పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. మరో బాణలిలో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఇంగువ వేయాలి. ఇప్పుడు పెరుగు మిశ్రమాన్ని వేసి తక్కువ మంటపై కలుపుతూ ఉడికించాలి.
మసాలా నుంచి నూనె పైకి తేలిన తర్వాత వేయించిన బంగాళాదుంపలను వేసి గ్రేవీ పట్టేలా కలపాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి చిన్న మంటపై 10 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి. బంగాళాదుంపలకు మసాలా బాగా పట్టి గ్రేవీ చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి.
Also Read: ఐస్‌క్రీమ్‌ను ఇలా కూడా తయారుచేయొచ్చా? ఈ జపనీస్ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!