Rules Change From 1st October: నేటితో సెప్టెంబర్ నెల ముగియనుంది. రేపటి నుంచి అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రతినెల మాదిరిగా వచ్చే నెలలో పలు నిబంధనలు మారనున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి ఆధార్ కార్డుతో పాటు ఇన్వెస్టింగ్స్, సేవింగ్స్, పీపీఎఫ్, ట్యాక్స్ వంటికి సంబంధించిన వాటిలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ నిబంధనలతో జేబుకు చిల్లు పడనుంది. అయితే రానున్న అక్టోబర్ నెలలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయో తెలుసుకుందాం.
స్మాల్ సేవింగ్స్ రూల్స్ అక్టోబర్ 1 నుంచి మారనున్నాయి. ఇందులో పీపీఎఫ్ అనగా ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల కింద తెరిచిన అకౌంట్ నిబంధనలు మారనున్నాయి. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద తెరిచిన ఖాతాను బాలిక తల్లిదండ్రులు లేదా గార్డియన్ పేరిట మార్చనున్నారు. కాగా, రెగ్యులర్ కానీ నేషనల్ స్మాల్ సేవింగ్స్ పై కొంత ప్రభావం చూపనుంది.
ఐసీఐసీఐ బ్యాంకు వెబ్ సైట్ ప్రకారం.. ఐసీఐసీఐ తమ ఖాతాదారుల కోసం ప్రత్యేకంగా రెండు కొత్త డెబిట్ కార్డ్ బెనిఫిట్స్‌ను ప్రవేశ పెట్టంది. వీటి ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి క్వార్టర్ లో రూ.10వేల వరకు ఖర్చు చేసిన యెడల తర్వాతి మూడు నెలల్లో రెండు కాంప్లిమెంటర్ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందే అవకాశం ఉండనుంది.
ఆర్బీఐ రూల్ ప్రకారం.. వచ్చే నెల నుంచి పలు బ్యాంకులు, రుణాలు పొందే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చే రిటైల్ లోన్స్ నిబంధనలు మారనున్నాయి .ఇందులో భాగంగా కేఎఫ్ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది. రుణాలపై వసూలు చేసే వడ్డీ, రుణ ఒప్పంద నిబంధనలు పూర్తి వివరాలతో కేఎఫ్ఎస్‌ను రుణాలు తీసుకుంటున్న గ్రహీతలకు అందించాల్సి ఉంటుంది.
Also Read: వందే భారత్ స్లీపర్ ట్రైన్లకు బ్రేక్.. ఎందుకంటే?
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో పలు నిబంధనలు మార్చింది. పన్ను నిబంధనల్లో భాగంగా నేరుగా స్థిరాస్తి విక్రయాలపై పడనుంది. దీంతో అక్టోబర్ 1 నుంచి రూ.50 లక్షల కంటే ఎక్కువ విలువతో కూడిన ఆస్తులను విక్రయించినట్లయితే వాటిపై తప్పనిసరిగా 1 శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్లో ప్రతినెలా మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేసే అవకాశం ఉండనుంది. పాన్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ ఎన్ రోల్ మెంట్ ఐడీని అనుమతి ఉండదు. ఇక, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ మీద సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను పెరగనుంది.