E-Paper
Advertisement

పాకిస్తాన్ తిక్క కుదిర్చిన ఇంగ్లాండ్..ఐపీఎల్ ఆడేందుకు జై కొట్టిన ప్లేయ‌ర్లు

పాకిస్తాన్ తిక్క కుదిర్చిన ఇంగ్లాండ్..ఐపీఎల్ ఆడేందుకు జై కొట్టిన ప్లేయ‌ర్లు
Advertisement

ECB Prioritises IPL Over Pakistan ODI Series:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ కు సంబంధించిన అప్డేట్స్ వరుసగా వస్తూనే ఉన్నాయి. డిసెంబర్ 16వ తేదీన ఐపీఎల్ వేలం గోవాలో నిర్వహించనున్నారు. 2027 సంవ‌త్స‌రం మార్చి 15న‌ ఈ మెగా టోర్నమెంట్ షురూ కానుంద‌ని అంటున్నారు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇంగ్లాండ్ ఝ‌ల‌క్ ఇచ్చింది. 2027లో పాకిస్తాన్ తో జరిగే వన్డే సిరీస్ నేపథ్యంలో కీల‌క ప్లేయర్లు అందుబాటులో ఉండడం లేదని తేల్చిపారేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.

ఐపీఎల్ 2027 టోర్నమెంట్ ఉన్న నేపథ్యంలో ఆ ప్లేయర్లు అందుబాటులో ఉండలేరని చేతులెత్తేసింది. ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను మాత్రమే ఆ టోర్నమెంట్ లో దించుతామని వెల్లడించింది. దీంతో పాకిస్తాన్ ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ నేప‌థ్యంలో ఇంగ్లాండ్ పై ఆడి, ఆత్మ విశ్వాసం పెంచుకుందామ‌ని స్కెచ్ వేసిన పాకిస్తాన్ ఆశ‌ల‌పై ఇంగ్లాండ్ నీళ్లు చల్లింది. ఈ న్యూస్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

అస‌లు పాకిస్తాన్‌, ఇంగ్లాండ్ వ‌న్డే సిరీస్ గొడ‌వ ఏంటి ?

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 2027 సంవత్సరం మే 15 నుంచి మే 26 మధ్య 5 వన్డే మ్యాచ్ ల‌ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. మొత్తం 5 వేదికలలో ఈ వన్డే సిరీస్ నిర్వహిస్తారు. 2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందు ఈ మెగా టోర్నమెంట్ జరిగితే ఖచ్చితంగా పాకిస్తాన్ కు పాజిటివ్ గా మారుతుంది. అందుకే పక్కా ప్లానింగ్ తో వరల్డ్ కప్ కంటే ముందు బలమైన ఇంగ్లాండ్ తో ఈ వన్డే సిరీస్ ఆడేలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లను చేసుకుంది. కానీ పాకిస్తాన్ ప్లాన్ మొత్తం ఐపిఎల్ దెబ్బకు బెడిసికొట్టింది.

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

Advertisement

మే 15 నుంచి 26 తేదీ వరకు ఐపీఎల్ షెడ్యూల్ కూడా ఉన్న నేపథ్యంలో ఇంగ్లాండ్ కు సంబంధించిన కీలక ప్లేయర్లందరూ ఆ టోర్న‌మెంట్ మాత్రమే ఆడతారని తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అప్ప‌ట్లో ఇలాంటి టోర్నమెంట్లు జరిగితే ఐపీఎల్ జరుగుతుండగానే తమ ఇంగ్లీష్ క్రికెటర్లను బోర్డు పిలిచేది. కానీ ఈ సారి అలా జరగకుండా బీసీసీఐ – ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుల మధ్య ఒప్పందం కుదిరింది. అంటే పాకిస్తాన్ తో జరిగే వన్డే సిరీస్ సందర్భంగా ఇంగ్లాండ్ కు సంబంధించిన కీలక ప్లేయర్లు ఎవరూ కూడా ఆడ‌ర‌న్న‌మాట. కేవ‌లం బీ గ్రేడ్ ప్లేయ‌ర్లు మాత్ర‌మే బ‌రిలో దిగుతారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తాజాగా తీసుకున్న నిర్ణ‌యం నేప‌థ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు త‌ల‌లు ప‌ట్టుకుంటోంది.

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

Related News

కాళ్లు మొక్కినా ఆ జ‌ట్టులోకి వెళ్ల‌ను…హార్ధిక్ పాండ్యా సంచ‌ల‌నం !

తెరపైకి శాండ్ పేపర్ వివాదం..బౌండరీ లైన్ దగ్గర నాథన్ లైయన్ ఆడుకున్న ఫ్యాన్స్

సంజీవ్ గోయెంకాకు బుర్రే లేదు..కెప్టెన్సీ పీకేసి ధోనిని అవమానించాడు!

న్యూజిలాండ్, టీమిండియా సిరీస్ పై ICC వెంట‌నే విచార‌ణ చేయాలి!

డారిల్ మిచెల్ గుండు నుంచి పొగ‌లు.. పొయ్యిలో కూర్చున్నాడా ఏంటి?

అభిషేక్‌-వైభ‌వ్ కంటే బాబ‌ర్‌-రిజ్వానే రియ‌ల్ హీరోలు

సానియా మీర్జా సంచ‌ల‌న నిర్ణ‌యం…మసీదు కోసం స్థ‌లం విరాళం ?

Big Stories

Advertisement
×