BigTV English

Realme GT Neo 6 : 50MP కెమెరాతో రియల్ మీ బడ్జెట్ ఫోన్.. మరికొన్ని గంటల్లో లాంచ్!

Realme GT Neo 6 : 50MP కెమెరాతో రియల్ మీ బడ్జెట్ ఫోన్.. మరికొన్ని గంటల్లో లాంచ్!

Realme GT Neo 6 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ చైనీస్ మార్కెట్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. తన బ్రాండ్ నుంచి Realme GT నియో 6 ఫోన్‌ను విడుదల చేయబోతుంది. కంపెనీ వెబ్‌సైట్‌లోని సమచారం ప్రకారం మధ్నాహ్నం 2 గంటలకు ఈ ఫోన్ లాంచ్ అయే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పోస్ట‌ర్‌ను రియల్ మీ ఇప్పటికే టీజ్ చేసింది.


రాబోయే ఫోన్ పర్పుల్ ఎడిషన్ కొత్త పోస్టర్‌తో రివీల్ చేసింది. రియల్ మీ జీటీ నియో 6 ఫోన్ లుక్ Realme GT Neo 6 SE‌ను పోలి ఉంటుంది.  కంపెనీ ఈ ఫోన్‌ను మే 9న చైనాలో సేల్‌కు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ సిరీస్‌లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? ధర తదితర విషయాల గురించి తెలుసుకోండి.

Also Read : ఆఫర్ల జాతర.. బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు, నెక్‌బ్యాండ్‌లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు!


కొత్త రియల్ మీ GT Neo 6 పర్పుల్ ఎడిషన్‌లో తీసుకొస్తున్నట్లు కొత్త పోస్టర్‌తో రివీల్ చేయబడింది. అధికారిక పోస్టర్‌లో రివీల్ చేయబడిన లుక్‌తో Realme GT Neo 6 ఫోన్ కూడా Realme GT Neo 6 SE వంటి డిజైన్‌తో విడుదల కాబోతుంది.  కంపెనీ గత నెలలోనే చైనాలో Realme GT Neo 6 SEని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం రెండు ఫోన్ల కలర్స్‌లో తేడా ఉంది. కంపెనీ Realme GT Neo 6 SEని సిల్వర్ నైట్ , కాంగీ హ్యాకర్ రంగులలో అందిస్తోంది. అదే సమయంలో Realme GT Neo 6 ఫోన్ పర్పుల్ కలర్ ఎంపికలో కనిపిస్తుంది. కానీ రాబోయే ఫోన్‌ను ఏ కలర్‌ ఎంపికలలో తీసుకువస్తుందో ఇంకా తెలియలేదు.

Realme GT Neo 6 ఫీచర్ల విషయానికి వస్తే ఫోన్‌లో కంపెనీ 50MP ప్రైమరీ కెమెరా, OISతో సపోర్టెడ్ లెన్స్‌తో Realme GT Neo 6ని తీసుకువస్తోంది. LED ఫ్లాష్ యూనిట్లు ఫోన్ వెనుక వైపు కూడా కనిపిస్తాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కనిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఫోన్ Snapdragon 8s Gen 3 మొబైల్ ప్లాట్‌ఫారమ్‌తో తీసుకురాబడింది. ఫోన్ 1TB వరకు స్టోరేజ్,120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంటుంది.

Also Read : సేల్స్‌లో రికార్డుల మోత.. వరల్డ్‌వైడ్ టాప్ -10 స్మార్ట్ ఫోన్లు ఇవే!

చైనాలో Realme GT Neo 6 SE 8GB + 256GB  వేరియంట్ ధర రూ. 18,000 నుండి ప్రారంభమవుతుంది. అయితే 12GB + 256GB, 16GB + 256GB ,16GB + 512GB వేరియంట్‌ల ధర రూ. 22,000, రూ. 27,000 వరకు ఉంటాయి. రియల్ మీ GT Neo 6 కూడా ఇదే ప్రైజ్ రేంజ్‌లో తీసుకొచ్చే అవకాశం ఉంది.

Tags

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×