Amazon iPhone 16 Offer : యాపిల్ తన ఐఫోన్ 16 సిరీస్‌ను లాంఛ్ చేసి దాదాపు రెండు నెలలు అయిపోతోంది. ఈ లగ్జరీ అండ్ సెక్యూరిటీ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ విడుదల సమయంలో ఐఫోన్ ప్రియులు దీనిని కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. అయినప్పటికీ కొంతమంది ఈ ఫోన్‌ను ధర గురించి ఆలోచించి కొనలేకపోయారు. భవిష్యత్‌లో డిస్కౌంట్ల రూపంలో తక్కువ ధరకు వచ్చినప్పుడు కొనుగోలు చేసేందుకు ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఇప్పుడా సమయం వచ్చేసింది.
ప్రముఖ ఇ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో అదిరే డిస్కౌంట్ ఆఫర్ ఇప్పుడు ఐఫోన్ 16 అందుబాటులోకి వచ్చేసింది. సాధారణంగా దీని ఒరిజినల్ ధర రూ.79,999. అయితే బ్యాంక్ ఆఫర్స్, ఎక్సేంఛ్ ఆఫర్స్ ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ.70 వేల కన్నా తక్కువగా కొనుగోలు చేయొచ్చు. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేయాలంటే? – ప్రస్తుతం అమెజాన్ వెబ్సైట్లో ఐఫోన్ 16 రూ. 77,900కు అందుబాటులో ఉంది. అంటే ఒరిజినల్ ధరతో (రూ.79,900) పోలిస్తే రూ.2 వేల రూపాయలను డిస్కౌంట్ ఇస్తోంది అమెజాన్. ఇదే సమయంలో ఈ ఐఫోన్ 16 పై మరి కొన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది అమెజాన్. బ్యాంక్ ఆఫర్లను ఇస్తోంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ, అమెజాన్, కొటాక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా రూ. 5 వేల ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. అంటే దీని ద్వారా ఐఫోన్ 16 రూ. 72,900కు దక్కించుకోవచ్చు.
ఇంకా మీ పాత స్మార్ట్ ఫోన్లను ఎక్సేంఛ్ పై కూడా డిస్కౌంట్లను పొందవచ్చు. దాదాపు రూ. 25,700 వరకు ఎక్సేంఛ్ను అందిస్తోంది అమెజాన్. అంటే ఈ లెక్కన తక్కువలో తక్కువగా రూ. 47,200కు ఐఫోన్ 16ను దక్కించుకోవచ్చు. అయితే ఎక్సేంఛ్ వ్యాల్యూ ధర ఎక్కువగా రావాలంటే మీ పాత స్మార్ట్ ఫోన్ బ్రాండ్, దాని పనితీరు పై ఆధారపడి ఉంటుంది. మొత్తంగా ఇలా పలు రకాల ఆఫర్ల ద్వారా అమెజాన్‌లో ఐఫోన్ 16 ను రూ. 70 వేల కన్నా తక్కువకే దక్కించుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీరు ఈ ఐఫోన్ 16 ను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే ఈ డీల్ ను అస్సలు మిస్ చేసుకోవద్దు. వీలైనంత త్వరగా అమెజాన్ సైట్ ఓపెన్ చేసి ఐఫోన్ ను కొనేయండి.
ఐఫోన్ 16 ఫీచర్స్ – ఐఫోన్ 16 సిరీస్‌లో భాగంగా, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్.. అనే నాలుగు మోడళ్లను యాపిల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. యాపిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో మరింత శక్తిమంతంగా ఈ ఐఫోన్ 16 రూపొందాయి. అధునాతన కెమెరా కంట్రోల్ ఫీచర్ తో పాటు కొత్త బటన్లు ఉన్నాయి. ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ ఏ18 తో ఇవి మార్కెట్లోకి వచ్చాయి. ఐఫోన్ 16 కెమెరా విషయానికొస్తే విజువల్ ఇంటెలిజెన్స్ తో మాక్రో ఫొటోలు, స్పేషియల్ ఫొటోలు/వీడియోలు తీసుకోవచ్చు. డాల్బీ విజన్‌లో 4కే60 వీడియోను తీసుకోవచ్చు. వీడియోల్లో గాలి ధ్వనిని తగ్గించొచ్చు. ఐదు రంగుల్లో ఈ ఐఫోన్ 16 అందుబాటులో ఉంది. ఇక ఈ ఏడాది లాంఛ్ అయిన టాప్ మెుబైల్స్ లో ఒకటిగా ఐఫోన్ 16 నిలిచింది