Best 5G mobiles under 10K : ప్రతినెలా గ్యాడ్జెట్ ప్రియుల కోసం పలు టాప్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ల కంపెనీలు కొత్త కొత్త ఫోన్లను లాంఛ్ చేస్తుంటాయి. అది కూడా టాప్ ఎండ్ సూపర్ ఫీచర్లతో విడుదల చేస్తుంటాయి. దీంతో యూజర్స్ ఎలాంటి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలా, తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్లు ఏంటి అని తెగ వెతికేస్తుంటారు. అందులో తమకు కావాల్సిన ఓ పర్ఫెక్ట్ ఫోన్‌ను ఎంచుకునేందుకు కాస్త కన్ఫూజన్ పడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మోటోరొలా జి సిరీస్‌లో రూ.10 వేల లోపు ఫోన్‌ను లాంఛ్ చేసింది. Moto G35 5G పేరుతో ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో ఆ స్మార్ట్ ఫోన్ వివరాలతో పాటు, మరిన్ని రూ.10 వేల లోపు ఉన్న బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వివరాలను మీ ముందుకు తీసుకొచ్చాం.
2024 డిసెంబర్లో రూ.10 వేల బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ –
1) Moto G35 5G – ఈ Moto G35 5G స్మార్ట్ ఫోన్ తాజాగా మార్కెట్లోకి విడుదలైంది. దీని ధర రూ.9,999. ఇక ఈ సార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో ఇది వస్తోంది. 120 Hz రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ సాంప్లింగ్ రేటును ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్‌తో ఇది నడుస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హల్లో యూఐ స్కిన్‌తో పని చేస్తుంది.
మంచి క్వాలిటీ కెమెరాను అందిస్తోంది మొటోరొలా. బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సల్ క్వాడ్ పిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సర్, అల్ట్రా వైడ్ యాంగిల్‌తో 8 మెగా పిక్సల్ సెన్సర్, ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 16 మెగా పిక్సల్ కెమెరాను అమర్చారు. డాల్బీ అట్మోస్ – బ్యాక్డ్ స్టీరియో స్పీకర్‌లు, IP 52 రేటింగ్ లెదర్ ఫినిష్‌తో దీనిని డిజైన్ చేశారు. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ, 20W వైర్డ్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. డ్యూయల్ హ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3.5 mm ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్- సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
2) Infinix Hot 50 5G – ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ స్మార్ట్ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో నడుస్తుంది. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం Mali G57 MC2 GPUను ఇచ్చారు. 8 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కెపాసిటీ. స్టోరేజ్‌ను 1టీబీ వరకు ఎక్స్‌టర్నల్ ఎస్‌డీ కార్డుతో పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఎక్స్ఓఎస్ 14పై రన్ అవుతుంది. 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే 48ఎంపీ సోనీ ప్రైమరీ సెన్సార్, డెప్త్ సెన్సార్‌ను అమర్చారు. డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ లైట్‌ను కూడా ఇచ్చారు. 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది.
3) Realme C63 – వీగన్ లెదర్ ఫినిష్‌తో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చింది. 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేటు, 240Hz టచ్ సాంప్లింగ్ రేటు కలిగి ఉంది. బ్యాక్ సైడ్ 50 ఎంపీ కెమెరా, ఫ్రంట్ సైడ్ 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5తో రన్ అవుతుంది. ఐపీ54 రేటింగ్ ఇచ్చారు. 2 ఏళ్ల వరకు ఓఎస్ అప్డేట్స్ ఉంటాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రియల్‌మీ సీ63 8 జీబీ + 128 జీబీ వేరియంట్లో లభిస్తుంది. స్టోరేజ్‌ను 2టీబీ వరకు ఎక్స్‌టర్నల్ ఎస్‌డీ కార్డుతో పెంచుకోవచ్చు. ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 6nm ప్రాసెసర్‌తో నడుస్తుంది. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం Arm Mali-G57 MC2 GPUను ఇచ్చారు.
4) Vivo T3 Lite – ఈ స్మార్ట్ ఫోన్‌కు 90Hz రీఫ్రెష్ రేటు, 840 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.56 అంగుళాల ఎల్‌సీడీ తెరను ఇచ్చారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5nm జాక్, ఐపీ64 రేటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14తో పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 6 GB + 128 GB స్టోరేజ్ ఉంటుంది.
కెమెరా విషయానికి వస్తే వెనకభాగంలో f/1.8 (50 MP) + f/2.4 (2 MP) సెటప్‌ను ఇచ్చారు. ముందుభాగంలో f/2.0 (8 MP) కెమెరాను పొందుపర్చారు. బ్లూటూత్ 5.4, వైఫై 2.4 GHz, 5 GHz, యూఎస్‌బీ 2.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. స్టోరేజ్‌ను 1టీబీ వరకు ఎక్స్‌టర్నల్ ఎస్‌డీ కార్డుతో పెంచుకోవచ్చు. 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఇచ్చారు.
ALSO READ : రూ.10వేలకే కెవ్వుమనిపించే ఫీచర్స్ తో మోటో మెుబైల్ లాంఛ్