SC on Stray Dogs: వీధి కుక్కల అంశంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు వీధి కుక్కలను శాశ్వతంగా షెల్టర్ హోమ్‌లకు పంపాలని ఇచ్చిన ఆదేశంపై సమీక్ష పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇవాళ సుప్రీం కోర్టు తన తీర్పు వెల్లడించింది.
అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు నోటీసులు
వీధి కుక్కలన్నింటికి టీకాలు వేయించి, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలి. అయితే హింసాత్మకంగా ప్రవర్తించే కుక్కలు, రేబిస్‌తో బాధపడుతున్న కుక్కలు, అనారోగ్యంగా ఉన్న కుక్కలు మాత్రం షెల్టర్లకు తరలించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ కుక్కలకు ఆహారం పెట్టరాదని కోర్టు స్పష్టంగా ఆదేశించింది. దాని బదులు ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాల్లోనే ఆహారం ఇవ్వాలని సూచించింది. ఈ నియమాన్ని ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని కూడా తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.
Also Read: Shock to Airtel Customers: సైలెంట్‌గా కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఎయిర్ టెల్.. ఆప్లాన్ తొలగింపు
అడ్డుకుంటే రూ.2 లక్షల జరిమానా..
అదే విధంగా, కుక్కలను పట్టుకునే అధికారుల పనిని ఎవరు అడ్డుకుంటే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కోర్టు హెచ్చరించింది. వ్యక్తిగతంగా అడ్డుకుంటే రూ.25,000 జరిమానా, స్వచ్ఛంద సంస్థ అడ్డుకుంటే రూ.2 లక్షల జరిమానా విధించాలని ఆదేశం ఇచ్చింది. ఒకవేళ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వెంటనే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రారంభించాలని సుప్రీంకోర్టు సూచించింది. జంతు ప్రేమికులు కుక్కలను దత్తత తీసుకోవాలనుకుంటే, వారు మున్సిపల్ కార్పొరేషన్‌కి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
మొత్తం మీద, ఈ తీర్పుతో వీధికుక్కల సంరక్షణ, ప్రజల భద్రత రెండింటినీ సమానంగా ఉండేలా కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలపై అన్ని రాష్ట్రాల సీఎస్ లకు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. కుక్కలకు టీకాలు, స్టెరిలైజేషన్ తప్పనిసరి కాగా, మనుషులకు హాని కలిగించే కుక్కలు మాత్రం ఇకపై ప్రజల్లో తిరగకుండా షెల్టర్ హోమ్‌లలోనే ఉండాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు నిర్ణయంతో కొందరు ఆనందం వ్యక్తం చేస్తుంటే, డాగ్ లవర్స్ మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీధి కుక్కల అంశంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టొద్దు
కుక్కలకు టీకాలు వేయించి, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలి
రేబిస్ ఉన్న కుక్కలను షెల్టర్లకు తరలించాలి
ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్ లకు నోటీసులు జారీ చేసిన… pic.twitter.com/yFbJNbDJTN
— BIG TV Breaking News (@bigtvtelugu) August 22, 2025