HBD Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఏ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఉన్నా.. ప్రత్యేకంగా చిరంజీవికి ఉండే ఈ బిరుదు చాలా ఫేమస్ అనే చెప్పాలి. ఇదొక బిరుదు కాదు బ్రాండ్ అనడంలో సందేహం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో అంచలంచలుగా ఎదుగుతూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు చిరంజీవి. ఒక హీరోగా మారి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ మాస్టర్ విజయాలను అందుకుంటూ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. నటన, డాన్స్ తో పాటు తన మేనియాతో అందరి దృష్టిని ఆకర్షించారు చిరంజీవి.
ఎందరికో ఆదర్శం చిరంజీవి..
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అవమానాలు, చిత్కారాలు ఇలా ఎన్నో భరించి.. నేడు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవిని చూసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన నాని, శ్రీకాంత్, రవితేజ ఇలా ఎంతోమంది హీరోలు నేడు స్టార్లుగా చాలామణి అవుతున్నారు అంటే మెగాస్టార్ ఆదర్శం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఏడుపదుల వయసులో కూడా యంగ్ స్టార్స్ కి గట్టి పోటీ ఇవ్వడం ఆయనకు మాత్రమే చెల్లింది అనడంలో అతిశయోక్తి లేదు. దాదాపు 155 కి పైగా చిత్రాలను చేసిన ఈమె.. ఇప్పుడు వరుసగా మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు. అందులో భాగంగానే విశ్వంభర, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలతో పాటు బాబి కొల్లి డైరెక్షన్లో ఒక కొత్త మూవీ కూడా ప్రకటించారు.
మెగాస్టార్ బిరుదు వెనుక ఇంత కథ ఉందా?
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయనకున్న ‘మెగాస్టార్’ అనే బిరుదు ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా నిర్మాత కే.ఎస్. రామారావు(KS Ramarao) కలయికలో వచ్చిన చిత్రం అభిలాష (Abhilasha). కోదండరామిరెడ్డి(Kodanda Ramireddy ) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత అదే యండమూరి నవల ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వం, కేఎస్ రామారావు నిర్మాణంలో ఛాలెంజ్, రాక్షసుడు చిత్రాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు అయితే రాక్షసుడు మూవీతోనే చిరంజీవి తమ్ముడు నాగబాబు (Nagababu) కూడా నటుడిగా ఎంట్రీ ఇచ్చారు.
మెగాస్టార్ బిరుదు ఇచ్చింది ఆ నిర్మాతే..
ఆ తర్వాత చిరంజీవి కె.ఎస్.రామారావు కలయికలో వచ్చిన నాలుగవ చిత్రం ‘మరణ మృదంగం’. ఇది కూడా యండమూరి నవల ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. ఇది కూడా బ్లాక్ బస్టర్. ఇక ఈ చిత్రం టైటిల్ తోనే అప్పటివరకు సుప్రీం హీరోగా ఉన్న చిరంజీవి పేరు మెగాస్టార్ చిరంజీవిగా మారింది. ఇక సినిమా పేర్లు పడుతుండగా హీరో పేరు రాగానే మెగాస్టార్ అని రావడంతో అభిమానులు ఈలలు కేకలతో థియేటర్ ను దద్దరిల్లేలా చేశారు. అలా నిర్మాత కేఎస్ రామారావు చిరంజీవికి అందించిన ఆ అరుదైన బిరుదు ఈ మెగాస్టార్. మొత్తానికైతే నాడు ఆయన ఇచ్చిన బిరుదుతో నేడు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నారని చెప్పవచ్చు. మొత్తానికి అయితే చిరంజీవి నాడు అంతలా కష్టపడ్డారు కాబట్టే నేడు మెగాస్టార్ గా చలామణి అవుతున్నారు. అందుకే అంటారు మెగాస్టార్లు ఊరికే అయిపోరు అని..
ALSO READ:Bigg Boss AgniPariksha Promo: జడ్జిలకే ఝలక్ ఇస్తున్న సామాన్యులు.. ఫైర్ పుట్టిస్తున్నారుగా?