iPhone Sales India: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫోన్ల విక్రయాలు (షిప్‌మెంట్స్) తగ్గినప్పటికీ.. మార్చి 2026 నాటికి భారత ఇండియన్ నుండి కంపెనీ ఏకంగా 10 బిలియన్ డాలర్ల (రూ.83,000 కోట్లకు పైగా) రెవెన్యూ సాధించింది. స్మార్ట్‌ఫోన్ల ఓవరాల్ డిమాండ్ మందగించిన వేళ కూడా యాపిల్ ఈ మైలురాయిని అందుకోవడం నిజంగా విశేషమనే చెప్పాలి.
మిగతా బ్రాండ్లు ఎక్కువ సంఖ్యలో చౌక ఫోన్లు అమ్మడంపై దృష్టి పెడితే.. యాపిల్ మాత్రం కేవలం ప్రీమియం విభాగంపైనే నిలబడింది. సాధారణంగా మార్కెట్లో 100 ఫోన్లు అమ్మితే అందులో యాపిల్ ఫోన్లు 9 మాత్రమే ఉంటాయి. కానీ ఆదాయం విషయానికి వస్తే.. మాత్రం మొత్తం మార్కెట్ రాబడిలో ఈ కంపెనీ వాటా ఏకంగా 28 శాతంగా ఉండటం గమనార్హం.
ప్రస్తుతం దేశంలో స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లు కాస్త మందగించాయి. ఆర్థిక పరిస్థితుల వల్ల చాలామంది వినియోగదారులు కొత్త ఫోన్ల కొనుగోలును వాయిదా వేసుకుంటున్నారు. అయినప్పటికీ.. యాపిల్ బ్రాండ్ క్రేజ్ తగ్గలేదు. ఇటీవల వచ్చిన iPhone 17 మోడల్ ఒక్కటే భారత్‌లో అమ్ముడైన మొత్తం స్మార్ట్‌ఫోన్లలో సుమారు 4 శాతం వాటాను కైవసం చేసుకుంది.
Also Read: సేల్ మొదలవ్వకముందే లీక్ అయిన OnePlus 15 ప్రైస్.. ఇంత తక్కువకి వస్తుందని తెలిస్తే!
యాపిల్ విజయం కేవలం ఐఫోన్ల పైనే ఆధారపడి లేదు. ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్స్, ఇతర డిజిటల్ సర్వీసెస్ కూడా కంపెనీ ఆదాయాన్ని గణనీయంగా పెంచాయి. ఒక్కసారి యాపిల్ ప్రాడక్ట్ వాడటం మొదలుపెట్టిన కస్టమర్లు.. ఆ బ్రాండ్‌కే అలవాటు పడి మిగతా డివైజ్‌లను కూడా కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
ఇండియాలో తమ అత్యంత కీలకమైన గ్రోత్ మార్కెట్‌గా యాపిల్ సిఈఓ టిమ్‌కుక్ భావిస్తున్నారు. అందుకే ఇక్కడ యాపిల్ అధికారిక స్టోర్లను పెంచడమే కాకుండా.. స్థానికంగా తయారీని (మాన్యుఫ్యాక్చరింగ్) కూడా వేగవంతం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రీమియం వ్యూహంతో ఇండియాలో మరింత విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
Also Read: యాడ్స్ లేవు.. 4 నెలలు ఫ్రీ సాంగ్స్, స్పాటిఫైతో జతకట్టిన బోట్.. ఆఫర్ ఎలా పొందాలంటే?