Amazon Freedom Sale 2026: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ వార్షిక ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్’ ను ఆగస్టు 7 నుంచి ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రముఖ ఫ్లాగ్‌షిప్ ఫోన్ OnePlus 15పై కూడా అదిరిపోయే ఆఫర్‌ను అమెజాన్ తీసుకొచ్చింది.
అమెజాన్ తాజాగా విడుదల చేసిన టీజర్ ప్రకారం.. OnePlus 15 (12GB + 256GB) వేరియంట్ అసలు ధర రూ.89,999గా ఉంది. అయితే ఈ సేల్ సమయంలో ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లతో కలిపి దీనిని రూ.81,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే.. దాదాపు రూ.8,000 వరకు తగ్గింపు లభిస్తోంది. గతంలో మెమరీ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ దీని ధరలను సవరించినప్పటికీ, ఈ ఆఫర్ ద్వారా మళ్లీ తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం లభించింది.
ఈ సేల్‌లో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులు లేదా Easy EMI ఉపయోగించి కొనుగోలు చేసేవారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా.. Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. వీటితో పాటు నో-కాస్ట్ ఈఎమ్‌ఐ, పాత ఫోన్ల మార్పిడిపై ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read: నాయిస్ నుంచి సరికొత్త స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్.. ఆ కార్డు మీద కొలుగోలు చేస్తే భారీ ఆఫర్!
ఈ ఫోన్ 6.78-ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, 165Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గేమింగ్, పెర్ఫార్మెన్స్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 360 క్రయో-వెలాసిటీ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. అలాగే OnePlus 15లో ప్లస్ మైండ్, గూగుల్ జెమిని, ఏఐ పోర్ట్రైట్ గ్లో వంటి అనేక అధునాతన ఏఐ (AI) ఫీచర్లు ఉన్నాయి.
OnePlus 15 ఫోన్‌లో ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు మూడు 50MP కెమెరాలు, ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే 7,300mAh భారీ బ్యాటరీ, 120W వేగవంతమైన వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68/ఐపీ69 రేటింగ్‌లతో వస్తున్న ఈ ఫోన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు మంచి ఎంపికగా నిలుస్తుంది.
Also Read: రూ.47,990కే ది బెస్ట్ ల్యాప్‌టాప్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, జెమిని AI ప్రో ఉచితంగా ఇచ్చేస్తున్న Asus!