E-Paper
Advertisement

BSNL మరో పిచ్చేక్కించే ప్లాన్.. రూ.1,499తో 300 రోజులు ఫుల్ హ్యాపీ.. ఇది చాలా చౌక గురూ!

BSNL మరో పిచ్చేక్కించే ప్లాన్.. రూ.1,499తో 300 రోజులు ఫుల్ హ్యాపీ.. ఇది చాలా చౌక గురూ!
Advertisement

BSNL Recharge: ప్రైవేట్ టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను పెంచుతుండటంతో.. సామాన్యులకు బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) పెద్ద దిక్కుగా మారింది. మెుబైల్ యూజర్లకు తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీని అందిస్తూ వారికి ఊరట కలిగిస్తోంది. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ తెచ్చిన రూ. 1,499 రీఛార్జ్ ప్లాన్.. అందరినీ ఆకట్టుకుంటోంది. నెలకు దాదాపు రూ. 150 ఖర్చుతో సుమారు 10 నెలల పాటు సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకునే వెసులుబాటును ఈ ప్లాన్ కల్పిస్తోంది.

రూ. 1,499 ప్లాన్ పూర్తి వివరాలు

ఈ లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ ను 300 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా దేశంలోని ఏ నెట్ వర్క్ కు అయినా ఫ్రీగా లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తం 32 GB హై-స్పీడ్ డేటా యూజర్లకు లభిస్తుంది. పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 Kbpsకి తగ్గనుంది. మరోవైపు ప్రతిరోజూ 100 ఉచిత ఎస్‌ఎం‌ఎస్‌లను పంపుకునే సౌలభ్యం యూజర్లకు లభించనుంది.

ఈ ప్లాన్ ఎవరికి బెస్ట్?

Advertisement

BSNL సిమ్‌ను రెండో ఆప్షన్‌గా వాడుతూ.. తక్కువ ఖర్చులో ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ సర్వీసులు నిరంతరాయంగా పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. డేటాతో పెద్దగా అవసరం లేకుండా వాయిస్ కాల్స్ కోసమే ఫోన్ ఉపయోగించే పెద్దవారికి ఇది బాగా సెట్ అవుతుంది. ఇల్లు లేదా ఆఫీస్‌లో వైఫై (Wi-Fi) అందుబాటులో ఉండి.. మెుబైల్ డేటాతో పనిలేనివారికి కూడా ఈ ప్లాన్ పర్ఫెక్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.

Also Read: ఓరి దేవుడా.. రూ.169 కే 90 రోజుల వ్యాలిడిటీనా.. ఇది పక్కా సామాన్యుల ప్లాన్!

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

Advertisement

బీఎస్ఎన్ఎల్ రూ.1499 ప్లాన్ ను చాలా ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ‘బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మీ నంబర్‌తో లాగిన్ అయి ‘ప్లాన్ వోచర్స్’ విభాగంలో రూ. 1,499 ప్లాన్ ఎంచుకుని రీఛార్జ్ చేయవచ్చు. లేదంటే BSNL పోర్టల్ కి వెళ్లి ‘రీఛార్జ్’ ఆప్షన్ ద్వారా నంబర్ ఎంటర్ చేసి ప్లాన్ ఎంచుకోవచ్చు. అది కూడా కుదరని పక్షంలో గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే వంటి పేమెంట్ యాప్‌లలో ‘రీఛార్జ్’ విభాగానికి వెళ్లి బీఎస్ఎన్ఎల్ రూ. 1,499 సెలెక్ట్ చేసి రీఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: Airtel మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. రూ.489 కే 77 రోజుల వ్యాలిడిటీ.. నాన్ స్టాప్ కాల్స్, డేటా!

Tags

Related News

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026..ఈ 5 మోడల్స్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్ !

ఛార్జింగ్ కేబుల్స్ మురికిగా మారాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!

చిన్న టీవీలతో విసిగిపోయారా? ఈ ప్రొజెక్టర్ ఉంటే..ఇల్లే థియేటర్ అయిపోద్ది!

క్వాలిటీకే కట్టుబడిన యాపిల్.. భారత్‌లో రూ.83,000 కోట్ల చారిత్రాత్మక మైలురాయి!

ఓరి దేవుడా.. రూ.169 కే 90 రోజుల వ్యాలిడిటీనా.. ఇది పక్కా సామాన్యుల ప్లాన్!

సేల్ మొదలవ్వకముందే లీక్ అయిన OnePlus 15 ప్రైస్.. ఇంత తక్కువకి వస్తుందని తెలిస్తే!

మీ ఫోన్ డేటా సేఫ్‌గా ఉందనుకుంటున్నారా? అయితే ఈ నిజం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×