E-Paper
Advertisement

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!
Advertisement

Online shopping safety tips: ఇంట్లో కూర్చునే నచ్చిన వస్తువులను.. ఆర్డర్ చేయడం నేడు సర్వసాధారణమైపోయింది. కానీ.. ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కష్టపడి సంపాదించిన డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. ఫొటోల్లో ఒకటి చూసి, డెలివరీ అయిన తర్వాత క్వాలిటీ లేని వస్తువులను చూసి మోసపోతున్నారా? అయితే .. ఇకపై అలాంటి టెన్షన్స్ వద్దు! వస్తువు క్వాలిటీ తక్కువగా కనిపిస్తే.. వెంటనే ఆర్డర్ చేయకండి . ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు.. తప్పకుండా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన, ట్రెండీ సేఫ్టీ టిప్స్ ఇప్పుడు చూద్దాం.

1. వస్తువు క్వాలిటీ అంచనా:

మీరు ఏదైనా ప్రొడక్ట్ కొనాలనుకున్నప్పుడు, కేవలం ఆకర్షణీయమైన ఫొటోలను చూసి మోసపోకండి. వస్తువు క్వాలిటీ తక్కువగా కనిపిస్తే..వెంటనే ఆర్డర్ చేయొద్దు. ఆ ప్రొడక్ట్‌కు సంబంధించిన యూజర్ రివ్యూలు, రేటింగ్‌లు,రియల్ కస్టమర్ ఫోటోలను క్షుణ్ణంగా చెక్ చేయండి. ఒకవేళ బ్రాండ్ పై అనుమానం వస్తే.. ఆ ప్రొడక్ట్‌ను పక్కన పెట్టడమే మంచిది.

2. పేమెంట్ :

Advertisement

ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసే.. సమయం అత్యంత కీలకం. చెల్లింపు చేసే ముందు బిల్లులోని మొత్తాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఒక్కో సారి అదనపు డెలివరీ ఛార్జీలు, ప్లాట్‌ ఫారమ్ ఫీజులు లేదా.. హిడెన్ చార్జెస్ కలవడం వల్ల బిల్లు మొత్తం పెరుగుతుంది. యూపీఐ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా.. పే చేసేటప్పుడు సరైన అమౌంట్ ఎంటర్ అవుతుందో లేదో నిర్ధారించుకోండి.

3. రిటర్న్, రీఫండ్ పాలసీ:

ఏదైనా వస్తువు ఆర్డర్ చేసే ముందు.. ఆ వెబ్‌సైట్ లేదా యాప్ రిటర్న్ పాలసీ ఎలా ఉందో కచ్చితంగా చెక్ చేయాలి. వస్తువు నచ్చకపోతే.. లేదా డ్యామేజ్ అయితే రిటర్న్ చేసుకోవడానికి.. ఎన్ని రోజులు సమయం ఉంది? రీఫండ్ ఏ విధంగా వస్తుంది? అనే వివరాలు ముందే.. తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో నష్ట పోకుండా ఉండొచ్చు.

4. ఆఫర్ల మోజు:

Advertisement

మార్కెట్ ధర కంటే.. అతి తక్కువ ధరకు (ఉదాహరణకు రూ.50,000 విలువైన ఫోన్ కేవలం రూ.5,000కి) వస్తువులు ఇస్తున్నామంటూ.. వచ్చే ప్రకటనలను గుడ్డిగా నమ్మకండి. ఫేక్ వెబ్‌ సైట్లు ఇలాంటి ఆఫర్లతో.. యూజర్లు ఆకర్షిస్తాయి.ఆఫర్లు చూసే ముందు ఆ వెబ్‌సైట్ అథెంటిసిటీని చెక్ చేయడం చాలా ముఖ్యం.

Also Read: పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

5. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌:

కొత్త లేదా తక్కువ పరిచయం ఉన్న వెబ్‌ సైట్లలో.. షాపింగ్ చేసేటప్పుడు.. ముందే ఆన్‌లైన్ పేమెంట్స్ చేయడం కంటే.. ‘క్యాష్ ఆన్ డెలివరీ’ఆప్షన్‌ను ఎంచుకోవడం మంచిది. ప్రొడక్ట్ చేతికి అందివచ్చి, దాని క్వాలిటీ చెక్ చేసిన  తర్వాతే.. డబ్బులు చెల్లించడం ఎప్పుడూ సురక్షితమైన మార్గం.

ఆన్‌లైన్ షాపింగ్ ఈజీ అయినప్పటికీ.. కాస్త అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత. వస్తువు క్వాలిటీ చెక్ చేయడం,డబ్బులు ఎంత చెల్లిస్తున్నామో వంటి చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా.. మీరు ఎలాంటి మోసాల బారిన పడకుండా ప్రశాంతంగా షాపింగ్ చేయొచ్చు. అంతే కాకుండా క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే కొనడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.

Related News

వాల్ క్లాక్ ఆగిపోయిందని పారేస్తున్నారా? ఈ చిన్న పని చేస్తే.. మళ్ళీ నడుస్తుంది!

ప్రొడక్ట్ బాగోలేదని టెన్షన్ పడుతున్నారా? రిటర్న్ చేయకుండానే ఫుల్ రీఫండ్

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Big Stories

Advertisement
×