E-Paper
Advertisement

బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. సెప్టెంబర్ 25వ తేదీనే జీతాలు.. కేంద్రం కీలక ఆదేశాలు!

బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. సెప్టెంబర్ 25వ తేదీనే జీతాలు.. కేంద్రం కీలక ఆదేశాలు!
Advertisement

Early Salary Payment: సెప్టెంబరు చివరి వారంలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వడంతో వేతనజీవుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జీతాలు పడే సమయంలో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో తమ శాలరీలు ఎప్పుడు ఖాతాల్లో జమ అవుతాయోనని ఉద్యోగులు, పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ముందుగానే జీతాలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో బ్యాంకు సమ్మెను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు నెల జీతాలు, వేతనాలు, పింఛన్లను సెప్టెంబరు 25నే చెల్లించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ ముందస్తు చెల్లింపుల నిర్ణయం రక్షణ శాఖ, తపాలా, టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్లతో పాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పారిశ్రామిక ఉద్యోగులు, పింఛనుదారులందరికీ వర్తిస్తుంది.

ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి?

Advertisement

అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ జీతాల ముందస్తు చెల్లింపు ఆదేశాలు కేవలం ప్రభుత్వ రంగ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. ప్రైవేట్ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు తమ ఉద్యోగులకు సెప్టెంబరు 25నే తప్పనిసరిగా జీతాలు ఇవ్వాలని ఎలాంటి నిబంధనా లేదు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయనేది ఆయా కంపెనీల పేరోల్ షెడ్యూల్, వారు బ్యాంకర్లతో చేసుకున్న ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది. పైగా ప్రస్తుతం చాలావరకు జీతాల చెల్లింపులు ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి కాబట్టి సమ్మె వల్ల ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లకు పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చని అంచనా.

బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఎందుకు?

వారంలో 5 రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబరు 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ యూనియన్లలో దాదాపు 90 శాతం మంది బ్యాంకు సిబ్బంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సమ్మె ప్రతిపాదనను విరమించుకోవాలని ప్రభుత్వం కోరినప్పటికీ.. బ్యాంక్ ఉద్యోగులు వెనక్కి తగ్గడం లేదు. దీంతో ప్రభుత్వానికి బ్యాంక్ ఉద్యోగుల యూనియన్ కు మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే డిమాండ్‌పై అక్టోబరు 26 నుంచి నిరవధిక సమ్మెకు కూడా ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి.

Advertisement

Also Read: స్టైలిష్‌గా కనిపించేందుకు బ్రాండెడ్ డ్రెస్‌ అవసరం లేదు.. తక్కువ బడ్జెట్‌లో ఫ్యాషన్ టిప్స్

ఆదివారం బ్యాంకులు ఓపెన్

మరోవైపు సమ్మె సమయంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకున్నాయి. సాధారణ హాలీడే అయిన ఆదివారం (సెప్టెంబరు 27) నాడు కూడా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRB) యథావిధిగా పనిచేస్తాయని తెలిపాయి. కస్టమర్లు తమ అత్యవసర బ్యాంకు పనులను పూర్తి చేసుకోవడానికి ఆ రోజు బ్యాంకులు తెరిచి ఉంటాయని స్పష్టం చేశాయి.

Also Read: “నాకు అదృష్టం లేదు”.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ తమ వైఫల్యాలకు విధిని నిందిస్తారు

 

Tags

Related News

పండగ సీజన్‌ వేళ కేంద్రం శుభవార్త.. వంట నూనె ధరలకు ఊరట!

పిపిఎఫ్ vs సుకన్య సమృద్ధి యోజన.. మీ కూతురి భవిష్యత్తు కోసం ఏ పథకం ఎక్కువ లాభదాయకం

చమురు ధరల పెరుగుదల.. ఆయిల్ కంపెనీలకు భారీగా నష్టాలు, పెట్రోల్‌పై రూ.8-డీజిల్‌ పై రూ.9

చదివింది ఇంటర్మీడియట్ మాత్రమే.. కట్ చేస్తే నేడు వేల రూ.కోట్లకు అధిపతి

భారీగా దిగొస్తున్న బంగారం ధర.. మహిళల్లో ఒక్కటే ఆనందం, ఇవాళ మార్కెట్లో ధరలు

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్‌లో నెలకు రూ.4000 పెట్టుబడితో 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

సమ్మె ప్రభావం.. ఆదివారం బ్యాంకులు ఓపెన్, ఆర్థిక‌శాఖ ప్రకటన

Big Stories

Advertisement
×