Honor 600 elite 5g: స్మార్ట్ ఫోన్ చేతిలో.. నుంచి జారి నీళ్లలో పడితే చాలు.. అది పాడైపోతుందనే టెన్షన్ అందరికీ ఉంటుంది. కానీ.. మరుగుతున్న నీటిలో పడ్డా, 50 డిగ్రీల ఎండలో తిరిగినా అస్సలు పాడవని ఒక అద్భుతమైన ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. ప్రముఖ టెక్ కంపెనీ ‘హానర్’ తన అత్యంత మన్నికైన ‘హానర్ 600 ఎలైట్ 5G’ స్మార్ట్ ఫోన్‌ను ప్రపంచ టెక్ వేదికపై ఆవిష్కరించింది. కేవలం క్వాలిటీ మాత్రమే కాకుండా.. భారీ బ్యాటరీ, పవర్ ఫుల్ ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం!
ఈ ఫోన్ మెయిన్ హైలైట్ దీని బిల్డ్ క్వాలిటీ , ప్రొటెక్షన్. సాధారణ వాటర్-రెసిస్టెంట్ ఫోన్లలా కాకుండా.. ఇది ఏకంగా మరుగుతున్న నీటిలో పడ్డా, తీవ్రమైన 50 డిగ్రీల సెల్సియస్ వేడిని తట్టుకునే శక్తిని కలిగి ఉంది. అడ్వెంచరస్ ట్రిప్స్‌కు వెళ్లేవారు, కఠినమైన వాతావరణంలో పని చేసేవారు ఎలాంటి భయం లేకుండా ఈ ఫోన్‌ను ఉపయోగించవచ్చు. స్క్రీన్ , బాడీపై ప్రత్యేకమైన ఆర్మర్ ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల ఇది ఈజీగా పగలకుండా సురక్షితంగా ఉంటుంది.
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎక్కువగా కోరుకునేది .. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీనే. ఈ విషయంలో .. హానర్ యూజర్లకు ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. ఈ ఫోన్లో ఏకంగా 8100mAh సామర్థ్యం గల పవర్ ఫుల్ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సరి పోతుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా.. రెండు నుంచి మూడు రోజుల పాటు నాన్ స్టాప్‌గా ఈ ఫోన్‌ను వాడొచ్చు. హెవీ గేమింగ్, లాంగ్ ట్రావెలింగ్ చేసేవారికి ఈ బ్యాటరీ లైఫ్ ఒక అద్భుతమనే చెప్పాలి.
స్పీడ్, మల్టీటాస్కింగ్ విషయంలో .. ఈ ఫోన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇందులో.. ఏకంగా 24GB వరకు RAM సపోర్ట్ లభిస్తోంది. దీని వల్ల ఏక కాలంలో ఎన్ని హెవీ యాప్స్ రన్ చేసినా, హై-ఎండ్ గ్రాఫిక్స్ గేమ్స్ ఆడినా ఫోన్ లాగ్ అవ్వడం గానీ, హ్యాంగ్ అవ్వడం గానీ జరగదు. డేటా స్టోరేజ్, ప్రాసెసింగ్ వేగం చాలా స్మూత్‌గా ఉంటుంది.
ఫోటోగ్రఫీ లవర్స్ ఆకట్టుకునేలా ఇందులో పవర్ ఫుల్ 108MP మెయిన్ కెమెరాను వాడారు. రాత్రి సమయాల్లో కూడా క్రిస్టల్ క్లియర్ ఫోటోలు, 4K వీడియోలు షూట్ చేయడానికి ఈ.. కెమెరా అద్భుతంగా పని చేస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే, అల్ట్రా-బ్రైట్ అమోలెడ్ స్క్రీన్‌తో పాటు అద్భుతమైన రిఫ్రెష్ రేట్ ఇవ్వడం వల్ల వీడియోలు చూసేటప్పుడు సినిమా థియేటర్ ఫీల్ కలుగుతుంది.
Also Read: వైర్డ్ ఇయర్ఫోన్లు, MP3 ప్లేయర్లు మళ్లీ ట్రెండ్‌లోకి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
సాధారణ ఫోన్ల కంటే.. యూనిక్ ఫీచర్లు, డ్యూరబిలిటీ ఉన్న గాడ్జెట్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. హానర్ 600 ఎలైట్ 5G విడుదలైనప్పటి నుంచి టెక్ మార్కెట్లో దీని గురించే చర్చ నడుస్తోంది. లగ్జరియస్ లుక్‌తో పాటు యూజ్ చేయడానికి అనువుగా ఉండటంతో యూత్ ఈ ఫోన్‌పై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు.
మొత్తానికి చూస్తే.. హానర్ 600 ఎలైట్ 5G అనేది స్టైల్ , స్ట్రెంగ్త్.. పర్ఫెక్ట్ కాంబినేషన్. అత్యంత వేడిని తట్టుకునే తత్వం, మరుగుతున్న నీటిలోనూ.. చెక్కుచెదరని తత్వం, 24GB RAM , భారీ 8100mAh బ్యాటరీ వంటి ఫీచర్లు దీన్ని మార్కెట్లో నంబర్ వన్ నిలబెడుతున్నాయి. మీరు ఒక పవర్ఫుల్ , లాంగ్ లాస్టింగ్ ప్రీమియం ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే.. హానర్ 600 ఎలైట్ 5G మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది!