E-Paper
Advertisement

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Advertisement

Nayanthara Hi Movie OTT: సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార (Nayanthara)గత నెలలో ఏకంగా రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అందులో ఒకటి యశ్ (Yash)తో నటించిన ‘టాక్సిక్’ కాగా, మరొకటి కవిన్ తో నటించిన ‘హాయ్’.. రెండు చిత్రాలు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. రెండు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అందులో ఒక చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతోంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అధికారికంగా ఒక వీడియో రిలీజ్ చేస్తూ మరీ ప్రకటించింది.

ఓటీటీలోకి నయనతార కొత్త మూవీ..

నయనతార హీరోయిన్ గా, కవిన్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం హాయ్. ఈ చిత్రాన్ని ఆగస్టు 28న తెలుగులో కూడా థియేటర్లలో విడుదల చేశారు. అయినా కూడా ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించగా.. నయనతార ఒక నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఇకపోతే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా విఫలం కావడంతో ఇప్పుడు నెల కూడా తిరగకుండానే ఓటీటీలోకి రావడానికి సిద్ధమయ్యింది.

స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Advertisement

సెప్టెంబర్ 25న అనగా ఈ శుక్రవారం నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ జీ5 వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హాయ్ మూవీ స్టోరీ..

నయనతార, కవిన్ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హాయ్ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. రాజమండ్రికి చెందిన సుబ్రహ్మణ్యం ( కవిన్) పెళ్లి వయసు వచ్చినా.. ఇంకా తల్లిదండ్రుల చాటు బిడ్డగానే ఉంటాడు. ఇంట్లో చెప్పనిదే ఏ పని కూడా చేయడు. ఒకసారి తన మరదలిని ఇష్టపడి ఆమెకు ప్రపోజ్ చేస్తే.. ఆమె రిజెక్ట్ చేస్తుంది. ఇక ఈ విషయాన్ని తల్లిదండ్రులతో నేరుగా చెప్పలేక ఒక లెటర్ రాసి అందులో ఈ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్ వెళ్ళిపోతాడు. మరొకవైపు భీమవరానికి చెందిన దేవసేన (నయనతార) పెళ్లిరోజే ఇంటి నుండి తప్పించుకొని హైదరాబాద్ వచ్చేస్తుంది. అనుకోకుండా సుబ్రహ్మణ్యం, దేవసేన ఒకే చోట ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏమయింది? అనేది మిగతా స్టోరీ.

Advertisement

also read: ది ప్యారడైజ్ దెబ్బ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఇప్పుడైనా మార్పు వస్తుందా?

నయనతార తదుపరి చిత్రాలు..

ఇటీవల పేట్రియాట్, టాక్సిక్ , హాయ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ప్రస్తుతం మూకుత్తి అమ్మన్ 2 చిత్రంలో నటిస్తోంది ఈ చిత్రాన్ని తెలుగులో మహాశక్తి పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే రక్కాయి అని తమిళ యాక్షన్ చిత్రంలో నటిస్తోంది. మలయాళ , తమిళ్ ద్విభాష చిత్రమైన డియర్ స్టూడెంట్స్ అనే చిత్రంలో కూడా నయనతార కీలక పాత్ర పోషిస్తోంది.

Related News

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

Big Stories

Advertisement
×