E-Paper
Advertisement

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?
Advertisement

Pan card correction process 2026: కాలం మారుతున్న కొద్దీ ప్రభుత్వ సేవలు అన్నీ డిజిటల్ బాట పట్టాయి. ఒకప్పుడు పాన్ కార్డ్‌లో చిన్న తప్పు జరిగినా, ఫోటో మార్చుకోవాలన్నా రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ తిప్పలన్నీ తప్పిపోయాయి. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ లేదా UTITSL అధికారిక పోర్టల్స్ ద్వారా ఇంట్లో కూర్చునే మన మొబైల్ ఫోన్ ద్వారా పాన్ కార్డ్ వివరాలను చాలా ఈజీగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలనుకునే వారు ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

1. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించడం:
ముందుగా మీ మొబైల్ ఫోన్‌లోని బ్రౌజర్ ఓపెన్ చేసి NSDL లేదా UTIITSL అధికారిక ఆన్‌లైన్ పాన్ సర్వీసెస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ ‘Changes or Correction in PAN Data’ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. మీ పాన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్, ఈమెయిల్ ఐడీ , మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

Advertisement

2. ఫోటో, సంతకం మార్చడానికి ‘e-KYC’ విధానం:
లాగిన్ అయిన తర్వాత.. మీ అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పాన్ కార్డ్‌లో.. ఏ వివరాలు మార్చాలనుకుంటున్నారో ఎంచుకోవడానికి బాక్సులు ఉంటాయి. మీ ఫోటో లేదా సిగ్నేచర్ మారాలి కాబట్టి ఆ రెండు ఆప్షన్లను టిక్ చేయాలి. ఇక్కడ ఆధార్ ఆధారిత ‘e-KYC’ లేదా ‘e-Sign’ ఆప్షన్‌ను ఎంచుకోవడం బెస్ట్. దీనివల్ల ఎలాంటి డాక్యుమెంట్లు పోస్ట్ ద్వారా పంపాల్సిన అవసరం ఉండదు. పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పని పూర్తవుతుంది.

3. కొత్త ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయడం:
ఫారమ్ నింపిన తర్వాత, మీ తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో , తెల్లటి కాగితంపై చేసిన మీ సంతకం ఫోటోను మీ మొబైల్ ద్వారానే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే గుర్తుంచుకోండి.. అప్‌లోడ్ చేసే ఫొటోలు క్లియర్‌గా ఉండాలి మరియు వెబ్‌సైట్ సూచించిన సైజ్, ఫార్మాట్ ప్రకారమే ఉండాలి. ఒకవేళ సైజ్ ఎక్కువగా ఉంటే మొబైల్‌లోని చిన్న యాప్స్ ద్వారా రీసైజ్ చేసుకోవచ్చు.

Advertisement

4.  ఫీజు చెల్లింపు:
అన్ని వివరాలు సరిగ్గా సరి చూసుకున్న తర్వాత.. ఆన్‌లైన్ ద్వారా చిన్నపాటి ప్రాసెసింగ్ ఫీజు (సుమారు రూ. 100 లోపు ఉంటుంది) చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ పేమెంట్ పూర్తి చేయొచ్చు. పేమెంట్ సక్సెస్ అయిన వెంటనే మీకు ఒక ‘అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్’వస్తుంది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి.

Also Read: మరుగుతున్న నీటిలోనూ పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

5. డిజిటల్ ఇండియా సేవలు:
ప్రజలు ప్రభుత్వ పనులను బయటికి వెళ్లకుండా ఇంట్లోనే.. మొబైల్ ద్వారా ఎలా చేసుకోవాలో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఈ ఆన్‌లైన్ పాన్ కరెక్షన్ ప్రాసెస్ యూజర్లందరికీ ఎంతగానో సహాయ పడుతోంది. అప్లై చేసిన కొన్ని రోజుల్లోనే డిజిటల్ పాన్ కార్డ్ మీ ఈమెయిల్‌కు వస్తుంది. ఫిజికల్ కార్డ్ పోస్ట్ ద్వారా నేరుగా మీ ఇంటికి డెలివరీ అవుతుంది.

పాన్ కార్డ్‌లో ఫోటో లేదా సంతకం మారలేదని టెన్షన్ పడే రోజులు పోయాయి. మీ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ ద్వారా కేవలం పదే నిమిషాల్లో .. ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. మరెందుకు ఆలస్యం? మీ పాన్ కార్డ్ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఈ సింపుల్ ఆన్‌లైన్ ప్రాసెస్‌ని ఫాలో అయిపోండి!

Related News

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

ఏఐ మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీ..గూగుల్,ఆపిల్ ఫోన్లలోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు!

వాట్సాప్‌లో.. ఈ 5 సెట్టింగ్‌లను పొరపాటున కూడా మరవొద్దు!

Big Stories

Advertisement
×