Apple iOS 26| ఆపిల్ సంస్థ తన వార్షిక వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2025లో iOS 26ని ప్రకటించింది. ఈ మార్పులు iOS 19లో చేయకుండా.. ఒక భారీ లీప్ తీసుకుని iOS 26గా తీసుకువచ్చింది. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లో “లిక్విడ్ గ్లాస్” అనే కొత్త డిజైన్ భాషను పరిచయం చేసింది. గత దశాబ్ద కాలంలో ఐఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌లో వచ్చిన అతిపెద్ద మార్పు. ఇంతకు ముందు 2013లో iOS 7తో ఫ్లాట్ డిజైన్‌ను తీసుకొచ్చిన ఆపిల్, ఇప్పుడు మరోసారి లిక్విడ్ గ్లాస్‌తో ఒక కొత్త ట్రెండ్ సృష్టించాలని చూస్తోంది.
లిక్విడ్ గ్లాస్ డిజైన్: ఒక కొత్త అనుభవం
లిక్విడ్ గ్లాస్ డిజైన్ iOS 26 లో అతి ముఖ్యమైన ఆకర్షణ. ఆపిల్ కంపెనీ ఇనేళ్ల వరకు డిజైన్ గురు జోనీ ఐవ్ రూపొందించిన సరళమైన, ఫ్లాట్ డిజైన్లనే ఉపయోగిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ డిజైన్లకు స్వస్తి పలికి కొత్తగా పారదర్శకమైన, లోతైన, గాజు లాంటి రూపాన్ని తీసుకొచ్చింది. ఈ డిజైన్‌లో సిస్టమ్ అంతటా పారదర్శకత, గాజు లాంటి ఎఫెక్ట్‌లు కనిపిస్తాయి. ఫస్ట్-పార్టీ యాప్‌లలో కూడా ఈ ఎఫెక్ట్‌లు ఇంటిగ్రేటెడ్ అయి కనిపిస్తాయి. ఈ డిజైన్.. యూజర్‌లకు ఆనందాన్ని, మంచి ఉత్సాహానిచ్చే అనుభవాన్ని అందిస్తుంది. ఈ డిజైన్ ద్వారా స్క్రీన్‌పై ఉన్న కంటెంట్ మరింత స్పష్టంగా, లోతుగా కనిపిస్తుంది. టచ్, మోషన్‌కు అనుగుణంగా ఈ ఎఫెక్ట్‌లు డైనమిక్‌గా స్పందిస్తాయి.
iOS 26 ఫీచర్స్: డిజైన్ తో పాటు మరిన్ని ప్రత్యేకతలు
లిక్విడ్ గ్లాస్ డిజైన్ కేవలం రూపానికి మాత్రమే పరిమితం కాదు. ఇది ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి అన్ని ఆపిల్ డివైస్‌లలో ఒకే రకమైన, సులభమైన యూజర్ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది. 2027లో విడుదల కానున్న 20వ వార్షికోత్సవ ఐఫోన్‌కు ఈ డిజైన్ ఒక పునాదిగా ఉంటుంది. ఈ డిజైన్‌లో ఆపిల్ విజన్ ప్రోకు చెందిన visionOS నుంచి కొన్ని విజువల్ ఎలిమెంట్స్ స్ఫూర్తిని పొందినట్లు కనిపిస్తోంది.
2013లో iOS 7 ఫ్లాట్ డిజైన్‌తో మొబైల్ ఇంటర్‌ఫేస్ డిజైన్‌ను పూర్తిగా మార్చివేసింది. అదే విధంగా, iOS 26 కూడా ఇన్ డెప్త్ , ఇంటరాక్టివ్ డిజైన్‌తో మొబైల్ ఇంటర్‌ఫేస్‌లను మళ్లీ నిర్వచించాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుంది.
iOS 26లో డిజైన్‌తో పాటు అనేక కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఫోన్ యాప్: కాల్ స్క్రీనింగ్, హోల్డ్ అసిస్ట్‌తో కొత్త లేఅవుట్.
మెసేజెస్ యాప్: గ్రూప్ చాట్‌లలో బ్యాక్‌గ్రౌండ్/థీమ్ సపోర్ట్, పోల్స్, టైపింగ్ ఇండికేటర్స్.
కెమెరా యాప్: తక్కువ ఆప్షన్‌లతో సరళమైన డిజైన్.
ఫోటోస్ యాప్: మెరుగైన ట్యాబ్‌లు.
సఫారి: ఎడ్జ్-టు-ఎడ్జ్ వెబ్ పేజీలతో మరింత లీనమయ్యే వీక్షణ.
ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
డెవలపర్స్ ఈ రోజు నుంచి మొదటి బీటా వెర్షన్‌ను ఉపయోగించవచ్చు. పబ్లిక్ బీటా వచ్చే నెలలో విడుదలవుతుంది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు iOS 26 పబ్లిక్ రిలీజ్ అందుబాటులోకి వస్తుంది. ఈ అప్‌డేట్ ఐఫోన్ 11, ఆ తర్వాత వచ్చిన మోడల్స్‌కు అందుబాటులో ఉంటుంది.
Also Read: గూగుల్ ఎఐలో లోపాలు.. తప్పుడు సలహాలు, ప్రమాదకర సూచనలు
iOS 26 ఆపిల్ యొక్క డిజైన్ దృష్టిని మరోసారి నిరూపిస్తోంది. లిక్విడ్ గ్లాస్ డిజైన్, కొత్త ఫీచర్స్‌తో యూజర్‌లకు మరింత సౌకర్యవంతమైన, ఆనందకరమైన అనుభవాన్ని అందిస్తుంది.