Nicholas Pooran Retirement: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో… 2025 సంవత్సరం రిటైర్మెంట్ ఇయర్ గా మారిపోనుందా? గతంలో ఏ సంవత్సరంలో కూడా ఇంతమంది రిటైర్మెంట్ ప్రకటించలేదా? అంటే అవుననే చెబుతున్నాయి రిపోర్టులు. ఈ 2025 సంవత్సరంలో చాలామంది స్టార్ క్రికెటర్లు… తమ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఏజ్ పైబడినవారు అలాగే యంగ్ క్రికెటర్లు కూడా రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. ఈ ఒక్క సంవత్సరమే పదుల సంఖ్యలో రిటైర్మెంట్లు ప్రకటించిన క్రికెటర్లు ఉన్నారు. తాజాగా వెస్టిండీస్ జట్టుకు సంబంధించిన నికోలస్ పూరన్ కూడా షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇస్తూ… కీలక ప్రకటన చేశాడు నికోలస్ పూరన్.
Also Read: Luckiest Batter: అదృష్టమంటే ఇదే…వికెట్లను తాకినా నాటౌటే.. అది కూడా 98 పరుగుల వద్ద
రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ డేంజర్ ఆటగాడు
మంచినీళ్లు తాగినంత ఈజీగా సిక్సులు కొట్టే వెస్టిండీస్ డేంజర్ ఆటగాడు నికోలస్ పూరన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇండియన్ ప్రీమియర్ టోర్నమెంట్ అలాగే అంతర్జాతీయ క్రికెట్ ఆడే…నికోలస్ పూరన్…. తన వ్యక్తిగత కారణాలవల్ల రిటైర్మెంట్ ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కూడా అధికారిక ప్రకటన చేశాడు నికోలస్ పూరన్. వెస్టిండీస్ జట్టు తరఫున ఇప్పటివరకు 61 వన్డే మ్యాచులు, అలాగే 106 t20 మ్యాచ్ లు ఆడాడు. అదే సమయంలో… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో లక్నో జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు నికోలస్ పూరన్. అంతా బాగానే ఉన్నా.. తన వ్యక్తిగత కారణాలవల్ల 29 సంవత్సరాల వయసులోనే.. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు ఈ వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్.
2025 లో రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్లు వీళ్లే
2025 సంవత్సరం క్రికెటర్ల రిటర్మెంట్ సంవత్సరంగా మారిపోయింది. ఈ సంవత్సరం సగం పూర్తికాకముందే దాదాపు 7, 8 మంది రిటైర్మెంట్ ప్రకటించారు. తాజాగా నికోలస్ పూరన్ రిటైర్మెంట్ ( Nicholas Pooran Retirement) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మొన్నటికి మొన్న విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి మన అందరికీ గుర్తుండే ఉంటుంది. చివరి టెస్ట్ ఆడకముందే… రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ.
Also Read:Rohit’s Lamborghini: రోహిత్ శర్మకు అవమానం…గిఫ్ట్ గా ఇచ్చిన కారును అమ్ముకున్న ఫ్యాన్ June 9,2
అటు విరాట్ కోహ్లీ ( Virat Kohli Retirement)కంటే ముందు రోహిత్ శర్మ (Rohit Sharma ) కూడా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించి… అభిమానులకు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కేవలం వన్డేలకు మాత్రమే ఆడుతున్నారు. అటు క్లాసెన్ ( SRH Klasen Retirement)కూడా తాజాగా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. క్లాసెన్ ప్రకటించిన రోజే మాక్సి ( Maxwell )మామ కూడా… వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చాడు. అటు అంతకుముందు స్టీవెన్ స్మిత్ ( Steve Smith) కూడా.. రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే.