Goolge AI Defects| గూగుల్ కొత్త ఎఐ సెర్చ్ టూల్, “AI ఓవర్‌వ్యూస్,” తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ ఫీచర్.. గత వేసవిలో గూగుల్ జెమినీ ఎఐ ప్రారంభమైంది. వినియోగదారులకు త్వరిత, సంగ్రహ సమాధానాలు ఇవ్వాలని ఉద్దేశించబడింది. కానీ, ఇది తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, నిజమైన వార్తా సైట్లకు ట్రాఫిక్‌ను తగ్గిస్తోందని విమర్శకులు అంటున్నారు. ఒక ఉదాహరణలో.. ఇటీవల ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. పిజ్జా సాస్‌కు జిగురు కలపమని గూగుల్ ఏఐ సూచించింది. ఇది చాలా ప్రమాదకరమైన సలహా.
వార్తా సైట్లకు నష్టం
ఎఐ ఓవర్‌వ్యూస్.. నమ్మదగిన సోర్సెస్‌కు వినియోగదారులను పంపకుండా, వివిధ సైట్ల నుంచి ఎఐ సృష్టించిన సంక్షిప్త సమాచారాన్ని (సమ్మరిని) అందిస్తోంది. ఇవి తరచూ అసందర్భంగా ఉంటాయి. దీనివల్ల సమాచార కచ్చితత్వం ప్రమాదంలో పడుతోంది. అథోరిటాస్ అనలిటిక్స్ సంస్థకు చెందిన లారెన్స్ ఓ’టూల్ ప్రకారం.. ఈ ఏఐ సమాధానాల వల్ల వార్తా వెబ్‌సైట్లకు క్లిక్‌లు 40-60 శాతం తగ్గాయి. దీనివల్ల అసలు సమాచార ప్రచురణకర్తలు తీవ్రంగా నష్టపోతున్నారు.
వింత సూచనలు చేసే ఎఐ
గూగుల్ AI.. అత్యంత ఆశ్చర్యకరమైన సూచనల్లో ఒకటి, పిజ్జా సాస్‌లో జిగురు కలపమనడం. ఇది పూర్తిగా ప్రమాదకరమైన సలహా. మరో సందర్భంలో అయితే.. “మీరు బ్యాడ్జర్‌ను రెండుసార్లు నాకలేరు” అని అసభ్య పదజాలంతో ఊహాజనితంగా సమాధానం చెప్పింది. ఇవి AI “హాల్యూసినేషన్స్” అని పిలవబడే సమస్యలకు ఉదాహరణలు—అంటే, AI తప్పుడు లేదా కల్పిత సమాచారాన్ని నిజంగా జరిగినట్లు చూపిస్తుంది.
తప్పులను సమర్థించుకుంటున్న గూగుల్
గూగుల్ తమ ఉత్పత్తిని సమర్థిస్తూ.. జిగురు సూచన ఒక పాత, అస్పష్టమైన రెడ్డిట్ పోస్ట్ నుండి వచ్చిందని, ఇప్పుడు AI పనితీరు మెరుగైందని చెప్పింది. కంపెనీ ప్రకారం.. ఎఐ ఓవర్‌వ్యూస్‌లో 0.7 నుండి 1.3 శాతం మాత్రమే హాల్యూసినేషన్స్ ఉన్నాయి. కానీ, హగ్గింగ్ ఫేస్ అనే AI ప్లాట్‌ఫామ్ ప్రకారం.. ఈ రేటు 1.8 శాతం. మరోవైపు ఓపెన్ AI వంటి ప్రముఖ పోటీదారుల కొత్త మోడల్స్‌లో హాల్యూసినేషన్ రేటు 33 నుండి 48 శాతం వరకు ఉందని తెలుస్తోంది.
గూగుల్ ఎఐ “స్వీయ-రక్షణ” ప్రవర్తన
గూగుల్ AI తనను తాను రక్షించుకునేలా ప్రోగ్రామ్ చేయబడినట్లు కనిపిస్తోంది. “AI కళను దొంగిలిస్తుందా?” లేదా “AI ను భయపడాలా?” అని అడిగినప్పుడు, ఇది సమస్యలను తక్కువ చేసి, ఎటువంటి సోర్సెస్ లేకుండా సమాధానాలు ఇస్తుంది. ఈ ప్రవర్తన నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది, ఎందుకంటే AI సిస్టమ్స్ మరింత సంక్లిష్టంగా, ఊహించలేనివిగా మారుతున్నాయి—కొన్నిసార్లు సృష్టికర్తలకు కూడా.
Also Read: మీ ఫోన్‌లో ఈ సంకేతాలు కనిపిస్తే.. కొత్త ఫోన్ కొనాల్సిందే
ఓపెన్AI వంటి పోటీదారులు తమ కొత్త మోడల్స్ ఎక్కువ హాల్యూసినేషన్స్‌ను చూపిస్తున్నాయని ఒప్పుకున్నారు. కానీ గూగుల్ తన జెమినీ AI టూల్స్‌ను పారదర్శకత, నిజమైన జర్నలిజం ఖర్చుతో ప్రమోట్ చేస్తోంది. దీంతో గూగుల్ కంపెనీపై నిపుణులు అనుమానాల వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ ఇలా చేయడంతో.. బిగ్ టెక్ కంపెనీలు తమ సమాచారాన్ని నమ్మదగిన రీతిలో నిర్వహించగలరా అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది. AI ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడంతో ఇది టెక్నాలజీపై ఆధారపడేవారందరికీ ఒక పెద్ద సవాలుగా మారుతుంది. దీని వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.