Miss You Movie Review :
మూవీ : మిస్ యూ
విడుదల తేదీ : డిసెంబర్ 13, 2024
నటీనటులు : సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్, కరుణాకరన్, బాలశరవణన్ తదితరులు
దర్శకుడు : ఎన్.రాజశేఖర్
నిర్మాతలు : శామ్యుల్ మాథ్యూ
సంగీత దర్శకుడు : గిబ్రాన్
Miss You Movie Rating : 1.75 / 5
సిద్దార్థ్ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు. తమిళ హీరో అయినప్పటికీ.. ఇతన్ని స్టార్ అయ్యిందో తెలుగు సినిమాలతోనే. మంచి నటుడే కానీ కొన్నాళ్లుగా సరైన హిట్టు లేక అల్లాడుతున్నాడు. గతేడాది వచ్చిన ‘చిన్నా’ తమిళంలో బాగానే ఆడింది. కానీ తెలుగులో ఆడలేదు. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిస్ యూ’ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
వాసు (సిద్ధార్థ్) ఓ రిచ్ కిడ్. ఎప్పటికైనా డైరెక్టర్ కావాలనేది ఇతని కోరిక. ఆ లక్ష్యంతోనే పనిచేస్తూ ఉంటాడు.అయితే అనూహ్యంగా ఇతనికి ఒక యాక్సిడెంట్ అవుతుంది. అందులోవాసుకి ఇంటర్మీడియెట్ మెమరీ లాస్ అవుతుంది. దీని వల్ల అతను యాక్సిడెంట్ కి ముందు రెండేళ్లు తన జీవితంలో జరిగిన సంఘటనల్ని మరిచిపోతాడు. అలా మర్చిపోయిన సంగతి కూడా వాసుకి తెలీదు. అతని తల్లిదండ్రులు, స్నేహితులు ఈ విషయాన్ని అతని వద్ద దాచేస్తారు. తర్వాత వాసు ఓ సందర్భంలో బెంగళూరు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అనుకోకుండా సుబ్బలక్ష్మిని (ఆషిక రంగనాథ్) చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కానీ ఆమెకు వాసు అంటే ఇష్టం ఉండదు. అతని ప్రపోజల్ ని కూడా రిజెక్ట్ చేస్తుంది. ఆమె వాసుని ఎందుకు దూరం పెట్టింది? మరోవైపు మంత్రి చిన రాయుడు (శరత్ లోహితస్వ) సుబ్బలక్ష్మిని ఎందుకు చంపాలని ప్రయత్నిస్తుంటాడు? వంటి ప్రశ్నలకి సమాధానమే ఈ ‘మిస్ యూ’ సినిమా.
విశ్లేషణ :
‘మిస్ యూ’ ఆరంభం బాగుంది. దర్శకుడు ఎన్.రాజశేఖర్ ఏదో కొత్తగా చెప్పబోతున్నాడు అనే ఫీలింగ్ ను కలిగిస్తాయి. హీరోకి ఉన్న సమస్య కూడా మిగతా కథనంపై ఆసక్తి రేపుతోంది. కానీ హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ పరమ బోరింగ్ గా సాగుతుంది. ఆ తర్వాత మిగతా భాగం ఎప్పుడు అవుతుందా? అని మనం మొబైల్ చూసుకుంటూ కూర్చుంటాం. దర్శకుడు అద్భుతం అని రాసుకున్న ట్విస్ట్ మనకి రుచించదు. ఆల్రెడీ మనం ఓ సినిమాలో చూసిన ట్విస్టే అది. ఆ సినిమా కూడా మైండ్లో మెదులుతుంది. దాంతో పాటు గతంలో ఛార్మి నటించిన ‘అనుకోకుండా ఒక రోజు’ వంటి సినిమాలు కూడా గుర్తొస్తాయి.
ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా మెరుపులు ఉంటాయి. కానీ అది కవరింగ్ అని ఇంటర్వెల్ ఎపిసోడ్..కే మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ మొదటి 15 నిమిషాలు చూశాక.. మిగతా భాగం మనం చూడలేమేమో అనే ఆలోచన వచ్చేస్తుంది. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్లో ఒకటి, రెండు ట్యూన్స్ మనం రింగ్ టోన్స్ గా పెట్టుకునేలా ఉన్నాయి. కే.జి.వెంకటేష్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటర్ దినేష్ పొన్ రాజ్.. తన వరకు న్యాయం చేయడానికి ప్రయత్నించాడు. ఇంతకు మించి ఈ కథనానికి ఏ ఎడిటర్ కూడా న్యాయం చేయలేడు అనే ఫీలింగ్ కలిగించాడు. ఎందుకంటే రన్ టైం 2 గంటల 8 నిమిషాలే కాబట్టి. ఇక నిర్మాత సామ్యూల్ మాత్యూ ఈ కథకి బాగానే ఖర్చు చేశాడు.
నటీనటుల విషయానికి వస్తే.. సిద్దార్థ్ నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. తన మార్క్ నటనతో, డైలాగ్ డెలివరీతో ఎంగేజ్ చేశాడు. ఆషిక రంగనాథ్ అందంగా కనిపించింది. ఈమె మంచి నటి. కానీ ఆమె పాత్రని సరిగ్గా డిజైన్ చేయలేదు. కరుణాకరన్ కామెడీ అక్కడక్కడా పేలింది. మిగతా నటీనటుల పాత్రలు పెద్ద ఇంప్రెసివ్ గా ఏమీ లేవు.
ప్లస్ పాయింట్స్ :
కోర్ పాయింట్
నిడివి
మైనస్ పాయింట్స్ :
కథనం
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సెకండాఫ్
ఫైనల్ గా.. ‘మిస్ యూ’ చిత్రం మిస్ కాకుండా చూసేంత రేంజ్లో అస్సలు లేదు. చప్పుడు చేయకుండా ఎలా అయితే థియేటర్లలోకి వచ్చిందో.. అలాగే వెళ్ళిపోతుంది.
Miss You Movie Rating : 1.75 / 5