భారతీయ రైల్వే ప్రయాణీకుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. పలు సందర్భాల్లో ప్రయాణీకులు భయంతో వణికిపోయిన సందర్భాలున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ప్రయాణీకులను బెదిరిస్తూ డబ్బులు వసూళు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకీ సదరు వ్యక్తి చేసిన పని చూస్తే వామ్మో అనాల్సిందే. ఇంతకీ అతడు చేసిన ఘనకార్యం ఏంటంటే..
సాధారణంగా చాలా మంది బిచ్చగాళ్లు రైళ్లలో అడుక్కోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా అహ్మదాబాద్ సబర్మతి ఎక్స్ ప్రెస్ రైళ్లో మాత్రం ఓ భయంకరమైన ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి వ్యక్తి తనతో పాటు ఓ పామును తీసుకొని రైలు ఎక్కాడు. ఓ చేతిలో పామును పట్టుకుని, మరో చేతితో డబ్బులు అడుక్కుంటున్నాడు. అతడి చేతిలో ఉన్న పామును చూసి ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. అడిగినం డబ్బులు ఇచ్చేశారు. ఈ తతంగాన్ని ఓ ప్రయాణీకులు తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. “ఓ వ్యక్తి మధ్యప్రదేశ్ లోని ముంగావోలిలో రైలు ఎక్కాడు. అతడు తనతో పాటు ఓ పామును తీసుకొచ్చాడు. ఓ చేతిలో పామును పట్టుకుని, మరో చేతితో డబ్బులు అడుక్కుంటున్నాడు. అతడి చేతిలో పామును చూసి ప్రయాణీకులు చాలా భయపడ్డారు. అతడు అడిగినంత డబ్బులు ఇచ్చారు” అంటూ రైల్వే అధికారులకు ఈ వీడియోను షేర్ చేశాడు.
#Sarp_darshan_on_Rail
Man with snake boarded at Mungaoli (M.P.)
New way of Taking out #money from Hard Working Labour class
inside #IndianRailways @RailwaySeva @RailMinIndia @Central_Railway
train : Ahmedabad Sabarmati Express
Location: Between Mungaoli to Bina Junction. pic.twitter.com/7vM4UhcCaq— Deepak रघुवंशी 🇮🇳 (@draghu888) September 22, 2025
ఈ వీడియోపై రైల్వే స్పందించింది. రైల్వే సేవా ఎక్స్ వేదికగా ప్రయాణీకుడి వివరాలు అందించాలని కోరింది. అంతేకాదు, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని రైల్వే రక్షణ దళాన్ని(RPF) ఆదేశించింది. “మేము మీ ప్రయాణ వివరాలను (PNR / UTS నం.) మొబైల్ నంబర్‌ను DM ద్వారా తీసుకుంటాం. మీరు మీ ఫిర్యాదును నేరుగా http://railmadad.indianrailways.gov.inలో కూడా తెలియజేయవచ్చు. త్వరిత పరిష్కారం కోసం 139కి డయల్ చేయవచ్చు” అని రిప్లై ఇచ్చింది.
అటు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. నెటిజన్లు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి ఘటనల విషయంలో రైల్వే కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. “నిజానికి ఇది వినోదం కాదు. ప్రయాణీకులను పామును చూపించి బెదిరించి డబ్బులు దోపిడీ చేయడమే అవుతుంది. రైల్వే ఇలాంటి విషయాల్లో సీరియస్ గా ఉండాలి” అని రాసుకొచ్చాడు. “రైళ్లలో భద్రత పెంచుతున్నామని రైల్వే అధికారులు చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. రైళ్లలో ప్రయాణీకులు భయపడుతూ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు రైళ్లలో ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచాలి” అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనపై నెట్టింట తెగ రచ్చ నడుస్తోంది. రైల్వే టార్గెట్ గా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Read Also: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!