E-Paper
Advertisement

WWDC 2026 ఈవెంట్‌లో ఆ 3 క్రేజీ ఫీచర్లను దాచేసిన యాపిల్.. లీక్ చేసిన బ్లూమ్‌బర్గ్ జర్నలిస్ట్!

WWDC 2026 ఈవెంట్‌లో ఆ 3 క్రేజీ ఫీచర్లను దాచేసిన యాపిల్.. లీక్ చేసిన బ్లూమ్‌బర్గ్ జర్నలిస్ట్!
Advertisement

Apple iOS 27: ఈ నెల మొదట్లో జరిగిన డబ్ల్యూడబ్ల్యూడీసీ (WWDC) 2026 ఈవెంట్‌లో యాపిల్ తమ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ iOS 27ను ప్రపంచానికి పరిచయం చేసింది. సిరి ఏఐ అప్‌గ్రేడ్స్, యాపిల్ ఇంటెలిజెన్స్ వంటి అద్భుతమైన ఫీచర్లను స్టేజ్ మీద అనౌన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. అయితే, యాపిల్ ఈ ఈవెంట్‌లో చెప్పని మరికొన్ని ఆసక్తికరమైన ఫీచర్లు కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో రెడీ అవుతున్నాయనే సరికొత్త వార్త ఇప్పుడు బయటకు వచ్చింది.

ప్రముఖ బ్లూమ్‌బర్గ్ జర్నలిస్ట్ మార్క్ గుర్మన్ తన తాజా నివేదికలో ఈ సంచలన విషయాలను పంచుకున్నారు. యాపిల్ ఉద్యోగుల డివైజ్‌లలో ప్రస్తుతం ఇవి టెస్టింగ్ దశలో ఉన్నాయని, సెప్టెంబర్ నాటికి ఇవి మన ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

యాపిల్ వాచ్ కోసం సరికొత్త ఫేస్:

Advertisement

ఈ కొత్త అప్‌డేట్‌లో రాబోతున్న మొదటి ఫీచర్ యాపిల్ వాచ్‌కు సంబంధించింది. కంపెనీ తమ అల్ట్రా మోడల్స్ కోసం ప్రత్యేకంగా ఒక సరికొత్త ‘మాడ్యులర్ వాచ్ ఫేస్’ను డిజైన్ చేస్తోంది. దీనివల్ల వాచ్ స్క్రీన్‌ను యూజర్లు తమకు నచ్చినట్లుగా మార్చుకునే వీలుంటుంది. ఈ సరికొత్త ఫీచర్‌ను సెప్టెంబర్‌లో జరిగే యాపిల్ మెయిన్ ఈవెంట్‌లో, కొత్త వాచ్ మోడల్స్‌తో పాటు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Also Read: అబ్బా ఏం స్క్రీన్ సామీ.. 6000 నిట్స్ బ్రైట్‌నెస్‌, 8560mAh బ్యాటరీతో Honor X70 Pro Max లాంచ్!

సిరిలో ఇతర ఏఐ చాట్‌బాట్‌లు:

Advertisement

ఇక ఐఫోన్ యూజర్లకు మరింత పవర్‌ఫుల్ ఏఐ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు యాపిల్ సిద్ధమవుతోంది. Siri ద్వారా కేవలం యాపిల్ ఏఐ మాత్రమే కాకుండా చాట్‌జీపిటి, గూగుల్ జెమిని, ఆంత్రోపిక్ క్లాడ్ వంటి ఇతర థర్డ్ పార్టీ చాట్‌బాట్‌లను కూడా వాడుకునేలా ‘ఎక్స్‌టెన్షన్స్’ అనే ఫీచర్‌ను తెస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఏఐ చాట్‌బాట్ పికర్‌ను కూడా ఐఓఎస్ 27 బీటా వెర్షన్‌లో చేర్చారు. దీంతో యూజర్లు తమకు నచ్చిన ఏఐ బాట్‌ను సులభంగా సెలెక్ట్ చేసుకోవచ్చు.

కెమెరా యాప్‌లో పెను మార్పులు:

ఐఫోన్ ప్రియులకు కెమెరా క్వాలిటీ, అందులోని ఆప్షన్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే iOS 27లో కెమెరా యాప్‌ను పూర్తిగా రీడిజైన్ చేయబోతున్నారు. యూజర్లు తమకు నచ్చినట్లుగా కెమెరా సెట్టింగ్స్, ఇంటర్‌ఫేస్‌ను మార్చుకునే (కస్టమైజ్) వీలును ఇందులో కల్పిస్తున్నారు. ఈ ఏడాది రాబోయే ఐఫోన్ 18 ప్రో మోడల్స్‌లో కెమెరా హార్డ్‌వేర్ పరంగా పెద్ద మార్పులు ఉండబోతున్నాయి. కాబట్టి.. ఈ కొత్త కెమెరా యాప్ అప్‌డేట్‌ను కూడా ఆ ఫోన్ లాంచ్‌తో పాటే రివీల్ చేయాలని యాపిల్ భావిస్తోంది.

త్వరలోనే యూజర్ల ముందుకు:

యాపిల్ ఈ సరికొత్త ఫీచర్లను డబ్ల్యూడబ్ల్యూడీసీ స్టేజ్ పైన చెప్పనప్పటికీ, ఇంటర్నల్‌గా వీటిపై గట్టిగానే వర్క్ చేస్తోంది. కొత్తగా రాబోయే డెడికేటెడ్ సిరి యాప్, విజువల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్లతో పాటు ఈ మూడు సీక్రెట్ ఫీచర్లు కూడా ఈ ఏడాది చివర్లో ఐఫోన్ యూజర్లందరికీ అందుబాటులోకి రానున్నాయి.

Also Read: 512GB స్టోరేజ్, ఆండ్రాయిడ్ 16.. Nothing Phone 3పై ఊహించని రేంజ్‌లో ధర తగ్గింపు!

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×