E-Paper
Advertisement

సెకండ్‌ హ్యాండ్ ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్.. పెట్రోల్ కార్ల కంటే వేగంగా పెరుగుతున్న రేట్లు!

సెకండ్‌ హ్యాండ్ ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్.. పెట్రోల్ కార్ల కంటే వేగంగా పెరుగుతున్న రేట్లు!
Advertisement

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో సెకెండ్ హ్యాండ్ ఈవీలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. తాజాగా విడుదలైన మార్కెట్ గణాంకాల ప్రకారం, వాడిన ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ప్రస్తుతం గ్యాస్, పెట్రోల్ కార్ల కంటే వేగంగా పెరుగుతున్నాయి. ఇంధన ధరలు రోజు రోజుకు చుక్కల్లోకి చేరడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

పెట్రో వాహనాలతో పోల్చితే 12 శాతం పెరిగిన ధరలు

Advertisement

కాక్స్ ఆటోమోటివ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, సెకెండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వాహనాల హోల్‌సేల్ ధరలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 12 శాతం పెరిగాయి. అదే సమయంలో పెట్రోల్,  గ్యాస్‌తో నడిచే వాహనాల ధరలు కేవలం 3 శాతం మాత్రమే పెరిగాయి. ఈ గణాంకాలు ప్రస్తుతం మార్కెట్లో ఈవీలకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

ఫ్యూయెల్ ధరలు పెరగడంతో..

ఇంధన ధరలు పెరగడం వల్ల చాలా మంది వినియోగదారులు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఉండే వాహనాల కోసం చూస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారు పెట్రోల్ ఖర్చును తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇంధన ధరలు గణనీయంగా పెరగడం కూడా ఈ మార్పుకు కారణమైంది. ముఖ్యంగా టెస్లా మోడల్ 3, టెస్లా మోడల్ Y, ఫోర్డ్ మస్టాంగ్ మాక్-E, చెవ్రొలెట్ బోల్ట్, హ్యుందాయ్ ఐయోనిక్ 5 లాంటి వంటి మోడళ్లకు డీలర్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ వాహనాలను సొంతం చేసుకోవడానికి డీలర్లు గతంలో కంటే ఎక్కువ డబ్బులనుచెల్లించడానికి రెడీ అవుతున్నారు.

Advertisement

హోల్‌సేల్ మార్కెట్లో ధరలు పెరగడం వల్ల డీలర్‌ షిప్‌ లలో కూడా వాడిన ఈవీల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త కారు కొనలేని వినియోగదారులు కూడా ఇప్పుడు వాడిన ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతున్నారు. దీంతో మార్కెట్లో డిమాండ్ మరింత పెరుగుతోంది.

ఈవీల ధరలు ఇలాగే పెరుగుతాయా?

అయితే, ఈ పరిస్థితి ఎప్పటికీ కొనసాగకపోవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. రాబోయే నెలల్లో పెద్ద సంఖ్యలో   ఎలక్ట్రిక్ వాహనాలు తిరిగి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో వాడిన ఈవీల సరఫరా పెరుగుతుంది. సరఫరా పెరిగితే డీలర్లు తమ దగ్గర ఉన్న యూజ్డ్ కార్లను త్వరగా అమ్మేందుకు ధరలను తగ్గించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అన్ని ప్రాంతాల్లో ఒకేలా లేదు. మంచి ఛార్జింగ్ సదుపాయాలు ఉన్న నగరాలు, ప్రాంతాల్లోనే ఈవీలకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. ఛార్జింగ్ మౌలిక వసతులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం డిమాండ్ అంతగా లేదు. ఈ కారణంగా ధరల్లో ప్రాంతాల వారీగా తేడాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద, పెరుగుతున్న ఇంధన ధరలు సెకెండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ కు డిమాండ్ ఏర్పడుతోంది. అయితే, భవిష్యత్తులో సరఫరా పెరగడంతో ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉండటంతో కొనుగోలుదారులు కొంత సమయం వెయిట్ చేయడం మంచిదంటున్నారు.

Read Also: ఒకేసారి 3 క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు.. విన్‌ ఫాస్ట్ ప్లాన్ అదిరింది భయ్యా!

Related News

బైక్‌పై వెళ్తూ పాటలు వింటున్నారా? అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ గోవిందా!

హ్యుందాయ్‌కు బిగ్ షాక్.. ఏప్రిల్-జూన్‌లో కుప్పకూలిన లాభాలు.. ఎగుమతులు సైతం డౌన్!

కారు పార్కింగ్ తిప్పలకు చెక్.. రూ.2,000 లోపే టాప్-5 రివర్స్ కెమెరాలు!

కొత్త ఈ-స్కూటర్ కావాలా? మార్కెట్‌ను షేక్ ఆడించే మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

నీటిలోనూ దూసుకెళ్లే.. బెస్ట్ ‘హై గ్రౌండ్ క్లియరెన్స్’ కార్లు.. వర్షాకాలం అస్సలు తగ్గేదేలే!

ఇంధన ధరలతో విసిగిపోయారా? మైలేజ్‌తో కేక పుట్టిస్తున్న.. ఈ CNG కార్లు మీకోసమే!

New Car Buying Tips: కారు కొనాలనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు చెక్ చేయండి!

ఫెస్టివల్ సీజన్‌ లో మారుతి మాస్టర్ ప్లాన్.. బాలెనో, ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×