E-Paper

కవాసకి నింజా బైక్‌లపై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.2.89 లక్షల వరకు తగ్గింపు!

కవాసకి నింజా బైక్‌లపై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.2.89 లక్షల వరకు తగ్గింపు!
Advertisement

Kawasaki Ninja June 2026 Offers: కవాసకి ఇండియా నింజా సిరీస్ బైక్‌లపై మరోసారి క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. తాజాగా నింజా 1100 SX, నింజా ZX-6R, నింజా ZX-10R మోడళ్లపై భారీ తగ్గింపులు ఇస్తోంది.  ఉచిత యాక్సెసరీలు కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక ఆఫర్లు జూన్ 30 వరకే అందుబాటులో ఉంటాయని తెలిపింది.

నింజా ZX-10Rపై రూ. 2.89 లక్షల తగ్గింపు

నింజా మూడు మోడళ్లలో ఎక్కువ బెనిఫిట్స్ పొందుతున్న బైక్ నింజా ZX-10R. ఈ సూపర్‌ బైక్‌ పై కంపెనీ రూ. 2.89 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 17.90 లక్షలకే అందుబాటులోకి వచ్చింది. లీటర్ క్లాస్ సూపర్‌ బైక్ సెగ్మెంట్‌ లో ఈ ధరను చాలా ఆకర్షణీయంగా భావిస్తున్నారు. ఎక్కువ పనితీరు, రేసింగ్ రేంజ్ ఫీచర్లతో వచ్చే ZX-10R ఇప్పుడు మరింత మందికి అందుబాటులోకి వచ్చినట్లైంది. నింజా ZX-10R పవర్ ఫుల్ ఇంజిన్, అధునాతన ఎలక్ట్రానిక్ ఫీచర్లు, ట్రాక్ ఫోకస్డ్ పనితీరుతో బైక్ ప్రేమికులలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రస్తుతం అందిస్తున్న భారీ తగ్గింపు కారణంగా ఈ మోడల్‌ పై ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది.

నింజా 1100 SXపై రూ. 1.25 లక్షల తగ్గింపు

Advertisement

నింజా 1100 SX స్పోర్ట్ టూరింగ్ బైక్‌ పై కంపెనీ ప్రత్యేక యాక్సెసరీ ఆఫర్‌ ను అందిస్తోంది. కొనుగోలుదారులు రెండు ఎంపికల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. అందులో ఒకటి సుమారు రూ. 1.25 లక్షల విలువైన పానియర్ కిట్ కాగా, మరొకటి రూ. 11 వేలకుపైగా విలువ చేసే టాల్ విండ్‌ స్క్రీన్. వీటిలో పానియర్ కిట్ ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తోంది. దీని ద్వారా లాంగ్ టూరింగ్ ప్రయాణాల్లో ఎక్కువ సామాను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.  టూరింగ్‌ను ఇష్టపడే రైడర్లకు నింజా 1100 SX ఇప్పటికే మంచి ఆప్షన్ గా ఉంది. ఇప్పుడు ఫ్రీ యాక్సెసరీలతో అందుబాటులో ఉండటంతో చాలా మంది ఈ బైక్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

నింజా ZX-6Rపై రూ. 84,000 తగ్గింపు

మరోవైపు, నింజా ZX-6R కొనుగోలుదారులకు కూడా కంపెనీ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. ఈ మిడిల్‌ వెయిట్ స్పోర్ట్స్ బైక్‌ తో పాటు సుమారు రూ. 84,000 విలువైన ఓహ్లిన్స్ స్టీరింగ్ డాంపర్‌ ను ఉచితంగా అందిస్తోంది. ఈ యాక్సెసరీ హై స్పీడ్ రైడింగ్ సమయంలో బైక్ కు  స్టెబులిటీ అందించడంలో సాయపడుతుంది.

Advertisement

Read Also: సెకండ్‌ హ్యాండ్ ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్.. పెట్రోల్ కార్ల కంటే వేగంగా పెరుగుతున్న రేట్లు!

Related News

టయోటా హిలక్స్ స్పై షాట్స్ లీక్, లుక్ అదిరింది భయ్యా!

సెకండ్‌ హ్యాండ్ ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్.. పెట్రోల్ కార్ల కంటే వేగంగా పెరుగుతున్న రేట్లు!

ఒకేసారి 3 క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు.. విన్‌ ఫాస్ట్ ప్లాన్ అదిరింది భయ్యా!

వోక్స్‌ వ్యాగన్ బిగ్ ప్లాన్.. ఏకంగా 4 కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఆ మోడళ్లపై రూ.2.15 లక్షల వరకు ఆదా!

టాటా నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ SUVలు.. ప్లాన్ అదిరింది మాస్టారూ!

ప్లగ్ ఇన్ హైబ్రిడ్ vs స్ట్రాంగ్ హైబ్రిడ్.. ఇండియన్స్ వినియోగదారులకు ఏది బెస్ట్?

×