E-Paper
Advertisement

సెప్టెంబర్‌లో లాంచ్.. భారీగా పెరగనున్న iPhone 18 Pro Max ధర, పూర్తి వివరాలు!

సెప్టెంబర్‌లో లాంచ్.. భారీగా పెరగనున్న iPhone 18 Pro Max ధర, పూర్తి వివరాలు!
Advertisement

iPhone 18 Pro Max: యాపిల్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్’ మోడల్ సెప్టెంబరులో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈసారి అధునాతన ఏ20 ప్రో చిప్‌సెట్, పవర్‌ఫుల్ కెమెరాలు, మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో ఈ ఫోన్ రాబోతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా ఏ విషయమూ ప్రకటించకపోయినా.. తాజా తీకుల ద్వారా ఈ కొత్త ఐఫోన్‌లో ఏయే ఫీచర్లు ఉండవచ్చో తెలుసుకుందాం.

కెమెరా సెటప్‌లో విప్లవాత్మక మార్పులు..

ఈసారి మెయిన్ కెమెరా విభాగానికి యాపిల్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. వెనుక వైపు 48MP సామర్థ్యం కలిగిన 3 కెమెరాలను అందించే అవకాశం ఉంది. వీటిలో మెయిన్, అల్ట్రావైడ్, పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌లు ఉంటాయి. అంతేకాకుండా.. లైటింగ్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌ను మనకు కావలసినట్లు అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా వేరియబుల్ అపెర్చర్ టెక్నాలజీని తీసుకువస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 24MP కెమెరా ఉండవచ్చు. ఫేస్ ఐడీ సెన్సార్లను డిస్‌ప్లే కిందకు మార్చి, డైనమిక్ ఐలాండ్ సైజును తగ్గించే ఆలోచనలో కంపెనీ ఉంది.

Advertisement

Also Read: అయ్య బాబోయ్.. క్రెడిట్ కార్డులపై బ్యాంకులు వసూలు చేసే హిడెన్ చార్జీలు ఇవా?!

డిస్‌ప్లే, ప్రాసెసర్ పవర్..

iPhone 18 Pro Maxలో 6.9 అంగుళాల పెద్ద ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కొనసాగించే అవకాశం ఉంది. ఈ స్క్రీన్ మరింత ప్రకాశవంతంగా, తక్కువ ఛార్జింగ్ తీసుకునేలా రూపుదిద్దుకుంటోంది. ఇక పనితీరు విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో వాడే ఏ20 ప్రో చిప్‌సెట్‌ను 2 నానోమీటర్ ప్రాసెస్ ఆధారంగా తయారు చేయనున్నారు. ఇది ఫోన్ వేగాన్ని పెంచడమే కాకుండా.. బ్యాటరీని కూడా ఆదా చేస్తుంది. మల్టీ టాస్కింగ్ సులువుగా సాగడానికి వీలుగా ఈ ప్రో మోడళ్లలో 12GB RAM అందించవచ్చని తెలుస్తోంది.

బ్యాటరీ, డిజైన్ వివరాలివే..

Advertisement

గత మోడళ్లతో పోలిస్తే.. ఇందులో పెద్ద బ్యాటరీని అమర్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రో మ్యాక్స్ వేరియంట్‌లో దాదాపు 5,567mah సామర్థ్యం ఉన్న బ్యాటరీని ఇచ్చే అవకాశం ఉంది. డిజైన్ పరంగా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ లాగే ఉన్నప్పటికీ, కెమెరా మాడ్యూల్, బాడీ అమరికలో కొన్ని చిన్నపాటి మార్పులు చేయవచ్చు.

 ధరలు ఎలా ఉండవచ్చు?

ఈ ఐఫోన్ భారత మార్కెట్లో కాస్త ఖరీదైనదిగా మారే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.1,49,900 నుండి రూ.1,69,900 మధ్యలో ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే, సెప్టెంబరులో జరిగే అధికారిక లాంచ్ ఈవెంట్ వరకు ఈ వివరాలన్నీ కేవలం ఊహాగానాలే కాబట్టి.. అసలు ధరలు, స్పెసిఫికేషన్లు తెలుసుకోవడానికి మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Also Read: ఇదెక్కడి మాస్ డిస్కౌంట్ మావా.. Samsung Galaxy S26 Plusపై రూ.30,500 తగ్గింపు!

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×