E-Paper
Advertisement

అయ్య బాబోయ్.. క్రెడిట్ కార్డులపై బ్యాంకులు వసూలు చేసే హిడెన్ చార్జీలు ఇవా?!

అయ్య బాబోయ్.. క్రెడిట్ కార్డులపై బ్యాంకులు వసూలు చేసే హిడెన్ చార్జీలు ఇవా?!
Advertisement

Credit Card Hidden Charges: కొందరికి క్రెడిట్ కార్డ్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచాన్ని కొనేయొచ్చనే ధీమా వచ్చేస్తుంది. చేతిలో నగదు లేకపోయినా అవసరాలకు పనికొస్తుందని దీనికి అలవాటు పడుతుంటారు. కానీ, మనం స్వైప్ చేసే ప్రతిసారీ బ్యాంకులు మనకు చెప్పకుండా వసూలు చేసే కొన్ని హిడెన్ చార్జీలు ఉంటాయి. వాటి గురించి ముందుగానే తెలుసుకోకపోతే చివరికి నష్టపోయేది మనమే.

లేట్ ఫీజు బాదుడు..

సమయానికి బిల్లు కట్టడం ఒక్క రోజు ఆలస్యమైనా బ్యాంకులు ఏమాత్రం కనికరం చూపవు. నిర్ణీత గడువు దాటితే భారీగా లేట్ పేమెంట్ ఫీజు వేస్తాయి. దీనికి తోడు మనం కట్టాల్సిన అసలు మొత్తంపై రోజువారీ ప్రాతిపదికన వడ్డీ లెక్కించడం మొదలుపెడతాయి.

వడ్డీ చక్రవ్యూహం..

Advertisement

చాలామంది బిల్లులో కనిపించే మినిమం అమౌంట్ కట్టేసి హమ్మయ్య అనుకుంటారు. కానీ అది పెద్ద పొరపాటు. మిగిలిన బకాయిపై బ్యాంకులు ఏకంగా 30 నుండి 40 శాతం వరకు వార్షిక వడ్డీ వసూలు చేస్తాయి. పైగా ఈ బకాయి తీరేవరకు మీరు చేసే కొత్త కొనుగోళ్లకు కూడా ఉచిత క్రెడిట్ కాల పరిమితి వర్తించదు.

Also Read: జియో, ఎయిర్‌టెల్‌కి BSNL బిగ్ షాక్.. కేవలం రూ.1కే రీఛార్జ్.. 500 లైవ్ టీవీ ఛానెళ్లు ఉచితం!

ఏటీఎం విత్‌డ్రాయల్ కాస్ట్..

Advertisement

అత్యవసరమని క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ATM నుండి డబ్బులు తీశారా.. ఇక అంతే సంగతులు. ఏటీఎం నుంచి నగదు డ్రా చేసిన మరుసటి క్షణం నుండే వడ్డీ పడటం ప్రారంభమవుతుంది. దీనికి తోడు క్యాష్ అడ్వాన్స్ ఫీజు పేరిట మరికొంత మొత్తం అదనంగా బిల్లులో చేరిపోతుంది.

పరిమితి దాటితే ఫైన్..

మీ కార్డుకు ఉన్న పరిమితిని దాటి ఒక్క రూపాయి ఎక్కువ వాడినా ఓవర్ లిమిట్ ఫీజు పడుతుంది. చాలాసార్లు మనం చేసే కొనుగోలుతో పాటు దానికి తోడయ్యే పన్నుల వల్ల కూడా ఈ లిమిట్ దాటిపోయి అదనపు చార్జీలు పడే ప్రమాదం ఉంటుంది.

వార్షిక రుసుములు, పన్నులు..

ఉచితంగా ఇచ్చామని చెప్పే కార్డులకు కూడా కొన్ని షరతులు ఉంటాయి. ఏడాదికి నిర్దిష్ట మొత్తం వాడకపోతే యాన్యువల్ ఫీజు వేస్తారు. వీటితో పాటు మనం చెల్లించే ప్రతి చార్జీపై జీఎస్‌టీ పడుతుంది. కాబట్టి.. కార్డు వాడే ముందు ఈ హిడెన్ చార్జీలపై ఓ కన్నేసి ఉంచడం చాలా మంచిది.

Also Read: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రాబోతున్న Poco F9 ఫ్లాగ్‌షిప్ ఫోన్లు.. లీకైన వివరాలివే!

Tags

Related News

ఇల్లు కొనుగోలు చేస్తున్నారా? బిల్డర్లు ఈ విషయాల్లో మోసం చేస్తారు.. జాగ్రత్త

రూ.1 లక్ష జీతం వచ్చినా సరిపోవడం లేదు? యువ ఉద్యోగుల ఫ్రస్ట్రేషన్

రాష్ట్రం మారితే మద్యం ధర ఎందుకు మారుతుంది? అత్యంత తక్కువ ధర రాష్ట్రాలు ఇవే

బ్యాంక్‌లో సీనియర్ జాబ్ వదిలి మైక్రోగ్రీన్స్ బిజినెస్.. చిన్నగదిలో నుంచే రూ.5 లక్షలు ఆదాయం

పోస్ట్ ఆఫీస్ MISలో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేయవచ్చా? డిపాజిట్ లిమిట్స్ ఇవే

8 ఏళ్లుగా ఉద్యోగం లేదు.. 3 సార్లు యుపిఎస్‌సి పరీక్షలు ఫెయిల్.. కట్ చేస్తే రూ.17 లక్షల సాలరీ ఉద్యోగం

రాబోయే 2 ఏళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో అలాంటి ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్

రూ.10 వేలతో బిజినెస్.. ఇంటి నుంచే రూ. లక్షల సంపాదన.. రిచ్ అవ్వడం పక్కా!

Big Stories

Advertisement
×