BigTV English

iPhone SE 4 : ఐఫోన్ SE 4 – 5 బిగ్​ ఛేంజెస్ ఇవే 

iPhone SE 4 : ఐఫోన్ SE 4 – 5 బిగ్​ ఛేంజెస్ ఇవే 

iPhone SE 4 : రీసెంట్​గానే యాపిల్ నుంచి ఐఫోన్ 16 సిరీస్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు యాపిల్ లవర్స్​, త్వరలోనే విడుదల కానున్న ఐఫోన్ SE 4 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ స్మార్ట్ ఫోన్​కు సంబంధించిన కొన్ని ఫీచర్స్​ లీక్ అయ్యాయి. 16 సిరీస్​తో పోలిస్తే SE 4 మరిన్ని మేజర్ అప్డేట్స్​ను యాపిల్ చేయబోతుందట. దాదాపు 5 మేజర్​ ఛేంజస్​తో రానుందట. వీటి గురించి యాపిల్ అఫీషియల్​గా ప్రకటించకపోయినప్పటికీ, దాదాపుగా ఇదే ఫీచర్స్​తో SE 4 రాబోతుందని అంతా ఆశిస్తున్నారు. ఇంతకీ అవేంటి? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.


డిజైన్ – ఐఫోన్ SE 4… ఐఫోన్ 14 డిజైన్​ను పోలి ఉంటుంది. అయితే 4.7 అంగుళాల ఎల్​సీడీ స్క్రీన్​కు బదులు 6.1 అంగుళాల ఓఎల్​ఈడీ డిస్​ప్లేతో రానుంది. ఇంకా హోమ్ బటన్, ఫేస్ ఐడీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కెమెరా – కెమెరా విషయానికొస్తే, ఐఫోన్ SE 4 కొన్ని మేజర్ అప్​గ్రేడ్స్​తో రానుంది. 48 మెగా పిక్సల్​ మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 12 మెగా పిక్సల్​ను అమర్చారట. ప్రస్తుత ఐఫోన్ మోడల్​లోని​ బేసిక్ ఫొటోగ్రఫీ సెటప్​తో పోలిస్తే ఈ ఇమ్​ప్రూమెంట్స్ ​SE 4లో బిగ్​ ఛేంజ్​ను ఇవ్వనున్నాయి.


పెర్​ఫార్మెన్స్​ – యాపిల్​ లేటెస్ట్ ప్రాసెసర్​, A18 చిప్​సెట్​తో​ SE 4 రానుందని తెలుస్తోంది. 8 జీబీ ర్యామ్​తో రానుంది. అలానే రైటింగ్ టూల్స్​, జెన్​మోజీ, ఫొటోస్​ క్లీన్ అప్​, ఆల్​ న్యూ సిరి వంటి యాపిల్ ఇంటెలిజెన్స్​ ఫీచర్స్​ కూడా ఉండనున్నాయట.

యూఎస్​బీ సీ ఛార్జింగ్ పోర్ట్​ – ఈయూ రెగ్యూలేషన్స్​ ప్రకారం, అప్​కమింగ్ ఐఫోన్ ఎస్​ఈ 4 లైటనింగ్ పోర్ట్​కు బదులుగా యూఎస్​బీ సీ ఛార్జింగ్​ పోర్ట్​తో రానుంది. ఐప్యాడ్​, మ్యాక్​బుక్​ లేదా ఇతర ఆండ్రాయిడ్ డివైసెస్​కు ఉండే టైప్ సీ ఛార్జ్ కేబుల్​తోనే ఈ ఎస్​ఈ 4కు ఛార్జ్​ పెట్టుకునేలా వీలు కల్పించనుంది.

యాపిల్స్​ ఇన్​ హోస్​ మోడెమ్​ – యాపిల్​ ఇన్​ హౌస్, ఐఫోన్ ఎస్​ఈ 4తో ఇంట్రడ్యూస్​ కానుంది. అలానే ఈ స్మార్ట్ ఫోన్ 5జీ, వైఫై, బ్లూటూత్​, జీపీఎస్​ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని వల్ల యాపిల్​, క్వాల్​కమ్​పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ధర విషయానికొస్తే ఈ ఐఫోన్ ఎస్​ఈ 4 దాదాపు 499 డాలర్లుగా ఊండనుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.49,900గా ఉండొచ్చన మాట. మొత్తంగా దీనిపై ఓ స్పష్టత రావాలంటే యాపిల్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి ఉండాల్సిందే.

ఇక ఆపిల్ కంపెనీ వచ్చే ఏడాది పలు లేటెస్ట్ గ్యాడ్జెట్స్ పరిచయం చేయనుంది. వీటిలో ఐఫోన్ 17 సిరీస్ తో పాటు హోమ్ గాడ్జెట్స్ కూడా ఉన్నాయి. స్మార్ట్ హోమ్ కెమెరాస్ తో పాటు సన్ గ్లాసెస్ ను సైతం యాపిల్ లేటెస్ట్ ఫీచర్స్ తో తీసుకురాబోతుంది. ఇక వచ్చే ఏడాది రాబోతున్న ఐఫోన్ 17 సిరీస్ లో 4 మొబైల్స్ వస్తుండగా వీటితో పాటు స్లిమ్ మొబైల్ సైతం రాబోతున్నట్టు సమాచారం. ఇక యాపిల్ ఫోల్డబుల్ మొబైల్స్ ను 2026లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.

ALSO READ : దుమ్మురేపబోతున్న ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మాక్స్.. ఫైనల్ ఫీచర్స్ లీక్

Related News

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Galaxy S24 FE: గెలాక్సీ S24 FE పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్.. ఇప్పుడే కొనుగోలు చేయాలా?

Realme P3 5G Launched: రియల్‌ మీ పి3 5జి.. ఫోటోలు, గేమ్స్, బ్యాటరీ అన్నీ సూపర్!

iOS 26 Downgrade: కొత్త iOS 26‌తో ఐఫోన్లలో తీవ్ర సమస్యలు.. పాత iOSకు ఇలా డౌన్‌గ్రేడ్ చేయండి

Google Storage: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఇలా చేస్తే క్షణాల్లో సగం ఖాళీ అవుతుంది!

Flipkart vs Amazon iPhone: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ ఆఫర్లలో ఏది బెస్ట్?

Jio Keypad 5G: స్మార్ట్‌ఫోన్‌లకు షాక్.. జియో కీప్యాడ్ 5జి కొత్త రికార్డు

Big Stories

×