iPhone 17 Series : యాపిల్ కంపెనీ తాజాగా లాంఛ్ చేసిన ఐఫోన్ 16 సిరీస్ కు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ లో లాంఛ్ అయిన గ్యాడ్జెట్స్ అన్నిటికీ మంచి డిమాండ్ నెలకొంది. ఇక త్వరలోనే ఐఫోన్ 17 సిరీస్ ను యాపిల్ మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 17 ప్రో మాక్స్ డిజైన్, ధర, ఫీచర్స్ పై లేటెస్ట్ అప్డేట్స్ లీక్ అయ్యాయి. అదిరే ఫీచర్స్ తో ఈ మెుబైల్ సిరీస్ రాబోతుందన్నట్లు తెలుస్తుంది.
ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ సంస్థ యాపిల్ నుంచి కొత్త సిరీస్ లాంఛ్ అవుతుందంటే టెక్ ప్రియులకు పండగే. ఇక ఈ టెక్ దిగ్గజం.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ మొబైల్స్ ను లాంఛ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఐఫోన్ 16 సిరీస్ లాంఛ్ కాగా.. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఐఫోన్ 17 సిరీస్ ను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ మొబైల్స్ అన్నీ లేటెస్ట్ అప్డేట్స్ తో రాబోతున్నట్లు తాజాగా లీక్ అయిన ఫీచర్స్ చెప్పేస్తున్నాయి.
యాపిల్ కంపెనీ ప్రతీ ఏడాది సెప్టెంబర్ రెండు లేదా మూడో వారంలో ఐఫోన్ కొత్త సిరీస్ ను లాంఛ్ చేస్తుంది. ఇక ఈ ఏడాది ఐఫోన్ 16 సిరీస్ ను లాంఛ్ చేయగా.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ సెప్టెంబర్ 9, 2025న రాబోతున్ననట్లు తెలుస్తుంది. ఇక ఇండియాలో సెప్టెంబర్ 10 నుంచి 14 మధ్య ఈ ఫోన్స్ కొనుగోలుకు అందుబాటులో ఉండనున్నట్టు సమాచారం. ఈ సిరీస్ లో iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర, ఫీచర్స్ మరోసారి వైరల్ గా మారాయి.
iPhone 17 Features –
ఫీచర్స్ – iPhone 17 ఫీచర్స్ అదిరిపోయే విధంగా ఉండనున్నట్టు తెలుస్తుంది. డిజైన్ తో పాటు కెమెరాను సైతం ఆత్యాధునికంగా యాపిల్ కంపెనీ డిజైన్ చేయనున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐఫోన్ 16 ప్రో మాక్స్ లాంఛ్ అయినప్పుడు దీని ధర రూ. 1,44,900. 256 GB వేరియంట్ ధర ఈ రేంజ్ లో ఉండగా… దీని కంటే ముందుగా లాంఛ్ అయిన ఐఫోన్ 15 ప్రో మాక్స్ ధర కంటే 15000 ఎక్కువగా ఉంది. ఇక ఐఫోన్ 17 సైతం రూ.15వేలు ఎక్కువగా ఉంటే అవకాశం కనిపిస్తుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ అండర్ డిస్ ప్లే ఫేస్ ఐడి టెక్నాలజీతో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మొబైల్ ను బెస్ట్ లుకింగ్ కోసం గ్రీన్ కలర్ ఆప్షన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
ఈ మొబైల్ యాంటీ రిఫ్లెక్షన్ తో రాబోతుందని.. ఇక స్క్రాచ్ రెసిస్టెంట్గా బ్రైట్ లైట్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ 4685 ఎంహెచ్ బ్యాటరీతో రాగా ఐఫోన్ 17 ప్రో మాక్స్ దీని కంటే ఎక్కువ పరిమాణంలో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ 48 టెలిఫోటో లెన్స్ తో రాబోతుంది. ఆపిల్ విజన్ ప్రో హెడ్సెట్ అండ్ 24 ఫ్రెంట్ కెమెరాతో ఈ మొబైల్ లాంఛ్ కాబోతున్నట్టు అంచనా. ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ కోసం ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఆపిల్ డిజైన్ వైఫై 7 చిప్ సెట్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది.
iPhone 17 Pro మెుబైల్ 3nm ప్రాసెస్‌తో పనిచేసే కొత్త A19 ప్రో చిప్ సెట్ తో పనిచేస్తుంది. ప్రో మోడల్స్ 12GB RAMతో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. iPhone 17 Pro Max మూడు 48MP లెన్స్‌లతో ప్రధాన కెమెరా అప్‌గ్రేడ్‌లతో రాబోతుంది. వైడ్, అల్ట్రా వైడ్, టెట్రాప్రిజం టెలిఫోటో లెన్స్ తో రాబోతుంది. ఇక అన్ని iPhone 17 మోడల్స్ 24MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రాబోతున్నట్లు తెలుస్తుంది.
ALSO READ : జీమెయిల్ లో ఈ సీక్రెట్ ట్రిక్ తెలుసా!