BigTV English

Prabhas: అవి అవసరమా డార్లింగ్స్.. ప్రభాస్ వీడియో వైరల్

Prabhas: అవి అవసరమా డార్లింగ్స్.. ప్రభాస్ వీడియో వైరల్

Prabhas: తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నివారణ చర్యలు చేపట్టిన విషయం విదితమే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటినుంచో సెలబ్రిటీలను డ్రగ్స్ నివారణ చర్యల సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిస్తూనే ఉన్నారు. ఇక ఈ మధ్య జరిగిన చర్చల్లో దాని గురించే ఎక్కువగా మాట్లాడారు. దీని తర్వాత సెలబ్రిటీల సైతం డ్రగ్స్ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటామని సీఎం రేవంత్ రెడ్డికి మాట ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే స్టార్స్ అందరూ డ్రగ్స్ నివారణ చర్యలు చేపట్టే కార్యక్రమంలో పాల్గొంటున్నారు.


తమ సినిమా రిలీజ్ లకు ముందే డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలలో మార్పును తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు హీరోయిన్లు డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. తాజాగా పాన్  ఇండియా స్టార్ ప్రభాస్ సైతం డ్రగ్స్ అవగాహన కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియోను రిలీజ్ చేశాడు. డ్రగ్స్ నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వంతో ప్రభాస్ చేతులు కలిపాడు.

Nassar: హీరో విజయ్ పై షాకింగ్ కామెంట్స్.. మా జీవితాలను ప్రభావితం చేశారంటూ..?


వీడియోలో ప్రభాస్ మాట్లాడుతూ.. “లైఫ్ లో మనకు బోల్డన్ని ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉన్నది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బతికే మనవాళ్లు మనకున్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. సే నోటు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలు అయితే 871261111 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్ తీసుకునే వారిని కోలుకునేలాగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోలో ప్రభాస్ లుక్ ఫాన్స్ ను ఫిదా చేస్తుంది. ఈ ఏడాది కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ భారీ విజయాన్ని అందుకున్నాడు. బాహుబలి తర్వాత అంతటి హిట్ ను  కల్కి ప్రభాస్ కు  అందించింది. ఈ సినిమా విజయం తరువాత డార్లింగ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాజా సాబ్ షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.

Sanjay Gupta: ఎవరీ ఛండాలమైన వ్యక్తి.. వాళ్ల ముఖాలపై వేలెత్తి చూపించే దమ్ముందా..? నాగవంశీపై బాలీవుడ్ డైరెక్టర్ ఫైర్

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరో మూడు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ ఒకటి. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాను పూర్తి చేసిన వెంటనే  హను రాఘవపూడి సినిమాలోకి ప్రభాస్ ఎంటర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఇక ఈ మధ్య ప్రభాస్  కొద్దిగా రెస్ట్ తీసుకున్న విషయం తెలిసిందే. కాలికి దెబ్బ తగలడంతో ఇటలీలో చికిత్స కోసం వెళ్లిన ప్రభాస్ ఈమధ్యనే ఇండియాకు వచ్చాడు. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కూడా రావడంతో డార్లింగ్ తన సొంతూరు వెళ్లి అక్కడే కుటుంబంతో కలిసి సంక్రాంతి సెలవులను ఎంజాయ్ చేసి రానున్నాడని  వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన ప్రభాస్ జనవరి నెల చివర్లో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ మళ్లీ సెట్ లో అడుగు పెట్టనున్నాడట. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×