Apple MacBook : తక్కువ ధరకే యాపిల్ లాప్టాప్ కొనాలనుకుంటున్నారా? ఇక ఇంకెందుకు ఆలస్యం.. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ ఆఫర్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే.
MacBook Air M2 ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ (Flipkart Bigbillion days Sale 2024) లో భాగంగా రూ. 29,900 భారీ తగ్గింపును అందిస్తుంది. SBI, ICICI, Kotak బ్యాంక్ కార్డ్ కస్టమర్‌లకు రూ. 34,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ సైతం అందిస్తుంది. ఇక ఈ ల్యాప్టాప్ అదిరే ఫీచర్స్ తో వచ్చేసింది. Apple M2 ప్రాసెసర్, 13.6 అంగుళాల రెటినా డిస్‌ప్లే, 18 గంటల బ్యాటరీ లైఫ్, Wi-Fi 6 సపోర్ట్ ఉన్నాయి.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024లో Apple MacBook Air M2 భారీ తగ్గింపు లభిస్తుంది. మాక్‌బుక్ ఎయిర్ M2 అన్‌వర్స్డ్ కోసం రూ. 1,19,900 ధరతో ప్రారంభించబడింది. ఇప్పుడు రూ. 70,000లోపు అందుబాటులో ఉంది.ఇక ఈ ల్యాప్‌టాప్ ఆకర్షణీయమైన ఫీచర్లు, అదిరే హార్డ్‌వేర్ సిస్టమ్ తో వచ్చేస్తుంది.
నిజానికి MacBook Air M2 ధర సాధారణంగా దాదాపు రూ. 99,900. ఇప్పటికీ Apple స్టోర్‌లో అదే ధరతో సేల్ లో ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ లో భాగంగా ధర సుమారు రూ. 29,900 తగ్గింపుతో షార్ట్ లిస్ట్ లో ఉంది. వాస్తవానికి, MacBook Air M2 ప్లాట్‌ఫారమ్‌లో రూ. 73,990కే అందుబాటులో ఉంది. అయితే SBI, ICICI, Kotak క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను ఉపయోగించడంపై కస్టమర్‌లు అదనంగా రూ. 5,000 తగ్గింపును కూడా పొందవచ్చు.
ఇక కస్టమర్లు నెలకు రూ. 12,332 నుండి EMIని కూడా ఎంచుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ పాత డివైజ్‌పై రూ. 34,000 వరకు ఎక్స్ఛేంజ్ విలువను కూడా అందిస్తోంది. ఈ డీల్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంది.
Apple MacBook Air M2 స్పెసిఫికేషన్స్ –
Apple MacBook Air M2 స్లీక్ బాడీ 13.6 అంగుళాల రెటినా డిస్ప్లే, 60 Hz తో వచ్చేసింది. Apple M2 2nd Gen ప్రాసెసర్‌తో 8GB RAM + 512GB SSDతో పని చేస్తుంది. 18 గంటల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. బ్యాక్‌లిట్ కీబోర్డ్, ట్రాక్‌ప్యాడ్, అంతర్నిర్మిత వెబ్ కెమెరా, అంతర్గత మైక్రోఫోన్ వంటి ఫీచర్స్ ను సైతం కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా, MacBook Air M2 Wi-Fi 6 కి మద్దతు ఇస్తుంది. హెడ్‌ఫోన్, మైక్ కాంబో జాక్‌తో పాటు రెండు Thunderbolt 4 (Type C) పోర్ట్‌లను కలిగి ఉంటుంది. ఇది అధిక నాణ్యత స్టీరియో స్పీకర్లను సైతం కలిగి ఉంది.
ఈ యాపిల్ ల్యాప్ టాప్ నాలుగు కలర్ వేరియంట్స్ లో అందుబాటులోకి వచ్చేసింది. మిడ్‌నైట్, సిల్వర్, స్పేస్ గ్రే, స్టార్‌లైట్ గోల్డ్ కలర్స్ లో ఉంది. కాగా ఇందులో అదనపు భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో సైతం ఉంది. ఇక ఇంకెందుకు ఆలస్యం.. ఈ ల్యాప్టాప్ మీరూ కొనాలనుకుంటే ఓ సారి ట్రై చేసేయండి
ALSO READ : ‘బాధ్యతగా వ్యవహరించండి, అలా జరిగితే చాలా ప్రమాదం!’ – యాపిల్‌పై ప్రముఖ మీడియా ఫైర్..!!