BigTV English

Trump Europe Tariff: అమెరికా నుంచే చమురు కొనాలి లేకపోతే.. యూరోప్ దేశాలకు ట్రంప్ వార్నింగ్

Trump Europe Tariff: అమెరికా నుంచే చమురు కొనాలి లేకపోతే.. యూరోప్ దేశాలకు ట్రంప్ వార్నింగ్

Trump Europe Tariff| మరో నెల రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠం అధిష్ఠించబోతున్నారు. కానీ అంతవరకూ ఆయన ఆగడం లేదు.. ముందుగానే పరిపాలన సాగించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి రోజు ఏదో అంశం.. అది అమెరికా అంతర్గత వ్యవహారమైనా.. లేదా ప్రపంచ దేశాలతో ముడిపడినదైనా ఆయన దానిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అక్రమ వలసలు, హెచ్ వన్‌బి వీసా, అమెరికా పౌరసత్వం విధానాలను కట్టడి చేస్తానని, ఆంక్షలు విధిస్తానని చెప్పారు. ఇప్పుడు తన మన భేదం లేకుండా అన్ని దేశాలకు వార్నింగ్ లు ఇస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యం అంశంపై ఆయన తీరు చాలా కఠినంగా కనిపిస్తోంది. ఇప్పటి దాకా చైనా, ఇండియా లాంటి దేశాలపై వాణిజ్యం విషయంలో అధిక పన్నులు వేస్తానన్న ట్రంప్ తాజాగా మిత్రదేశాలైన యూరోప్ కూటమికి హెచ్చరిస్తున్నారు.


అమెరికా, యూరోప్ దేశాల మధ్య ఉన్న వాణిజ్య లోటుని (ట్రేడ్ డెఫిసిట్) భర్తి చేయాలని లేకపోతే అధిక పన్నులు విధించాల్సి వస్తుందని యూరోప్ దేశాల కూటమిని హెచ్చరించారు. అమెరికా నుంచే యూరోప్ దేశాలు చమురు కొనాలని లేదా పన్నులు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రూత్ సోషల్ ప్లాట్ ఫామ్ పై ఒక పోస్ట్ చేశారు.

“నేను యూరోప్ యూనియన్ (దేశాల కూటమి)కి ముందే చెప్పాను. ఆ దేశాలన్నీ అమెరికాతో ఉన్న వాణిజ్య లోటు భర్తి చేయడానికి అమెరికా నుంచి భారీ స్థాయిలో ఆయిల్ అండ్ గ్యాస్ (చమురు) కానాలని.. లేకపోతే అన్ని రకాల పన్నులు వారికీ వర్తిస్తాయి” అని ట్రంప్ తన పోస్ట్ లో రాశారు.


Also Read: మిస్‌లీడింగ్ ధంబ్‌నెయిల్స్ పై యూట్యూబ్ కొరడా.. వీడియో తొలగింపు, ఫైన్ తప్పదు..

గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఆయన యూరోప్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. “చాలా కాలం (కొన్ని దశాబ్దాలు) నుంచి యూరోప్ దేశాల భారం అమెరికా మోస్తోంది. దాన్ని మేము భరించాం. అయితే ఇకపై ఆ భారం మోసే బాధ్యత వారిదే” అని చెప్పారు. అప్పుడు ఆయన నాటో కూటమికి నిధులు నిలివేస్తానని.. ఆ ఖర్చులు యూరోప్ దేశాలే అధికంగా భరించాలని చెప్పారు.

అమెరికా ప్రభుత్వ గణాంకాలు చూస్తే.. 2022 సంవత్సరానికి గాను యూరోప్ కూటమితో అమెరికా వాణిజ్య లోటు 202.5 బిలియన్ డాలర్లుగా ఉంది.అంటే యూరోప్ దేశాల నుంచి అమెరికా ఎక్కువ దిగుమతి చేసుకుంటోంది. కానీ యూరోప్ దేశాలు అమెరికా నుంచి దిగుమతులు తక్కువగా చేసుకుంటున్నాయి. 2022లో యూరోప్ కూటమి దేశాల నుంచి అమెరికా 553.3 బిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంది. అదే ఆ దేశాలకు అమెరికా ఎగుమతులు చూస్తే.. 350.8 బిలియన్ డాలర్లు మాత్రమే.

ఈ వాణిజ్య లోటు భర్తి చేయడానికే అమెరికా నుంచి చమురు కొనాలని యూరోప్ దేశాలకు ట్రంప్ చెబుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ చక్కబెట్టేందుకు ఆయన చేపట్టిన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ లో భాగంగానే ఆయన అన్ని దేశాలపై దిగుమతి పన్నులు విధిస్తానని హెచ్చరిస్తున్నారు.

‘అన్ని వైపులా అమెరికా కు నష్టమే’
ఇటీవల ట్రంప్ ఫ్లోరిడాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “మన దేశం (అమెరికా) ప్రపంచంలో ఏ దేశంలో వ్యాపారం చేసినా నష్టానికే చేస్తోంది. ఈ తప్పు దశాబ్దాలుగా గత ప్రభుత్వాలది. వారే సరైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోలేదు. ఇప్పుడిదంతా చక్కదిద్దాలంటే పన్నులు విధించడమే మార్గం. ప్రపంచ దేశాలపై పన్నులు విధిస్తేనే మన దేశం మళ్లీ ధనిక దేశం అవుతుంది.” అని అన్నారు.

ట్రంప్ ముఖ్యంగా చైనా, మెక్సికో, కెనెడా దేశాలను పన్నులు విధించేందుకు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన కెనెడా, మెక్సికో దేశాల పై 25 శాతం పన్ను, చైనాపై ప్రస్తుతానికి 10 శాతం పన్ను విధిస్తానని ప్రకటించేశారు. ట్రంప్ పన్నుల దాడి నుంచి తప్పించుకోవడానికి యూరోప్ దేశాలు ప్రత్యమ్న మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగానే బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే, పారాగ్వేలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. దీంతో ట్రంప్ పన్నులకు చెక్ పెట్టగలిగామని భావనలో ఉన్నాయి. కానీ ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పన్నులు కాకుండా ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తారా? అన్నది సమీప భవిష్యత్తులోనే తేలనుంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×