E-Paper
Advertisement

ఐఫోన్ కాదు బాస్.. యాపిల్ నుంచి ఊహించని ‘విజువల్’ గ్యాడ్జెట్.. అసలు ఆట 2027 లోనే!

ఐఫోన్ కాదు బాస్.. యాపిల్ నుంచి ఊహించని ‘విజువల్’ గ్యాడ్జెట్.. అసలు ఆట 2027 లోనే!
Advertisement

Apple Smart Glasses: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ సరికొత్త ప్రొడక్ట్ కేటగిరీల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన ఒక స్టాఫ్ మీటింగ్‌లో సీఈఓ టిమ్ కుక్ కూడా ఈ విషయాన్ని హింట్ ఇచ్చారు. ప్రస్తుతం కంపెనీ ఐఓఎస్ 27 (iOS 27) డెవలపర్ బీటా 2 వెర్షన్‌ను పరీక్షిస్తోంది. అయితే, ఇందులో దాగివున్న ఒక సిస్టమ్ ప్రాంప్ట్ కోడ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో లీకై సంచలనం సృష్టిస్తోంది.

కోడ్ నేమ్ B790 కథేంటి?

సామ్ హెన్రీ గోల్డ్ అనే ప్రాడక్ట్ డిజైనర్ ఐఓఎస్ 27 బీటా కోడ్‌లో ‘B790’ అనే వింత కోడ్‌నేమ్‌ను గుర్తించారు. ఈ కోడ్ ప్రకారం.. యాపిల్ ఒక సరికొత్త స్మార్ట్ వేరబుల్ డివైజ్‌పై పనిచేస్తోంది. దీనికి తల ఇరువైపులా (ఎడమ, కుడి) రెండు కెమెరాలు ఉండబోతున్నట్లు ఆ ప్రాంప్ట్ స్పష్టం చేస్తోంది. ఇది యాపిల్ తీసుకొస్తున్న సరికొత్త ఏఐ స్మార్ట్ గ్లాసెస్ (AI Smart Glasses) లేదా కెమెరాలతో కూడిన ఎయిర్‌పాడ్స్ (AirPods) అయి ఉండవచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు:

Advertisement

ఈ కొత్త డివైజ్‌లో ‘విజువల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఉదా: వినియోగదారుడు పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను చూస్తూ.. ‘ఇది ఏంటి?’ అని అడిగితే, అది 1889లో నిర్మించబడింది అని ఈ డివైజ్ సమాధానం ఇస్తుంది. అలాగే మనం చూసే వస్తువులను కేవలం 250 అక్షరాల లోపు టెక్స్ట్‌గా మార్చి వివరించే అద్భుతమైన సామర్థ్యం దీనికి ఉంటుంది.

Also Read: అద్భుతమైన కలర్స్‌లో కేక పుట్టిస్తున్న నథింగ్ ఇయర్‌ఫోన్స్.. ఆ రెండు ఫీచర్లు నెక్ట్స్ లెవెల్ అంతే!

గ్లాసెసా? ఎయిర్‌పాడ్సా?

Advertisement

ఈ డివైజ్ ఏంటనేదానిపై ప్రస్తుతం చిన్నపాటి గందరగోళం నడుస్తోంది. లీక్ చేసిన డిజైనర్ ఇది యాపిల్ స్మార్ట్ గ్లాసెస్ అని చెప్తుండగా.. ప్రముఖ టెక్ వెబ్‌సైట్ ‘9to5Mac’ మాత్రం ఇది కెమెరాలు ఉండే సరికొత్త ఎయిర్‌పాడ్స్ మోడల్ కావచ్చని అంటోంది. యాపిల్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో ప్రస్తుతానికి ఇవన్నీ అంచనాలు మాత్రమే.

మార్కెట్లోకి ఎప్పుడు రావచ్చు?

మరో నివేదిక ప్రకారం.. యాపిల్ తమ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ప్రాజెక్ట్ (కోడ్ నేమ్ N50) లాంచ్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. కాబట్టి.. ఈ సరికొత్త కెమెరా ఎయిర్‌పాడ్స్ లేదా గ్లాసెస్ యాపిల్ 20వ వార్షికోత్సవ ఐఫోన్ మోడల్‌తో పాటు 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ సరికొత్త డివైజ్ టెక్ ప్రపంచంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: స్మార్ట్ టీవీల్లో ఈ సీక్రెట్ ఫీచర్ గురించి తెలిస్తే.. ఇకపై సినిమా చూసే స్టైలే మారిపోతుంది!

Related News

టైపింగ్ మాత్రమే కాదు..మీ ఫోన్ కీబోర్డ్ చేసే అద్భుతమైన పనులు ఇవే!

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.789కే.. బ్లెండ్‌జెట్ పోర్టబుల్ జ్యూసర్

‘ఐస్ బ్యాటరీ’ వింత.. రాత్రి నీరు గడ్డకట్టిస్తారు.. పగలు భవనాన్ని చల్లబరుస్తారు..!

ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్..రూ.799కే ఇయర్‌బడ్స్

మీరు ఆఫ్ చేయాల్సిన అవసరమే లేదు.. ఫుడ్ రెడీ అవగానే ఆగిపోతాయ్

రూ.30 వేలలోపే 50 ఇంచుల టీవీ..ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు!

తక్కువ స్థలంలో ఎక్కువ స్టోరేజ్..అమెజాన్ ఆఫర్‌లో మినీ ఫ్రిడ్జ్‌‌లు

Jio రూ.299 vs Airtel రూ.349.. రెండిటిలో ఏ ప్లాన్ బెస్ట్.. దేనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ?

Big Stories

Advertisement
×