E-Paper
Advertisement

బ్యాక్‌గ్రౌండ్ ఉంటే సరిపోదు….టాలీవుడ్‌ను ఊపేస్తోన్న మైత్రి రవి కామెంట్స్

బ్యాక్‌గ్రౌండ్ ఉంటే సరిపోదు….టాలీవుడ్‌ను ఊపేస్తోన్న మైత్రి రవి కామెంట్స్
Advertisement

Nepotism Debate: నెపోటిజం’ … టాలెంట్ vs లెగసీ అనే డిబేట్ వచ్చిన ప్రతీసారి ఈ పదం వింటూనే ఉంటాం.తాజాగా మరోసారి ఈ పదాన్ని ఇన్ డైరెక్ట్ గా వార్తల్లో పెట్టేశాడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ మైత్రి రవి.సినిమా ఇండస్ట్రీలో వారసత్వం ఉన్నా ఏం చేయలేమని,కావాల్సిందల్లా టాలెంట్ అంటూ ఒక సినిమా ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ఇపుడు ఫిలిమ్ సర్కిల్స్ లో మంటలు పుట్టిస్తున్నాయ్.

విషయంలోకి వెళ్తే ‘రాజా ది రాజా’ అనే ఒక చిన్న సినిమా టీజర్ లాంచ్‌కి చీఫ్ గెస్ట్ గా వెళ్ళాడు మైత్రి రవి,ఇక అక్కడ ఉన్న హీరో రిత్విక్‌ను పొగుడుతూనే ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం పై మనసులోని మాటలని బయటపెట్టాడు.ఇండస్ట్రీలోకి ఎవరైనా సరే గోల్డెన్ స్పూన్ లేదా సిల్వర్ స్పూన్ తో రావొచ్చు కాని ఇక్కడ నిలదొక్కుకోవాలంటే టాలెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ కుండబద్దలు కొట్టారు.అంటే వారసత్వం ఉంటె ఎంట్రీకి మాత్రమే పనికి వస్తుందని, కొత్తవారికి వెనకాల ఇక్కడ ఎవరి సపోర్ట్ ఉండదని, ఒకరకంగా మన యుద్ధం మనమే చేసుకోవాలి” అని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడన్నమాట.

Advertisement

నెపోకిడ్స్ కి గట్టిగానే కౌంటర్

ఇక మైత్రి రవి ఇలా కామెంట్స్ వదిలాడో లేదో మీమ్స్, సెటైర్లకి పని పెట్టారు నెటిజన్లు. “బాబు గారు.. బాబు గారు” అని భజన చేయించుకునే కొందరు నెపోకిడ్స్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చారంటూ ఊదరగొట్టేస్తున్నారు. తాతలు, తండ్రులు వేసిన పునాదుల మీద బిల్డింగ్ లు కట్టొచ్చు ఏమో కాని సినిమాలకి కలెక్షన్స్ రావాలంటే యాక్టింగ్ లో దమ్ము ఉండాలని, అది లేకపోతె మొదటి రోజు మొదటి షో కే ప్రేక్షకులు పారిపోతారని, అదే విషయాన్నీ రవి తన మాటల్లో అంతర్లీనంగా చెప్పాడని గొణుక్కుంటున్నారు మూవీ లవర్స్.

Advertisement

నిజానికి తెలుగు ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు నాలుగైదు పేర్లు మాత్రమే గట్టిగా వినబడేవి.కాని ట్రెండ్ మారింది. ఎంత లెగసీ ఉన్నా, అన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు తీసినా.నటనలో తెలిపొతే నిర్మొహమాటంగా పక్కన పెట్టేస్తున్నారు ఆడియన్స్.ఇక ఇదే సమయంలో అసలు ఎలాంటి సపోర్ట్ లేకపోయినా,కంటెంట్ ఈజ్ కింగ్ అంటూ బాక్సాఫీస్ వద్ద చిన్న హీరోలు చిన్న సినిమాలతో సత్తా చాటడం మనం చూస్తునే ఉన్నాం.

ఎవరైనా రియాక్ట్ అవుతారో లేదో !

ఇక మైత్రీ మూవీ మేకర్స్ లాంటి టాప్ ప్రొడక్షన్ హౌస్ నుండి నిర్మాత ఇలా మాట్లాడటం వెనకాల మరో కారణం ఉందనే టాక్ వినిపిస్తుంది.ఇండస్ట్రీలో కొంతమంది నెపోకిడ్స్ అని చెప్పుకుని తిరిగే వాళ్ళ చుట్టూ కాల్షీట్స్ కోసం తిరగాల్సి వస్తుందని అందువల్లే అసహనంతో ఇలా మాట్లాడి ఉంటాడని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్.
చూడాలి మరి రవి చేసిన ఈ నెపోటిజం కామెంట్స్ పై ఎవరైనా రియాక్ట్ అవుతారో లేదో !

also read:నేను గ్రీన్ కలర్ వేసుకుంటా.. యూఎస్ పౌరసత్వం రూమర్లపై దిల్జిత్ సెటైర్స్ !

Related News

నానా పటేకర్ ఒక దుష్టుడు.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్, తిట్టి పోస్తున్న జనం!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ ట్రైలర్ రిలీజ్!

‘ రామాయణ’ చిత్ర నిర్మాత ఆఫీసులపై ఐటీ దాడులు!

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

సేనాపతి ఈజ్ బ్యాక్.. ‘ఇండియన్ 3’ నుంచి అదిరిపోయే అప్డేట్ !

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?

ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ ఇక లేరు.. గోవాలో అపస్మారక స్థితిలో..

Big Stories

Advertisement
×