Apple Airpods Pro 3 : టెక్ దిగ్గజం యాపిల్ త్వరలోనే కొత్త ఎయిర్ పాడ్స్ ను తీసుకురాబోతుంది. AirPods Pro 3 పేరుతో రాబోతున్న ఈ ఎయిర్ పాడ్స్ 2025లో అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్లోకి రాబోతున్నాయి. ఫిట్‌నెస్, హెల్త్ ట్రాకర్ వంటి లేటెస్ట్ అప్డేట్స్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ తన రాబోయే ఎయిర్‌పాడ్స్ ప్రో ను 2025లో లేటెస్ట్ హెల్త్ ఫీచర్స్ తో లాంఛ్ చేయటానికి సన్నాహాలు చేస్తుంది. బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ నివేదిక ప్రకారం, యాపిల్ ఎయిర్ పాడ్స్ హార్ట్ బీట్ ఫీచర్స్ తో పాటు టెంపరేచర్ సెన్సార్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇంకా లేటెస్ట్ ఫీచర్స్ ఏమున్నాయో మరిన్ని లీక్స్ లో తెలిసే ఛాన్స్ ఉంది.
AirPods Pro 3 తీసుకురాబోతున్న హెల్త్ ట్రాక్ ఫీచర్ ఇప్పటికే యాపిల్ వాచ్ లో ఉంది. అయితే ఎన్నో స్మార్ట్ వాచెస్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ తో వచ్చేసినప్పటికీ యాపిల్ తెచ్చిన వాచ్ లో ఫీచర్స్ బెస్ట్ గా ఉన్నాయనే చెప్పాలి. అయితే ఇయర్‌బడ్స్ లో ఈ ఫీచర్ రావటం నిజంగా టెక్ వర్గాలు సైతం ఊహించని మలుపనే చెప్పాలి.
మార్క్ గుర్మాన్ నివేదిక ప్రకారం.. ఎయిర్‌పాడ్‌లతో పోలిస్తే యాపిల్ వాచ్‌లో హార్ట్ బీట్ కాలిక్యులేటింగ్ ఫీచర్స్ మరింత ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తుంది. రాబోయే AirPods ప్రో 3లో టెక్నాలజీ సైతం మరింత మెరుగ్గా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక యాపిల్ తన ఎయిర్ పాడ్స్ లో కెమెరా ఫీచర్స్ ను సైతం జోడిస్తుందని ఒకప్పుడు టాక్ గట్టిగానే వినిపించింది. ఇక ఈ ఎయిర్ పాడ్స్ లో ఈ ఫీచర్ రాకపోయినా త్వరలో రాబోయో ఎయిర్ పాడ్స్ లో వచ్చే అవకాశం కనిపిస్తుంది.
ఇప్పటికే ఆపిల్ కంపెనీ రాబోతున్న ఎయిర్పోర్ట్స్ లో ప్రధానంగా కెమెరా ఫీచర్స్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటి డిజైన్స్ ఆధారంగా పనిచేసే లేటెస్ట్ గ్యాడ్జెట్స్ తీసుకురావడానికి ఆపిల్ ఎక్కువగా మొక్క చూపిస్తున్నట్టు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఫ్యూచరిస్టిక్ కెమెరా ఎంబెడెడ్ ఎయిర్‌పాడ్స్ లాంఛ్ కావటానికి మాత్రం కొన్నాళ్లు ఆగాల్సిందేనని తెలుస్తుంది.
ఈ ఏడాది ప్రారంభంలో యాపిల్ కంపెనీ తీసుకొచ్చిన AirPods Pro 2లో కొత్త ఫార్మవేర్ అప్డేట్ ను తీసుకొచ్చింది. తేలికపాటి నుండి ఎక్కువ వినికిడి లోపం ఉన్న యూజర్స్ కోసం ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
ఇక యాపిల్ కంపెనీ ఈ ఏడాది లాంఛ్ చేసిన యాపిల్ 16 సిరీస్ లో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది యాపిల్ కంపెనీ టెక్ రంగంలోనే సరికొత్త గ్యాడ్జెట్స్ ను పరిచయం చేయడానికి సిద్ధమవుతుంది. ఆపిల్ 17 సిరీస్ తో పాటు అందుబాటు ధరలోనే ఆపిల్ ఎస్ ఈ 4 ఐఫోన్ సైతం తీసుకురాబోతోంది. ఇక ఆపిల్ సన్ గ్లాసెస్, ఎయిర్ పాడ్స్ తో పాటు యాపిల్ హోమ్ కెమెరాలు సైతం అదిరిపోయే ఫీచర్స్ తో రాబోతున్నాయి.
ALSO READ : జనవరి 1 నుంచి ఆ డివైజెస్ లో వాట్సాప్ సేవలు బంద్… ఎప్పటినుంచంటే!