Kareena Kapoor:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కండల వీరుడుగా గుర్తింపు తెచ్చుకున్న హృతిక్ రోషన్(Hrithik Roshan)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఒకవైపు సినిమాలతోనే కాదు మరొకవైపు వ్యక్తిగత విమర్శల కారణంగా కూడా వార్తల్లో నిలుస్తున్నారు హృతిక్ రోషన్. ప్రత్యేకించి ఇతర హీరోయిన్స్ తో రిలేషన్షిప్ కారణంగా ఎప్పుడూ చర్చనీయాంశంగా మారుతూ ఉంటారు. ఇకపోతే తన చిన్ననాటి స్నేహితురాలు అయిన సుస్సానే ఖాన్ (Sussane khan) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈయన ఆ తర్వాత విడాకులు ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. టీనేజ్ వయసు నుంచే ఆమెతో ప్రేమలో పడ్డ హృతిక్ చివరికి కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు వారసులు కూడా.. ఇద్దరూ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇదిలా ఉండగా హృతిక్ రోషన్, కరీనాకపూర్ (Kareena Kapoor) ఎఫైర్ రూమర్స్ ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి. కానీ ఇప్పటివరకు మీరు దీనిపై స్పందించలేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ స్పందించి ఆశ్చర్యపరిచింది.
కరీనాతో హృతిక్ డేటింగ్..
అసలు విషయంలోకి వెళ్తే ‘కహో నా ప్యార్ హై’ చిత్రం ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన హృతిక్ రోషన్ సరసన కరీనా కపూర్ నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల ఆ ఛాన్స్ మిస్ అవ్వడంతో ఆ స్థానంలో అమీషా పటేల్ (Ameesha Patel) హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత హృతిక్, కరీనాకపూర్ జంటగా పలు సినిమాలలో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య సన్నిహితం పెరగడంతో.. పలు రకాల ఎఫైర్ రూమర్ సృష్టించారు. సుస్సానే తో పెళ్లి కంటే ముందే కరీనాతో డేటింగ్ చేస్తున్నారని ప్రచారం చేశారు. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. కరీనాకపూర్ అవన్నీ పుకార్లే అంటూ కొట్టి పారేసింది.
పర స్త్రీ ఉసురు నేను పోసుకోను..
ముఖ్యంగా గతంలో తమ బంధం పై వచ్చిన రూమర్స్ కు ఇలా స్పందిస్తూ.. “హృతిక్ రోషన్ చాలా మంచి అబ్బాయి. అలా ఎప్పటికీ చేయడు. మరోవైపు సుస్సానే నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె విషయంలో నేను అలా ఎలా చేస్తాను. నేను వేరొక స్త్రీ ఉసురు పోసుకోలేను. అప్పటికే సుస్సానే తో ప్రేమలో పడ్డాడు. ముఖ్యంగా అప్పట్లో ప్రచారమైన ఇలాంటి గాసిప్స్ విని నేను కూడా ఎంతో షాక్ అయ్యాను. నేను విదేశాలకు వెళ్లి వచ్చిన తర్వాత ఈ రూమర్స్ బాగా స్ప్రెడ్ అయ్యాయి. నిజానికి హృతిక్ చాలా సెన్సిబుల్ .ఎవరికి అంత తేలికగా పడిపోడు. సుస్సానే కి, నాకు ఈ విషయం బాగా తెలుసు.నేను ఎలాంటి వ్యక్తినో సుస్సానేకి కచ్చితంగా తెలుసు. నేను స్వార్ధపరురాలిని. నాకోసం నాతో ఉండే మనిషి కావాలి. నేను నా వాడిని ఎవరితో కూడా షేర్ చేసుకోలేను. నేను ఒకరి కొంప కూల్చే ఆడదాన్ని అయితే కాదు. ఎప్పటికీ కూడా నేను అలా ఉండలేను. ముఖ్యంగా మా ఇళ్లల్లో ఇతరుల ఇళ్లలో విధ్వంసం సృష్టించేలా పెంచలేదు. పైగా నేను ఇంకో స్త్రీ శాపాన్ని కోరుకోను” అంటూ చెప్పుకొచ్చింది కరీనాకపూర్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.