Apple Smartwatch : వచ్చే ఏడాది తన స్మార్ట్‌వాచ్ (Apple Smartwatch)కు శాటిలైట్ కమ్యూనికేషన్‌లను తీసుకురావాలని ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ యోచిస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం… ఆపిల్ అల్ట్రా వాచ్ వచ్చే ఏడాది శాటిలైట్ కమ్యూనికేషన్‌ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇంటర్నెట్ లేదా సెల్యులార్ కనెక్షన్ లేకుండా కూడా యూజర్స్ కాల్స్, సందేశాలు పంపడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుంది.
Apple 2022లో ఐఫోన్‌ల ద్వారా తన శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. టెక్ దిగ్గజం గ్లోబల్‌స్టార్ అనే కంపెనీలో $1.5 బిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఇది గ్లోబల్ శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్, ఐఫోన్ కమ్యూనికేషన్ సేవల విస్తరణకు బాధ్యత వహిస్తుంది. 2022లో Apple iPhone 14 మోడల్‌ల కోసం శాటిలైట్ ద్వారా అత్యవసర SOSకి మద్దతు ఇస్తుంది. ఇక వచ్చే ఏడాది తన స్మార్ట్‌వాచ్‌కు శాటిలైట్ కమ్యూనికేషన్‌ను తీసుకురానుంది. ఇది వినియోగదారుల రక్తపోటును సైతం అంచనా వేస్తుంది.
ఐఫోన్ 14 మోడల్‌లతో వచ్చిన శాటిలైట్ కమ్యూనికేషన్‌లో క్రాష్ డిటెక్షన్ టెక్నిక్ కూడా ఉంది. ఇది తీవ్రమైన కార్ క్రాష్‌ను గుర్తించగలదు ఇంకా వినియోగదారుడు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు లేదా వారి ఐఫోన్‌తో ఫోన్ చేయలేని సమయంలో సైతం అత్యవసర సేవలకు డయల్ చేయగలదు. ఐఫోన్ వినియోగదారుడు శాటిలైట్ రిక్వెస్ట్ తో అత్యవసర SOS చేసినప్పుడు ఈ ఫీచర్ వెంటనే పని చేస్తుంది. ఇక దాదాపు 16,000 mph వేగంతో ప్రయాణిస్తున్న గ్లోబల్‌స్టార్.. 24 ఉపగ్రహాలకు సందేశం అందిస్తుంది. ఆ తర్వాత ఈ శాటిలైట్ సందేశాన్ని స్వీకరించిన ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అనుకూల గ్రౌండ్ స్టేషన్‌లకు పంపిస్తుంది.
అయితే, హైకర్లు, క్రీడా ఔత్సాహికులు ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి వారి ఐఫోన్‌లను వెంటే తీసుకెళ్లాలి. ఇప్పటికే ఈ ఏడాది Apple ఈ ఫీచర్‌ని అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పుడు ఇది iMessage ద్వారా సందేశాలను పంపడానికి వ్యక్తులను అనుమతిస్తుంది. అయితే, శాటిలైట్ కమ్యూనికేషన్‌లతో 2025లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను ప్రారంభించడం గురించి ఇప్పటివరకూ యాపిల్ ధృవీకరించలేదు. అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రస్తుత Apple వాచ్ అప్‌గ్రేడ్ వెర్షన్ కూడా త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక వచ్చే ఏడాది ఆపిల్ కంపెనీ లేటెస్ట్ గ్యాడ్జెట్స్ తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ మెుబైల్స్ సెప్టెంబర్ లో విడుదల కానున్నాయి. ఇక అంతకుముందే యాపిల్ SE4 మొబైల్ సైతం 2025 ఏప్రిల్ లో అందుబాటులోకి రానుంది. వీటితో పాటు ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్, స్మార్ట్ వాచెస్ కూడా లాంఛ్ కాబోతున్నాయి. వీటితో పాటు యాపిల్ ఫోల్డబుల్ మెుబైల్స్ సైతం రాబోతున్నట్లు కొద్ది రోజుల క్రితమే ఓ నివేదిక తెలిపింది. ఇక ఇప్పటికే టెక్ ప్రియులంతా ఈ గ్యాడ్జెట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. తాజాగా వీరికి ఇంకో గుడ్ న్యూస్ చెబుతూ స్మార్ట్ వాచ్ కు శాటిలైట్ కనెక్షన్ అందిస్తున్నట్టు బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది.
ALSO READ : సామ్ సాంగ్ S25 రేటు పెద్ద ఎక్కువేం కాదు.. ముందు మెుబైల్స్ తో సమానమే!