BigTV English

Chess Champion : ప్రపంచ చెస్ ఛాంపియన్ గా భారత కుర్రాడు.. అతిపిన్న వయస్సులో అరుదైన రికార్డ్

Chess Champion : ప్రపంచ చెస్ ఛాంపియన్ గా భారత కుర్రాడు.. అతిపిన్న వయస్సులో అరుదైన రికార్డ్

Chess Champion : ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత్ ఘన విజయం సాధించింది. అతి చిన్న వయసులోనే ప్రపంచ చెస్ వేదికపై తిరుగులేని విజయంతో.. విశ్వ విజేతగా నిలిచాడు.. తెలుగు కుర్రాడు దొమ్మరాజు గుకేష్. చైనా ఆటగాడు డింగ్ లిరేన్ తో పోటాపోటీగా జరిగిన అంతర్జాతీయ మ్యాచ్ లో.. తన ఎత్తులతో ప్రత్యర్థిని చిత్తు చేసి, విశ్వ విజేత కిరీటాన్ని భారత్ కు చేర్చాడు గుకేష్.


చెస్ గేమ్ లో తన ఎత్తులతో ప్రత్యర్థి ఓటమి అంగీకరించేలా చేసిన ఈ కుర్రాడు.. కేవలం 18 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ గా అవతరించాడు. తన ప్రతిభతో భారత్ ఖాతాలో చెరిగిపోని.. సువర్ణాక్షరాలతో లిఖించేలా.. అద్భుత విజయాన్ని చేర్చాడు. అంతర్జాతీయ క్రీడా చరిత్రలోనే అతి చిన్న వయసులోనే ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి అందరి మన్ననలు అందుకుంటున్నాడు దొమ్మరాజు గుకేష్. వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకున్న విశ్వనాథ ఆనంద్ తర్వాత రెండో భారతీయ గ్రాండ్ మాస్టర్ గా నిలిచి రికార్డ్ సృష్టించాడు గుకేష్. చెన్నైలో ఉంటున్న తెలుగు కుటుంబానికి చెందిన గుకేష్.. అతిపిన్న వయసులోనే ప్రపంచ ఛాంపియన్ గా మారి.. విశ్వనాథ్ ఆనంద్ రికార్డును తుడిచిపెట్టేశాడు. ఈ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు.

తాజాగా సింగపూర్ లో జరిగిన ప్రపంచ చెస్ పోటీల్లో గుకేష్ సత్తా చాటాడు. చైనా ఆటగాడు డింగ్ తో జరిగిన మ్యాచ్ లో.. 13 ఆటలు పూర్తయ్యే సరికి… 6.5-6.5 తో ఆట టైగా ముగిసింది. దీంతో ఛాంపియన్ ను నిర్ణయించే.. చివరి క్లాసికల్ గేమ్ లో గుకేష్ అద్భుతమైన పై ఎత్తులతో.. తనదైన మార్క్ ఆట తీరుతో.. గేమ్ ని గెలుచుకున్నాడు. ప్రత్యర్థిని ఒత్తిడితో నెట్టడంతో పాటు తన వ్యూహాత్మక ప్రదర్శనతో చైనా అటగాడే స్వయంగా ఓటమిని అంగీకరించేలా చేయగలిగాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ ను అందుకోగలిగాడు.


ఇది గుకేష్ ఒక్కడికే వ్యక్తిగతమైన విజయం కాదు.. భారత చరిత్రలో సైతం ఓ మైలురాయిగా నిలిచిపోయిందని అంటున్నారు క్రీడాకారులు. విశ్వనాథ్ అనంద్ తర్వాత భారత చెస్ రంగం ప్రపంచ శిఖరాగ్రానికి చేరుకోవడంలో ఈ విజయం కీలకంగా చరిత్రలో నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు.

Also Read : కేంద్రం కీలక నిర్ణయం.. అలర్ట్ అయిన ప్రతిపక్ష పార్టీలు.. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు

సీఎంల ప్రశంసలు
గుకేష్ సాధించిన విజయంపై తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అతిచిన్న వయస్సులోనే ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన తెలుగు కుర్రాడు గుకేష్ హృదయపూర్వక అభినందనలు అంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్ చేశారు. కేవలం 18 ఏళ్లకే ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్ అవతరించడాన్ని ప్రశసించారు. సింగపూర్ వేదిక చరిత్ర సృష్టించాడంటూ అభినందించారు. ఈ అద్భుత విజయాన్ని దేశం మొత్తం సంబురంగా జరుపుకుంటుందన్న నారా చంద్రబాబు నాయుడు.. రాబోయే దశాబ్దాలలో మరిన్ని విజయాలు సాధించాలని, మరిన్ని ప్రశంసలు పొందాలంటూ ఆకాంక్షించారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×