Bachhala Malli: హిట్ కోసం ఎదురుచూస్తున్నటాలీవుడ్ హీరోల్లో అల్లరి నరేష్ ఒకడు. ఒకప్పుడు కామెడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నరేష్.. తండ్రి ఈవీవీ సత్యనారాయణ మృతి చెందాకా హిట్ కోసం కష్టాలు పడుతున్నాడు. ఒకప్పుడు కామెడీ హీరోలు అంటే స్పెషల్ గా ఉండేవారు. కానీ, ఇప్పుడు కథకు తగ్గట్టు హీరోలు కూడా కామెడ పాత్రలు చేస్తున్నారు.
ఇక ఇలా కామెడీ హీరోగా ఉంటే కష్టం అనుకున్న నరేష్.. రూట్ మార్చి నాంది అనే సినిమాతో ఫుల్ సీరియస్ యాక్షన్ మోడ్ లో కనిపించాడు. అప్పటివరకు నరేష్ ముఖం చూస్తే నవ్వే వస్తుంది అనుకున్నవారికి.. ఆయనలో ఉన్న మరో యాంగిల్ ను పరిచయం చేశాడు. ఇక కథను బట్టి అటు కామెడీ పాత్రలు.. ఇటు సీరియస్ పాత్రలు చేస్తూ వస్తున్నాడు.
Raviteja: రవితేజ కూతురు టాలీవుడ్ ఎంట్రీ.. సితార ఎంటర్ టైన్మెంట్స్ లో.. ?
నాంది తరువాత అంతటి హిట్ ను నరేష్ అందుకోలేదు. దానికోసం బాగా కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే నరేష్ నటిస్తున్న తాజా చిత్రం బచ్చలమల్లి. సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా, బాలాజీ గుట్ట నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నరేష్ సరసన హనుమాన్ బ్యూటీ అమృత అయ్యర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 20 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. వరుసగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మరో లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మరీ అంత కోపం.. కాదు కాదు అలంకారం. నిజం ఓ అబద్దం.. అయినదంటే బతుకు శూన్యం అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తన కోపమే తన శత్రువు అని పెద్దలు చెప్పిన మాట.. ఈ సాంగ్ లో చూపించారు. చిన్నతనం నుంచి హీరో పడే కోపం వలన అతను ఏం కోల్పోయాడు అనే సందర్భాన్ని ఎంతో చక్కగా వివరించారు.
Sobhita Akkineni: రాయల్ లుక్ లో అక్కినేని కోడలు.. ఏమైనా ఉందా.. అసలు
పూర్ణాచారి అనే కొత్త లిరిసిస్ట్ ఈ సాంగ్ కు లిరిక్స్ అందించగా.. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కాలంలో ఇంగ్లిష్ లిరిక్స్ తో గోల గోలగా ఉండే సాంగ్స్ విని సినీ విసిగిపోయిన సంగీత అభిమానులకు ఈ సాంగ్ లోని లిరిక్స్, మ్యూజిక్ ఎంతో కొంత ఉపశమనాన్ని ఇస్తాయి అని చెప్పొచ్చు.
అహం, కోపం వలన మనుషుల బ్రతుకు ఏమవుతుంది అనేది పూర్ణాచారి ఎంతో అద్భుతంగా రాశాడు. ముందు ముందు ఈయన పేరు గట్టిగ వినిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక సాయి విగ్నేష్ వాయిస్ ఈ సాంగ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో నరేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.