BigTV English

iPad mini: ఆపిల్ కొత్త ఐప్యాడ్ చూశారా…? ఫీచర్స్ చూస్తే దిమ్మ తిరిగిపోద్దీ

iPad mini: ఆపిల్ కొత్త ఐప్యాడ్ చూశారా…? ఫీచర్స్ చూస్తే దిమ్మ తిరిగిపోద్దీ

Apple unveils new iPad mini with apple intelligence: బాహాటమైన ప్రచారం ఉండదు.. కానీ, ఆ కంపెనీ విడుదల చేసే ఏ వస్తువైనా ది బెస్ట్ గా ఉంటుంది. క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్. అందుకే ఆ కంపెనీ పేరు చెప్పగానే నో క్వశ్చన్స్ అంటుంటారు కస్టమర్స్. ఆ కంపెనీనే ప్రముఖ ఆపిల్ కంపెనీ. ప్రస్తుతం మరో వినూత్నమైన తన ప్రొడక్ట్ ను విడుదల చేసింది. ఎన్నో ఫ్యూచర్లు అందులో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది చూసిన కస్టమర్లు ఆశ్చర్యపోతున్నారు.


Also Read: రూ. 8,999కే Redmi 5G స్మార్ట్ ఫోన్ – స్పెసిఫికేషన్స్ అదుర్స్ గురూ!

మూడేళ్ల తరువాత మంగళవారం ఆపిల్ కంపెనీ ఐప్యాడ్ మినీని విడుదల చేసింది. A17 ప్రో చిప్ తో కూడిన ఈ ఐప్యాడ్ లో ఇంటలీజెన్స్ ఫ్యూచర్స్ చాలా ఉన్నాయి. కళ్లకు ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఉండే విధంగా దీనిని డిజైన్ చేసింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఐప్యాడ్ పాకెట్ సైజులో తయారు చేసింది. దీని సైజు వచ్చి 8.30 ఇంచులు ఉంది.


ఇందులో 128 జీబీ స్టోరీజీతో దీనిని విడుదల చేసింది ఆపిల్ కంపెనీ. గతంలో విడుదల చేసిన ఆ ఐప్యాడ్ తో పోలిస్తే ఇది డబుల్ స్టోరేజీ. మిగతా ఐప్యాడ్ ల కన్నా కూడా ఇది చాలా ఉత్తమం అని చెబుతున్నది సదరు కంపెనీ. చాలా ఫాస్ట్ గా ఇది పనిచేయనున్నదని చెబుతుంది. గతంలో విడుదల చేసిన ఐప్యాడ్ లలో కంటే ది బెస్ట్ ఫ్యూచర్స్ తో దీనిని రూపొందించినట్లు పేర్కొన్నది.

ఇటు కెమెరా విషయంలో ఎక్కడా కూడా తగ్గలేదు. 12 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను ఇందులో పొందుపరిచింది. ఇది హెచ్డీఆర్ -4 సపోర్ట్ తో చాలా ఫాస్ట్ గా పనిచేయనున్నదని చెబుతున్నారు. స్మార్ట్ డాక్యుమెంట్ స్కానింగ్ కోసం చాలా ఉపయోగకరమని కంపెనీ పేర్కొన్నది. ఇటు బ్యాటరీ విషయంలో కూడా చాలా బెటర్ అని చెబుతున్నది.

Also Read: ఆఫర్ అదుర్స్.. స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపుతో పాటు రూ.2,499 ఇయర్ బర్డ్స్ ఫ్రీ

ఈ కొత్త ఐప్యాడ్ ఇండియాలో మూడు స్టోరేజ్ కాన్ఫగరేషన్లలో లభించనున్నది. 128 జీబీ, 256 జీబీ, 512 జీబీలలో లభిస్తుంది. వీటి ధరలు వచ్చేసి వరుసగా. రూ. 49,900, రూ. 59,900, రూ. 79,900గా ఉంది. బ్లూ, పర్పుల్, స్టార్ లైట్, స్పేస్ గ్రే.. ఈ నాలుగు కలర్లలో లభించనున్నాయి. ఆపిల్ ఇండియా ఆన్ లైన్ స్టోర్, ఆపిల్ ఆఫ్ లైన్ స్టోర్స్ అయిన ఆపిల్ బీకేసీ, ఆపిల్ సాకేత్, ఇతర అధీకృత రిటైలర్లతో సహా పలు రిటైల్ అవుట్లెట్లలో ఈ నెల 23 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. లేదా ఆపిల్ వెబ్ సైట్ లో కూడా వెంటనే ఆర్డర్ పెచ్చుకోవొచ్చు.

Related News

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Galaxy S24 FE: గెలాక్సీ S24 FE పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్.. ఇప్పుడే కొనుగోలు చేయాలా?

Realme P3 5G Launched: రియల్‌ మీ పి3 5జి.. ఫోటోలు, గేమ్స్, బ్యాటరీ అన్నీ సూపర్!

iOS 26 Downgrade: కొత్త iOS 26‌తో ఐఫోన్లలో తీవ్ర సమస్యలు.. పాత iOSకు ఇలా డౌన్‌గ్రేడ్ చేయండి

Google Storage: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఇలా చేస్తే క్షణాల్లో సగం ఖాళీ అవుతుంది!

Flipkart vs Amazon iPhone: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ ఆఫర్లలో ఏది బెస్ట్?

Jio Keypad 5G: స్మార్ట్‌ఫోన్‌లకు షాక్.. జియో కీప్యాడ్ 5జి కొత్త రికార్డు

Big Stories

×