BigTV English
Advertisement

Matthu Vadalara 2: చూసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుంది ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వేసుకున్నారు

Matthu Vadalara 2: చూసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుంది ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వేసుకున్నారు

Matthu Vadalara 2: మత్తు వదలరా సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు రితీష్ రానా. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ప్రజెంట్ చేసింది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చెర్రీ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సాధించుకొని అద్భుతమైన ఘనవిజయం సాధించింది. సింహ కోడూరి, నరేష్ అగస్త్య, సత్య కలిసి నటించిన ఈ సినిమా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఈ సినిమాలో ముఖ్యంగా సత్య కామెడీ హైలెట్ అని చెప్పాలి. అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ సినిమా టేకింగ్.


ఈ సినిమా తర్వాత రితీష్ రానా దర్శకత్వం వహించిన సినిమా హ్యాపీ బర్త్ డే. లావణ్య త్రిపాఠి నటించిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. కానీ ఈ సినిమాలోని కొన్ని వీడియోస్ మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఈ సినిమాలో వెన్నెల కిషోర్ చేసిన సీన్స్ మేజర్ హైలెట్. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను చాలా ఆసక్తికరంగా కట్ చేశాడు రితీష్ రానా. 2000 రూపాయల నోట్లపై రాకేష్ మాస్టర్ బొమ్మ ఉండటం. అన్ని భాషల్లో తెలుగు అను రాస్తూ తెలుగు పాన్ ఇండియా సినిమా అని పబ్లిసిటీ చేయటం. ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపించాయి. రాజమౌళి మాట్లాడుతూ రితీష్ రానాకి వెటకారం ఎక్కువ అని ఇదే ఎగ్జాంపుల్ గా కూడా చెప్పాడు.

ఇక ప్రస్తుతం మత్తు వదలరా 2 సినిమా వచ్చిన సంగతి. ఈ సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేసార. సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆసక్తికరంగా అనిపించాయి. ముఖ్యంగా ఒక పోస్టర్ లో ఒక వీసిడిని చూపిస్తూ ఉన్నారు. అయితే ఆ వీసిడి పై ఉన్నది బ్రూస్లీ అని అందరూ అనుకుంటారు. కానీ ఆ వీసిడి పై ఉన్నది వెన్నెల కిషోర్ యూత్ స్టార్ యువ అనేది ట్యాగ్. ఆ సినిమా టైటిల్ వచ్చి మొరాన్. దానిపై ఏ ఫిలిం బై రితేజ్ రాజా అని అని రాసుకు వచ్చాడు రితీష్ రానా. ఈ పోస్టర్ చూస్తుంటే రితేష్ రానాకి ఇంకా వెటకారం అలానే కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. ఈ వెటకారాన్ని ఇష్టపడే ఫ్యాన్స్ కూడా ఉన్నారనేది వాస్తవం.


సెప్టెంబర్ 13న రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాని ఓటీటీ లో చూసిన చాలామంది ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ని కట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా చూసినప్పుడు పర్టిక్యులర్గా అనిపించవు. కానీ కొన్ని సీన్స్ లో మాత్రం కావాలని కొందరిని రితేష్ ట్రోల్ చేశాడు అని అనిపిస్తుంది. ఒక పబ్లో రాజశేఖర్ పాటను పాడి సత్య పర్ఫామెన్స్ చేయడం, అలానే ఒక కిడ్నాప్ విషయంలో ఘర్షణ సినిమాలోని డిసిపి రామ్ చందర్ ని ఇమిటేట్ చేస్తాడు. అలానే సునీల్ గురించి సింహ తో ప్రస్తావిస్తున్న ప్రతిసారి మైఖేల్ ఒక్కడే రా అంటూ ఉంటాడు. వాస్తవానికి ఇదే పదాన్ని బాలకృష్ణ ఒక స్టేజ్ పైన ఒక అబ్యూజ్ గా వర్డ్ గా యూస్ చేశారు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన స్కంద సినిమాలో ఎథికల్ హ్యాకింగ్ గురించి కూడా ఒక టాపిక్ వస్తుంది. ఈ సినిమాలో కూడా ఎథికల్ హ్యాకింగ్ చేస్తుంటాడు సత్య. ఇలాంటివి ఈ సినిమాలో కోకొల్లలు ఉన్నాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×