Redmi : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఆపిల్, వివో, రెడ్ మీ, రియల్ మీ స్మార్ట్ ఫోన్స్ పై అదిరిపోయే ఆఫర్స్ కొనసాగుతున్నాయి. కొన్ని ప్రత్యేక మొబైల్స్ పై భారీ తగ్గింపు సైతం కొనసాగుతుండగా.. రెడ్ మీ 13c 5g మొబైల్ పై అత్యంత తగ్గింపును ఆ సంస్థ అందిస్తుంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Readmi ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ తో అదిరిపోయే మొబైల్స్ ను తీసుకొస్తుంది. టాప్ స్మార్ట్ ఫోన్స్ పై ఆఫర్స్ ను సైతం అందిస్తుంది. సేల్ లో భాగంగా Readmi 13C 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్ పై 36% డిస్కౌంట్ను రెడ్మి అందిస్తుంది. ఈ ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ సైతం అత్యద్భుతంగా ఉండటంతో అత్యంత తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే కస్టమర్స్ కు ఇది మంచి అవకాశం గా చెప్పవచ్చు.
Readmi 13C 5G స్మార్ట్ ఫోన్ 4GB RAM + 128GB వేరియెంతో వస్తుంది. ఇక దీని ధర రూ. 8999 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఎక్స్చేంజ్ లో ఫోన్ కొనాలి అనుకున్న వారికి మరింత తగ్గింపును అందిస్తుంది. ఇక బ్యాంకు కార్డుపై కొనుగోలు చేసే కస్టమర్కు స్పెషల్ ఆఫర్స్ ను సైతం అందిస్తోంది.
ALSO REAd : ఆఫర్ అదుర్స్.. స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపుతో పాటు రూ.2,499 ఇయర్ బర్డ్స్ ఫ్రీ
Readmi 13C 5G స్మార్ట్ ఫోన్ లో 3 వేరియంట్స్ లో అందుబాటులో ఉన్నాయి. 4GB RAM + 128 GB వేరియంట్, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్, 8GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. HZ బ్యాటరీ సామర్థ్యం తో పాటు ఇతర స్పెసిఫికేషన్స్ సైతం ఉన్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్ లో డిస్ప్లే అత్యధికంగా డిజైన్ చేశారు. 1600*720 పిక్సెల్స్ తో 6.74 అంగుళాల హెచ్డి డిస్ప్లే 90 HZ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ సైతం అందుబాటులో ఉంది. ఇక ఆక్టాకోర్ మీడియా టెక్ డైమన్ సిటీ 6100 ప్లస్ 6 HZ చిప్సెట్ తో ఈ మొబైల్ లాంచ్ అయింది. ఆర్మామెల్ జి 57 ఎం సి టు జిపియు గ్రాఫిక్స్ కోర్ తో వచ్చిన ఈ ఫోన్ గేమింగ్ యూజర్స్ కు అత్యద్భుతంగా పనిచేస్తుంది.
ఇక ఈ ఫోన్లో 4GB RAM + 128 స్టోరేజ్ వేరియంట్ మెమోరియన్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. ఇక మెమొరీ కార్డు ఉపయోగించడానికి ఫోన్లో మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ తో డిజైన్ వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ అప్డేట్స్ తో పాటు సెక్యూరిటీ అప్డేట్స్ సైతం కలిగి ఉందని.. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫేస్ అన్లాక్ ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పుకొచ్చింది.