Multiverse: మన జీవితంతో పాటు మరో జీవితం, మరో ప్రపంచంలో లేదా మరో రియాలిటీలో నడుస్తుందనే ఆలోచన. ఈ ఆలోచన ప్రకారం, మనం ఇక్కడ జీవిస్తున్న జీవితంతో పాటు, వేరే చోట మనలాంటి మనమే వేరే నిర్ణయాలు తీసుకుంటూ, వేరే జీవితాన్ని గడుపుతూ ఉండొచ్చు. దీన్నే పారలల్ లైఫ్ అంటారు. పారలల్ లైఫ్ అనగానే చాలా మందికి సినిమాలు, సైన్స్ ఫిక్షన్ కథలు, కొరియన్ డ్రామాలే గుర్తొస్తాయి. మరి నిజ జీవితంలో ఇలాంటివి సాధ్యమేనా? మరి మనషులు జీవిస్తున్న ఈ ప్రపంచమే మరొకటి ఉంటే..? ఊహించుకోవడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదా?
పారలల్ లైఫ్ లేదా మల్టీ వర్స్ అనేది ఒక ఆసక్తికరమైన, అందమైన ఫాంటసీ. ఈ ఫాంటసీ ప్రకారం మన లోకంతో పాటు వేర్వేరు లోకాలు కూడా ఉండవచ్చు, ఈ వేర్వేరు లోకాలు వేర్వేరు నియమాలు, సంఘటనలు, లైఫ్ స్టైల్‌ను కలిగి ఉంటాయి. ఈ పారలల్ లైఫ్ సైంటిస్టులు, రైటర్లు, సినిమా ప్రొడ్యూసర్ల ఊహాగానాలను మరింత పెంచుతుంది. ఈ పారలల్ లైఫ్ అనేది నిజంగా ఉందా ఇది ఒక ఊహ మాత్రమేనా అనేది ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.
మల్టీ వర్స్ థియరీ
క్వాంటం బయోలాజికల్ సైన్స్, స్ట్రింగ్ థియరీ వంటి సైంటిఫిక్ ఫీల్డ్‌లు ఈ మల్టీ వర్స్ ఎక్కడ నుంచి ఎలా స్టార్ట్ అయ్యింది అనే విషయాన్ని సూచిస్తాయి. ఈ థియరీ ప్రకారం ప్రతి నిర్ణయం లేదా జరిగే ప్రతి సంఘటన ఒక కొత్త లోకాన్ని సృష్టించవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక లోకంలో బాధతో జీవిస్తున్నట్టయితే మరొక లోకంలో చాలా ఆనందంగా ఉండవచ్చు. ఈ విధంగా, వేర్వేరు లోకాలు వేర్వేరు ఫలితాలను, సంఘటనలను సృష్టిస్తాయని సైన్స్ చెబుతోంది.
పారలల్ లైఫ్
ఈ పారలల్ లైఫ్ అనే ఊహ లేదా ఆలోచన మన ఆలోచనలను మరింత లోతుకు తీసుకెళ్తుంది. ఒక మనిషి రెండు ప్రపంచాల్లో ఉంటే ఎలా ఉంటుందనేదే ఈ కాన్సెప్ట్. ఒక లోకంలో మీరు ఒక డాక్టర్ అయ్యి ఉంటే ఇంకొక లోకంలో టీచర్ అయ్యి ఉండొచ్చు. ఈ ఫాంటసీని లిటరేచర్, సినిమా ఇంకా వీడియో గేమ్‌లలో ఎక్కువగా ఉపయోగించారు. ఉదాహరణకు, హాలీవుడ్ చిత్రాలైన ‘స్పైడర్ మాన్ ఇంటు ది స్పైడర్ వర్స్’, ‘ఎవిరీథింగ్ ఎవిరీవేర్ ఆల్ ఎట్ వన్స్’
ఈ ఫాంటసీ ని చాలా అద్భుతంగా చూపించాయి.
ఈ పారలల్ లైఫ్ ఆలోచన మన జీవితాలపై గట్టి ప్రభావమే చూపుతుంది. ఇది మన నిర్ణయాలు, మనకి ఎదురయ్యే రకరకాల సంఘటనలు, వాటి ఫలితాల గురించి ఇంకా లోతుగా ఆలోచించేలా చేస్తుంది. ఒకవేళ మనం వేరేలా ప్రవర్తించి ఉంటే ఎం జరిగి ఉండేది? అనే ఆలోచన మనలో క్రియేటివిటీని, ఆత్మ పరిశీలనను మరింత బలంగా ప్రేరేపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆధారాలు ఉన్నాయా?
పారలల్ లైఫ్ ఒక సైంటిఫిక్ థియరీ మాత్రమే కాదు, ఇది మనుషుల ఊహాశక్తికి ఒక పెద్ద గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇది మనకు అనంత సాధ్యతలను వెతకమంటూ ప్రోత్సహిస్తుంది. సైన్స్ ఈ పారలల్ లైఫ్, మల్టీ వర్స్‌ల రహస్యాన్ని పూర్తిగా కనిపెట్టే వరకు ఇది మన ఊహాగానాలను, కలలు, కథనాలను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఇది ఒక అందమైన ఫాంటసీ అయినా దీని నిరూపణ జరిగేంత వరకు ఇది ఒక ఉహగానే మిగిలిపోతుంది.