Big Stories

Floating Solar Panels:- ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్‌కు ఏషియానే స్ఫూర్తి..

- Advertisement -

- Advertisement -

Floating Solar Panels:- ప్రపంచవ్యాప్తంగా మనుషుల సంఖ్య పెరుగుతుంది. దానికి తగినట్టుగానే వారి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. దానికి తగిన వనరులను ఏర్పాటు చేయలేక, వస్తువులను అందించలేక పరిశోధకులు సతమతమవుతున్నారు. అయినా కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ వారికి తోచిన సాయం చేస్తున్నారు. తాజాగా కరెంటు కష్టాలను తీర్చడం కోసం సోలార్ ప్యానెల్స్ అనేవి ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి. అందులోనూ ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ అనేవి అంతటా క్రేజ్‌ను సంపాదించుకున్నాయి.

అభివృద్ధి చెందిన దేశాల్లో మొదలయిన ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ అనేవి ఇండియా వరకు వచ్చేశాయి. ఇండియాలోని పలు రాష్ట్రాలు ఉచితంగా ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్ సర్వీసులను అందరికీ అందించాలని కూడా అనుకుంటున్నారు. అయితే అభివద్ధి చెందిన దేశాల్లోని చిన్న చిన్న గ్రామాల్లో సైతం ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వాలు నిర్ణయించుకుంటున్నాయి. అందులో ఒకటి న్యూయార్క్‌లోని కోహెస్. ఇప్పటికే ఇద్దరు సిటీ ప్లానర్స్ కలిసి కోహెస్‌లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు.

కోహెస్‌లో పెద్దగా సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయడానికి స్థలం లేదని సిటీ ప్లానర్స్ గమనించారు. కానీ అక్కడ 6 హెక్టార్లలో నీటి రిజర్వాయర్ ఉంది. అప్పుడే వారికి ఈ ఆలోచన వచ్చింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ అనేవి క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. అందుకే ఆ రిజర్వాయర్‌పైనే ఈ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ముందుగా ఏషియాలో ఏయే ప్రాంతాల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి, అవి అసలు ఎలా పనిచేస్తాయని గూగుల్ చేసి తెలుసుకున్నారు.

ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ద్వారా కరెంటు చాలా సేవ్ అవుతుందని, అంతే కాకుండా దాని వల్ల పెరుగుతున్న ఖర్చు కూడా తగ్గిపోతుందని సిటీ ప్లానర్స్ గుర్తించారు. ఆలస్యం చేయకుండానే వెంటనే కోహెస్‌లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఇదే విధంగా దాదాపు 124 దేశాల్లోని 6 వేల సిటీల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ అనేవి మనుషులకు ఉపయోగపడుతున్నాయని సర్వేలో తేలింది. ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ అనేవి ముందుగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనిలాగా అనిపించినా.. ఇప్పుడు మెల్లగా దాని ఖర్చు తగ్గుతూ వస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News